Woman Thrashes Watchman With Broom After Lift Stops Working - Sakshi
Sakshi News home page

Viral Video: అపార్ట్మెంట్ వాచ్ మెన్ పై చీపురు తిరగేసిన మహిళ 

Published Thu, Jul 13 2023 8:08 PM | Last Updated on Thu, Jul 13 2023 8:18 PM

Woman Thrashes Watchman With Broom After Lift Stops Working - Sakshi

ఆగ్రా: యూపీ సికందరాలోని రెయిన్‌బో  అపార్ట్మెంట్లో లిఫ్ట్ మధ్యలోనే ఆగిపోయిందన్న కోపంలో కిందకు వచ్చిన తర్వాత వాచ్ మెన్ ను చెడామడా తిట్టడమే కాకుండా చీపురు కూడా తిరగేసింది. వయసులో పెద్దాయన  అని కూడా చూడకుండా ఆ మహిళ నిర్దాక్షిణ్యంగా చీపురుతో కొడుతున్న వీడియో అపార్ట్మెంట్ సీసీ కెమెరాలో రికార్డయింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల చల్ చేస్తోంది. 

ఆగ్రాలోని సికందరాలో రెయిన్‌బో అపార్ట్మెంట్ వాచ్ మెన్ గా పనిచేస్తోన్న జగదీశ్ ప్రసాద్ తివారీ సికందరా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. అపార్ట్మెంట్లో C -8 ఫ్లాట్  లో నివసించే అనిల్ శర్మ భార్య అనిత లిఫ్ట్ ఆగిపోయిందన్న కారణంతో అనరాని మాటలు అంటూ తనపై చీపురుతో దాడి చేసిందని, ఒకపక్క తాను వివరణ ఇస్తున్నా కూడా వినకుండా కొట్టిందని ఆరోపించాడు. ఆమెతో పాటు వారి కుమారుడు ప్రాన్షు కూడా మాటలతో దూషించాడని తెలిపాడు. 

ఈ తతంగం మొత్తం అక్కడ సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్ కావడంతో ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం తోపాటు వీడియోను కూడా ఆధారాలుగా సేకరించినట్టు తెలిపారు సికందరా పోలీసులు.      

ఇది కూడా చదవండి: Heavy Rains : చెత్తనంతా తిరిగిచ్చి.. లెక్క సరిచేసి"నది"..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement