
పిల్లలు ప్రయోజకులైనపుడు ఆ తల్లితండ్రులు ఆనందంతో పొంగిపోతారు. తమ కష్టం ఫలించి కలలు నెరవేరాలని వేయి దేవుళ్లకు మొక్కుకుని, ఆశలు ఫలించాక వారికి కలిగే ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం. అలాంటి ఊహించిన దానికంటే మరింత ఉన్నత స్థితికి చేరితే .. ఆ ఆనందానికి అవధులు ఉండవు. సుమతీ శతకకారుడు చెప్పినట్టు పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు పుట్టినపుడు కాదు, ప్రయోజకుడై తమకు గర్వంగా నిలిచినపుడు కలిగేది.
అలాగే పిల్లలు కూడా అమ్మానాన్న కల నెరవేర్చాలని కలలు కంటారు. మంచి చదువు చదివి, ఉన్నతోద్యోగం సంపాదించాక కన్నవారిని ఆనందంగా అపురూపంగా చూసుకోవాలని పట్టుదలగా ఎదుగుతారు. తమ కలను సాకారం చేసుకొని పేరెంట్స్ కళ్లలో ఆనందం చూసి పొంగిపోతారు. అలాంటి ఆనందదాయకమైన స్ఫూర్తిదాయకమైన నిజజీవిత కథనం గురించి తెలుసుకుందాం.
న్యూఢిల్లీకి చెందిన ఒక తండ్రికి ఇలాంటి అద్భుతమైన ఆనందమే కలిగింది. ఖగోళ శాస్త్రవేత్త ఆర్యన్ మిశ్రా తన సొంత తన తండ్రినీ, తల్లినీ లగ్జరీ హోటల్ ఐటీసీకి ఎలా తీసుకువచ్చాడో పంచుకున్నాడు. ఎక్స్( ట్విటర్)లో ఆయన షేర్ చేసిన ఈ స్టోరీ ఇంటర్నెట్‌ను విపరీతంగా ఆకర్షిస్తోంది. 20 లక్షలకు పైగా వ్యూస్‌ను దక్కించుకుంది.
ఆర్యన్ తండ్రి ఐటీసీ హోటల్‌లో 1995- 2000 వరకు 25 సంవత్సరాలు వాచ్‌మెన్‌గా పనిచేశాడు. పాతికేళ్ల తరువాత అదే హోటల్‌కు భార్యతో కలిసి గెస్ట్‌గా రావడమే ఈ స్టోరీలోని విశేషం. దీనికి సంబంధించిన ఫోటోను కూడా ఆర్యన్ ట్వీట్ చేశారు. తరువాత విందు కోసం అతిథిగా పనిచేశాడు. వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నపుడు.. ఇదే హెటల్‌కి డిన్నర్‌కి వస్తానని బహుశా ఆయన ఊహించి ఉండడు. కానీ అతని కొడుకు మాత్రం తండ్రికి అంతులేని ఆనందాన్ని మిగిల్చాడు. బిడ్డల్ని పోషించేందుకు అహర్నిశలు శ్రమించే తల్లిదండ్రులకు ఇంతకంటే సంతోషం ఇంకేముంటుంది.
ఈ స్టోరీ గురించి తెలుసుకున్న నెటిజన్లు సంతోషం వ్యక్తం చేశారు. తండ్రీ కొడుకులకు అభినందనలు తెలిపారు. తండ్రిని ఇంత బాగా సత్కరించినందుకు మరికొందరు మిశ్రాను ప్రశంసించారు. “మీ విజయోత్సాహంలో ఈ క్షణాలు చాలా గొప్పవి. మీ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోండి” అని ఒక యూజర్ చెప్పారు.
My father was a watchman at ITC in New Delhi from 1995-2000; today I had the opportunity to take him to the same place for dinner :) pic.twitter.com/nsTYzdfLBr
— Aryan Mishra | आर्यन मिश्रा (@desiastronomer) January 23, 2025
“మీరు ఎవరో నాకు తెలియదు, కానీ ఇంత అందమైన కథ చదివినప్పుడు నా హృదయం ఆనందంతో నిండిపోయింది. చాలా సంతోషంగా ఉంది” అని ఒక రాశారు. మరొకరు ఒక హృదయ విదారక జ్ఞాపకాన్ని పంచుకుంటూ, “చాలా అందంగా ఉంది. నాకర్తవ్యాన్ని గుర్తు చేశారు. అపుడు ఎక్కువ ఖర్చు చేయలేకపోయాము. ఇప్పుడు నేను చేయగలను, కానీ విధి మరోలా ఉంది’’ అన్నారు. చాలా సంతోషం.. ఈ భగవంతుడు మీకుటుంబాన్ని చల్లగా చూడాలి అంటూ చాలామంది ఆశీర్వదించారు.