woman attack
-
లిఫ్ట్ ఆగిపోయిందని వాచ్ మెన్ పై ప్రతాపం.. చీపురు తిరగేసి..
ఆగ్రా: యూపీ సికందరాలోని రెయిన్బో అపార్ట్మెంట్లో లిఫ్ట్ మధ్యలోనే ఆగిపోయిందన్న కోపంలో కిందకు వచ్చిన తర్వాత వాచ్ మెన్ ను చెడామడా తిట్టడమే కాకుండా చీపురు కూడా తిరగేసింది. వయసులో పెద్దాయన అని కూడా చూడకుండా ఆ మహిళ నిర్దాక్షిణ్యంగా చీపురుతో కొడుతున్న వీడియో అపార్ట్మెంట్ సీసీ కెమెరాలో రికార్డయింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల చల్ చేస్తోంది. ఆగ్రాలోని సికందరాలో రెయిన్బో అపార్ట్మెంట్ వాచ్ మెన్ గా పనిచేస్తోన్న జగదీశ్ ప్రసాద్ తివారీ సికందరా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. అపార్ట్మెంట్లో C -8 ఫ్లాట్ లో నివసించే అనిల్ శర్మ భార్య అనిత లిఫ్ట్ ఆగిపోయిందన్న కారణంతో అనరాని మాటలు అంటూ తనపై చీపురుతో దాడి చేసిందని, ఒకపక్క తాను వివరణ ఇస్తున్నా కూడా వినకుండా కొట్టిందని ఆరోపించాడు. ఆమెతో పాటు వారి కుమారుడు ప్రాన్షు కూడా మాటలతో దూషించాడని తెలిపాడు. ఈ తతంగం మొత్తం అక్కడ సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్ కావడంతో ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం తోపాటు వీడియోను కూడా ఆధారాలుగా సేకరించినట్టు తెలిపారు సికందరా పోలీసులు. Kalesh B/w Watchman and Woman inside Rainbow Apartment in Agra due to lift failurepic.twitter.com/4pPL56hZPk — Ghar Ke Kalesh (@gharkekalesh) July 13, 2023 ఇది కూడా చదవండి: Heavy Rains : చెత్తనంతా తిరిగిచ్చి.. లెక్క సరిచేసి"నది".. -
భర్తతో రిలేషన్.. ప్రశ్నించిన భార్యపై యువతి యాసిడ్ దాడి
నాగ్‌పూర్: ప్రేమించిన అమ్మాయి తనకు దక్కదేమోనన్న కోపంతో యాసిడ్ దాడి చేసిన సంఘటనలు చూసే ఉంటాం. కానీ, ఓ 25 ఏళ్ల యువతి తన ప్రియుడి భార్యపై యాసిడ్ దాడి చేసింది. ఈ క్రూరమైన చర్య మహారాష్ట్రలోని నాగపూర్‌లో గత శనివారం ఉదయం జరిగింది. ఈ యాసిడ్ దాడిలో తల్లి, రెండునరేళ్ల కొడుకుకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. బుర్ఖా ధరించిన ఇద్దరు మహిళలు స్కూటీపై బాధితుల వద్దకు వచ్చారు. ఒక్కసారిగా వారిపై యాసిడ్ దాడి చేశారు. మహిళతో పాటు తన ఒడిలో బాలుడిపైనా యాసిడ్ పడి తీవ్ర గాయాలయ్యాయి. దాడి చేసి క్షణాల్లోనే అక్కడి నుంచి పరారయ్యాను నిందితులు. ఈ దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. ‘వివాహేతర సంబంధంపై బాధితురాలు, నిందితురాలి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తన స్నేహితురాలితో కలిసి బాధితురాలు, ఆమె కుమారుడిపై యాసిడ్ దాడి చేసింది. బాధితులను ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించి చికిత్స అందిస్తున్నాం. ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి.’ అని యశోద నగర్ పోలీస్‌లు తెలిపారు. మొబైల్ ఫోన్ లొకేషన్, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితురాలిని పట్టుకున్నట్లు చెప్పారు. ఆమెపై సెక్షన్ 326ఏ కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. SHOCKER - ACID ATTACK ON WOMAN & HER CHILD Horrific attack in Nagpur; acid attack on a woman & her child. Reportedly, the attacker had affair with the woman's husband | @Aruneel_S reports #acidattack #BREAKING_NEWS #Nagpur pic.twitter.com/LuLqEhv6gG — Mirror Now (@MirrorNow) December 6, 2022 ఇదీ చదవండి: Bharat Jodo Yatra: బీజేపీ కార్యకర్తలపై రాహుల్ గాంధీ ముద్దుల వర్షం!.. వీడియో వైరల్ -
వైరల్ వీడియో: ఆమెకు మండింది.. చెప్పుతో కొట్టి తన్ని తరిమేసింది
-
ఆమెకు మండింది.. చెప్పుతో కొట్టి తన్ని తరిమేసింది
వైరల్: ఔట్ పేషెంట్ విభాగం వద్ద పడుకోవడం అతను చేసిన ఒక తప్పు అయితే.. ఉక్కగా ఉందని అక్కడున్న కూలర్ ఆన్ చేసుకోవడం అతను చేసిన రెండో తప్పు. అక్కడే ఉన్న ఓ మహిళకు అది నచ్చలేదు. కోపంతో అతగాడిపై విరుచుకుపడింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. పేషెంట్ తరపున బంధువుగా భావిస్తున్న ఆ వ్యక్తి.. ఆస్పత్రి వెయిటింగ్ హాల్లోకి వచ్చి పడుకున్నాడు. ఉక్కగా ఉండడంతో అక్కడే ఉన్న కూలర్ ఆన్ చేశాడు. అయితే ఆ సయమంలో అక్కడికి చేరుకున్న ఓ మహిళ దానిని ఆఫ్ చేసింది. ఎందుకు ఆఫ్ చేశావని అతను అడగడంతో.. ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. కాలికి ఉన్న చెప్పు తీసి అతన్ని చెడామడా వాయించింది. ఆపై వీపులో జాడిచ్చి తన్నింది. అక్కడే ఉన్న సిబ్బంది సైతం ఆమెకు సపోర్ట్‌గా.. ఆ వ్యక్తిని బయటకు తరిమేసే యత్నం చేశారు. ఇంత జరుగుతున్నా పాపం అతని నుంచి ఎలాంటి ప్రతిఘటన ఎదురు కాలేదు. ఈలోపు సెక్యూరిటీ గార్డులు చేరుకుని.. అతన్ని బయటకు తీసుకెళ్లారు. ఛత్తీస్‌గఢ్ సర్గుజా జిల్లా అంబికాపూర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. వైరల్ అయిన ఈ వీడియో విమర్శలకు దారి తీయగా.. ఆస్పత్రి మేనేజ్మెంట్ స్పందించింది. కారణం లేకుండా ఆ వ్యక్తి లోపలికి వచ్చి పడుకున్నాడని.. ఇలాంటి చర్యలను సహించబోమని తెలిపింది. అయితే దాడిపై స్పందించేందుకు మాత్రం మేనేజ్మెంట్ నిరాకరించింది. -
ఎవరికో వచ్చిన ఆర్డర్ లాక్కుని డెలివరీ బాయ్‌పై యువతి దాడి
ప్రస్తుత రోజుల్లో ఆహార పదార్థాలను ఇంటికే డెలివరీ చేస్తున్నాయి పలు సంస్థలు. వర్షం, ట్రాఫిక్ వంటి అడ్డంకులను అధిగమించి ఆహారాన్ని మన వద్దకు చేరుస్తారు డెలివరీ ఏజెంట్లు. కొన్ని సార్లు చిన్న పొరపాట్లు జరిగాయని క్షణికావేశంలో డెలివరీ ఏజెంట్లపై కస్టమర్లు దాడి చేసిన సంఘటనలు వెలుగు చూశాయి. అలాంటి వీడియోనే ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ దృశ్యాలను బోగాస్04 అనే ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో.. నడిరోడ్డుపై ఓ డెలివరీ బాయ్‌పై దాడికి దిగింది ఓ యువతి. షూతో కొడుతూ దుర్భాషలాడింది. ఆమె దాడి చేస్తున్నా మౌనంగా ఉండిపోయిన బాధితుడు.. తన ఉద్యోగం పోతుందేమోననే భయంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ‘హాయ్ జొమాటోకేర్.. నా ఆర్డర్ అందించేందుకు వస్తుండగా డెలివరీ బాయ్ దాడికి గురయ్యాడు. అతడి నుంచి ఆర్డర్ లాక్కున్న కొందరు మహిళలు అతడిని షూతో కొట్టారు. నా వద్దకు ఏడ్చుకుంటూ వచ్చిన బాధితుడు ఉద్యోగం పోతుందని బాధపడ్డాడు.’ అంటూ రాసుకొచ్చారు నెటిజన్. జొమాటో కస్టమర్ కేర్‌కు ఫోన్ చేస్తే ఎలాంటి స్పందన లేదని తెలిపారు. తన ఆర్డర్ గురించి పట్టించుకోనవసరం లేదని, దాడికి గురైన బాధితుడికి సాయం చేయాలని సూచించినట్లు చెప్పారు. మరోవైపు.. ఈ విషయాన్ని పరిశీలిస్తామని కామెంట్ చేసింది జొమాటో. దాడికి పాల్పడిన మహిళపై కేసు పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: ‘రియల్ హీరో’.. పిల్లలతో విధులకు జొమాటో డెలివరీ బాయ్ -
‘రౌడీ’ కాదు.. నా భర్త ఒక బీజేపీ నేత
న్యూఢిల్లీ: మహిళతో దురుసుగా ప్రవర్తించిన నేరంలో ‘గుండా యాక్ట్’ ప్రకారం అరెస్ట్ అయ్యాడు శ్రీకాంత్ త్యాగి. బీజేపీ నేత(బీజేపీ యువమోర్చా)గా తనను తాను ప్రచారం చేసుకున్న శ్రీకాంత్.. అక్రమ కట్టడాల వ్యవహారంలో ఓ మహిళతో వాగ్వాదానికి దిగి ఆమెను దర్భాషలాడుతూ.. దాడికి యత్నించి కెమెరాకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో.. ఎట్టకేలకు సీఎం యోగి ప్రభుత్వం స్పందించి చర్యలకు ఉపక్రమించింది. శ్రీకాంత్ త్యాగి అక్రమకట్టడాలను బుల్డోజర్లతో కూల్చేయడంతో పాటు అతని అరెస్ట్‌కు ఆదేశించింది కూడా. దీంతో.. నొయిడా పోలీసులు పరారీలో ఉన్న శ్రీకాంత్‌ను మంగళవారం అరెస్ట్ చేశారు. ఇక ఈ వ్యవహారంపై శ్రీకాంత్ త్యాగి భార్య అను త్యాగి స్పందించింది. తన భర్త రౌడీనో, గూండానో కాదని.. ఆయన ఒక బీజేపీ నేత అంటూ మీడియాకు స్పష్టం చేసింది. బీజేపీ వాళ్లు అవునన్నా.. కాదన్నా ఆయన బీజేపీ నేతనే. ఎన్నో ఏళ్ల నుంచి ఆయన పార్టీ కోసం పని చేఏస్తున్నారు. ఈ విషయంలో వాళ్లు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఓ మహిళనే కదా.. నన్ను ఇంతగా పోలీసులు వేధిస్తుంటే యోగి సర్కార్ ఏం చేస్తోంది? అని నిలదీశారామె. ‘నా భర్త బీజేపీ సభ్యుడే. ఆయన చేసింది తప్పే కావొచ్చు. కానీ, బీజేపీ ఎంపీ మహేశ్ శర్మ వల్లే ఇదంతా జరుగుతోంది. ఆయన పోలీస్ కమిషనర్‌ను దుర్భాషలాడారు. అందుకే పోలీసులు మాపై ఇలా ప్రతీకారం తీర్చుకుంటున్నారు. ఘటన జరిగిన రోజే నా భర్త పోలీసులకు లొంగిపోవాల్సి ఉంది. అయితే లాయర్ కోసమే మేం ఆగాల్సి వచ్చింది. నా భర్త కూడా తనంతట తానే లొంగిపోయాడని.. ఆయన్ని ఎరవేసి ఎవరూ పట్టుకోలేదని ఆమె స్పష్టం చేసింది. #EXCLUSIVE | #ShrikantTyagi's wife Anu Tyagi speaks to India Today, explains what went wrong. She also confirmed that her husband was in BJP. Listen in. (@aviralhimanshu) #ITVideo pic.twitter.com/QI0nsolY17 — IndiaToday (@IndiaToday) August 10, 2022 తన సిబ్బందిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారన్న ఆమె.. తనను అదుపులోకి తీసుకోవడంతో పాటు తన పిల్లలను సైతం నొయిడా పోలీసులు వేధించారంటూ ఆరోపించారు. నన్ను కూడా మానసికంగా హింసించారు. అన్నిరకాలుగా మాతో అసభ్యంగా ప్రవర్తించారు. కానీ, మేం మాత్రం చాలా ఓపికగా దర్యాప్తునకు సహకరించాం. మహిళలకు న్యాయం చేస్తున్న సీఎం యోగి.. నా విషయంలో ఎందుకిలా మౌనంగా ఉంటున్నారో అర్థం కావడం లేదంటూ వాపోయింది. తన అరెస్టు తర్వాత, శ్రీకాంత్ త్యాగి ఆ మహిళ తన సోదరి లాంటిదని, తన రాజకీయ జీవితాన్ని నాశనం చేయడానికి మొత్తం వివాదాన్ని సృష్టించారని మీడియాతో చెప్పాడు. ఒకవైపు శ్రీకాంత్ త్యాగితో ఎలాంటి సంబంధం లేదని బీజేపీ చెబుతున్నప్పటికీ.. మహిళపై దురుసుగా ప్రవర్తించిన శ్రీకాంత్ కార్లపై బీజేపీ జెండాలు, ఎమ్మెల్యే స్టిక్కర్ దర్శనమివ్వడం విశేషం. కిసాన్ మోర్చా కీలక సభ్యుడిగా వ్యవహరించిన శ్రీకాంత్ తఆయగి.. మరోవైపు బడా నేతలతోనూ వ్యక్తిగతంగా కలిసిన ఫొటోలు సైతం వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఇదే శ్రీకాంత్ త్యాగి.. స్థానిక ఉద్యమకారిణి అయిన తన స్నేహితురాలితో ఓ అపార్ట్మెంట్లో అడ్డంగా భార్య అను త్యాగికి దొరికిపోయారు. ఆ సమయంలో ఆమె చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇదీ చదవండి: సీఎం యోగితో అంత ఈజీ కాదు.. కటకటాల్లోకి బీజేపీ నేత -
ధరణి పోర్టల్‌లో సమస్యలు.. తహసీల్దార్‌పై డీజిల్ పోసిన మహిళ..
సాక్షి, జగిత్యాలటౌన్: మెదక్ జిల్లా శివ్వంపేట తహసీల్దార్ భానుప్రకాశ్‌పై డీజిల్ పోయడం అమానుషమని ట్రెసా జిల్లా అధ్యక్షుడు ఎండీ.వకీల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని రెవెన్యూ భవన్లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ధరణి వెబ్సైట్లో అన్ని ఆప్షన్లు లేకపోవడం వల్లే సమస్యలు వస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వ అధికారులపై ఇలాంటి దాడులు సబబు కాదని తెలిపారు. తహసీల్దార్ కార్యాలయాల్లో సీసీ కెమెరాలు, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. సంఘం జిల్లా కార్యదర్శి కృష్ణ, నాయబ్ తహసీల్దార్లు పాల్గొన్నారు. చదవండి: ‘కోవాగ్జిన్’ ఒప్పందానికి బ్రేక్ -
లాటరీ వివాదం; చెప్పులతో మహిళ దాడి!
సాక్షి, మధ్యప్రదేశ్ : గ్వాలియర్‌లోని ప్రభుత్వ అధికారి, స్థానిక నాయకుడిపై ఓ మహిళ చెప్పులతో దాడికి దిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. దీంతో ఆ మహిళపై శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు.. లీలా జాతవ్(35) మహిళకు ప్రభుత్వ లాటరీ ద్వారా ఇల్లు లభించింది. అయితే తనకు కేటాయించిన ఇంటిపై ఆసంతృప్తితో ప్రతిపక్ష నాయకుడైన కృష్ణారావు దీక్షిత్, అక్కడి రాజీవ్ గాంధీ హౌసింగ్ స్కీమ్ నోడల్ అధికారి అయిన పవన్ సింఘాల్‌పై మహిళ గురువారం దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఇప్పటికీ తనను ఇంకా అరెస్టు చేయలేదన్నారు. కాగా ఆర్థికంగా వెనుకబడిన వారి కోసం అక్కడి ప్రభుత్వం రాజీవ్ గాంధీ హౌజింగ్ స్కీం ద్వారా 832 ఇళ్లను నిర్మించింది. వాటిని లాటరీ డ్రా పధ్దతి ద్వారా అర్హులైన వారికి ఇంటిని కేటాయించే ఉద్దేశంతో గురువారం లాటరీ డ్రా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో సదరు మహిళ.. ఇదంతా మోసం అని, ఈ లాటరీ పద్దతిలో కుట్ర దాగుందని.. తమకు ఇష్టమైన వాళ్లకే మంచి ఇల్లు కేటాయిస్తున్నారు అంటూ గట్టిగా అరుస్తూ... పవన్ సింఘాల్‌పై చెప్పులతో దాడి చేసింది. ఈ క్రమంలో తనని ఆపడానికి యత్నించిన కృష్ణారావుపై కూడా ఆమె దాడికి దిగింది. ఈ విషయం గురించి కృష్ణారావు మాట్లాడుతూ.. తను కోరుకున్న ఫ్లాటు లాటరీలో రాలేదన్న కోపంతోనే ఆమె ఇలా చేసిందని పేర్కొన్నాడు. కాగా వార్షిక ఆదాయం రూ. 3 లక్షల కంటే తక్కువ ఉన్న కుటుంబాలకు రాజీవ్ గాంధీ హౌజింగ్ పథకం కింద ఒక్కొక్కొ ప్లాట్‌ను రూ. 3.5 లక్షల లాటరి పద్దతిలో కేటాయిస్తున్నట్లు ఆయన తెలిపారు. -
బాకీ తీర్చమన్నందుకు..
ఒంగోలు: బాకీ తీరుస్తామంటూ ఓ మహిళను మామ, అల్లుడు నమ్మకంగా నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ సంఘటన స్థానిక రామ్‌నగర్ పదో లైనులో రైల్వేట్రాక్ సమీపంలో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. షేక్ లక్ష్మిది తాళ్లూరు మండలం కొత్తపాలెం. ఈమె కొన్నాళ్ల క్రితం అదే మండలం మన్నేపల్లికి చెందిన లక్కుల వెంకారెడ్డికి రూ.4 లక్షలు అప్పు ఇచ్చింది. ఏళ్లు గడుస్తున్నా ఆయన బాకీ తీర్చలేదు. అంతేకాకుండా అతడు స్వగ్రామంలో కాకుండా తన మామగారి ఊరైన చినగంజాం మండలం రాజుబంగారుపాలెంలో నివాసం ఉంటున్నాడు. విషయం తెలుసుకున్న లక్ష్మి.. నేరుగా అక్కడకు వెళ్లి తన బాకీ తీర్చాలని వెంకారెడ్డిని కోరింది. అతడి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. కోర్టులో కేసు మంగళవారం విచారణకు వచ్చింది. బాధితురాలు లక్ష్మి కోర్టుకు హాజరైంది. తమతో వస్తే బాకీ డబ్బులు ఇస్తామంటూ వెంకారెడ్డి, అతని మామ మంచాల వెంకటేశ్వరరెడ్డి అలియాస్ బాబుల్‌రెడ్డిలు ఆమెను నమ్మబలికారు. ఇద్దరూ కలిసి రాత్రి 7 గంటల సమయంలో ఆమెను రామ్‌నగర్ పదో లైనులోని రైల్వేట్రాక్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై ఇనుపరాడ్డు, బండరాయితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఆమె చున్నీతో మెడకు బిగించారు. చనిపోయిందని భావించి అక్కడి నుంచి పరారయ్యారు. రాత్రి 11 గంటల సమయంలో ఆ దారిన వెళ్తున్న ఓ వ్యక్తికి తీవ్ర గాయాలతో లక్ష్మి కనిపించింది. అతడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. తాలూకా సీఐ గంగా వెంకటేశ్వర్లు తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితురాలిని చికిత్స కోసం రిమ్స్‌కు తరలించారు. డబ్బులు ఇస్తామంటూ నమ్మకంగా తీసుకెళ్లి హత్య చేయాలని పథకం పన్నిన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
నోట్లో యాసిడ్ పోసి.. చోరీకి యత్నం
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): చోరీ కోసం ఓ మహిళ దారుణానికి ఒడిగట్టింది. ఏకంగా యాసిడ్ దాడికి పాల్పడింది. వృద్ధురాలి మెడలోని బంగారం చోరీ చేసేందుకు విఫలయత్నం చేయగా... బాధితురాలు గట్టిగా అరవడంతో నోటిలో యాసిడ్ పోసి నిందితురాలు పరారయింది. ఈ దుర్ఘటన రిటైర్డ్ జడ్జి ఇంటిలో చోటు చేసుకుంది. ఎంవీపీ జోన్ ఎస్ఐ గోవింద్ రాజు తెలిపిన వివరాల ప్రకారం... ఎంవీపీ కాలనీ సెక్టార్ – 2లో రిటైర్డ్ జడ్జి రామారావు, సత్యవతి దంపతులు నివాసం ఉంటున్నారు. సోమవా రం సాయంత్రం రామరావు వాకింగ్ కోసం వెళ్లారు. అదే సమయంలో వారి ఎదురింటిలో పనిచేస్తున్న రమణమ్మ అనే మహిళ సత్యవతి మెడలోని బంగారం చోరీ చేసేందుకు విఫలయత్నం చేసింది. సత్యవతి పెద్దగా అరవడంతో రమణమ్మ వెంటనే బాత్రూమ్లో ఉన్న యాసి డ్ తీసుకొచ్చి సత్యవతి నోటిలో పోసి పరారయింది. స్థానికులు సత్యవతిని స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె భర్త రిటైర్డ్ జడ్జి రామారావు ఫిర్యాదు మేరకు ఎస్ఐ గోవింద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
జవాన్ చెంప పగల కొట్టిన మహిళ
-
జవాన్ చెంప పగల కొట్టిన మహిళ
సాక్షి, న్యూఢిల్లీ: గుర్గావ్లో ఓ మహిళ వీడియో తెగ వైరల్ అవుతోంది. విధి నిర్వహణలో ఉన్న ఓ జవాన్‌పై దాడి చేసి అతని చెంప పగలకొట్టింది. గత శనివారం ఈ ఘటన చోటు చేసుకోగా.. ఆమె అరెస్ట్‌తో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఢిల్లీకి చెందిన 44 ఏళ్ల మహిళ స్మృతి కల్రా భర్త నుంచి విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్నారు. గత శనివారం మధ్యాహ్నా సమయంలో తన టాటా ఇండికా కారులో బయటకు వెళ్లారు. ఇంతలో ఏం జరిగిందో తెలీదుగానీ ముందు వెళ్తున్న ఆర్మీ ట్రక్కుకు తన వాహనానికి ఆమె అడ్డుగా నిలిపారు. కారు దిగి అంతే వేగంగా నడుచుకుంటూ వెళ్లి అక్కడే ఉన్న ఓ జవాన్ చెంప పగలకొట్టారు. అతను మాట్లాడే లోపే మరో రెండు.. మూడు దెబ్బలు చరిచి ఆమె తాపీగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. అక్కడే పక్కనే కారులో ఉన్న మరో వ్యక్తి అదంతా తన మొబైల్ ఫోన్లో షూట్ చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. ఈ విషయమై అర్మీ వర్గాలు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేసినందుకు ఆమెపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా.. వెంటనే జడ్జి స్మృతికి బెయిల్ మంజూరు చేశారు. నన్ను నోరు తెరిచి మాట్లాడనివ్వలేదు. ఎందుకలా కొడుతోంది? ఆమెకేమైనా పిచ్చా? అనుకున్నా అని బాధిత జవాన్ తెలిపారు. తన కారును ఓవర్ టేక్ చేఏసిందనందుకే స్మృతి ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. -
సాఫ్ట్ వేర్ ఉద్యోగినిపై కిరోసిన్ పోసి నిప్పు
-
మహిళపై కిరోసిన్ పోసి నిప్పుంటించిన దుండగులు
ఒడిషా: దుండగల ఆగడాలు రోజురోజుకూ మితిమీరుతున్నాయి. ఒకవైపు మహిళలపై దాడులకు పాల్పడితే కఠిన శిక్షలు విధిస్తామంటూ ప్రభుత్వం హెచ్చరిస్తున్న మహిళలపై ఉన్మాదులు దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. నిర్భయ చట్టం తెచ్చిన దుండగుల ఆగడాలు అరికట్టలేని దుస్థతి ఏర్పడింది. దేశంలో ఎక్కడో ఒకచోట మహిళలు దాడులకు గురవతూనే ఉన్నారు. తాజాగా ఓ మహిళపై కిరోసిన్ పోసి దుండగులు నిప్పుంటించిన ఘటన ఒడిషా రాష్ట్రంలో బుధవారం చోటుచేసుకుంది. రేషన్ డీలర్‌గా వ్యాపారం చేస్తున్న ఆమెపై దుండగులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. మంటల తీవ్రతతో ఆమె శరీరం దాదాపు సగం కాలిపోయినట్టు పోలీసులు తెలిపారు. ఆమె పరిస్థతి విషమించడంతో చికిత్స మేరకు విశాఖ జిల్లా ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు పేర్కొన్నారు. చికిత్స పొందుతూ ఆ మహిళ మృతిచెందినట్టు సమాచారం. -
‘ఏటీఎం దుండగుడి’ ఆచూకీ ఇస్తే నజరానా
సాక్షి ప్రతినిధి, బెంగళూరు/హిందూపురం: బెంగళూరులోని ఓ ఏటీఎం కేంద్రంలో మహిళపై దాడికి పాల్పడిన దుండగుడి ఆచూకీ చెబితే రూ.లక్ష బహుమతి ఇస్తామని బెంగళూరు అదనపు పోలీసు కమిషనర్ ప్రణబ్ మొహంతి గురువారం ప్రకటించారు. సమాచారాన్ని ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు. 9480801101, 9480801011 నంబర్లకు ఫోన్, ఎస్ఎంఎస్లు ద్వారా సమాచారాన్ని ఇవ్వవచ్చని వెల్లడించారు. కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు జ్యోతి ఆరోగ్యం కాస్త మెరుగు పడిందని చీఫ్ న్యూరో సర్జన్ ఎన్కే. వెంకట రమణ చెప్పారు. సెల్‌ఫోన్ హిందూపురంలో విక్రయం: దుండగుడు దాడి చేసిన తర్వాత కాజేసిన సెల్‌ఫోన్‌ను హిందూపురంలో విక్రయించగా కర్ణాటక పోలీసులు దానిని స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. మంగళవారం ఉదయం దాడి చేసిన దుండగుడు అదే రోజు సాయంత్రం హిందూపురానికి వచ్చాడు. అక్కడ అంబేద్కర్ సర్కిల్లో ఉన్న ఒక సెల్‌ఫోన్ దుకాణంలోకి వెళ్లి తాను బెంగళూరు నుంచి వచ్చానని, పర్సు పోయిందని, చార్జీలకు డబ్బు లేదని సెల్‌ఫోన్ తీసుకుని డబ్బు ఇవ్వాలని కోరాడు. సెల్‌ఫోన్ దుకాణదారుడు అబూజర్.. ఆ నోకియా 2700 మోడల్ సెల్‌ఫోన్‌కు రూ.800 ఇస్తాననడంతో అతడికి విక్రయించాడు. అబూజర్ బుధవారం ఆ సెల్ఫోన్లో సిమ్‌కార్డు వేసుకున్నాడు. సెల్‌ఫోన్‌పై నిఘా ఉంచిన కర్ణాటక పోలీసులు వెంటనే హిందూపురం పోలీసులకు సమాచారం అందించారు. తర్వాత అబూజర్‌ను బెంగళూరు నుంచి వచ్చిన పోలీసు బృందం అదుపులోకి తీసుకుని విచారించింది. అతడితో బాటు మరో ఇద్దరిని కర్ణాటక తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే సీసీటీవీ ఫుటేజ్ ద్వారా దుండగుడిని గుర్తించామని అతడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామని కర్ణాటక డీజీపీ తెలిపారు. కాగా, సెల్‌ఫోన్‌ను కర్ణాటక పోలీసులకు అప్పగించామని, అబూజర్‌ను వారే విచారిస్తున్నారని హిందూపురం సీఐ శ్రీనివాసులు తెలిపారు. -
'దొంగగా భావించి యువతిని చితకబాదారు'
మణుగూరు : షాపింగ్‌కు వచ్చిన ఢిల్లీకి చెందిన ఓ యువతిపై ఖమ్మం జిల్లా మణుగూరులో దాడి జరిగింది. తెలుగు భాష రాకపోవడంతో దొంగగా భావించిన ఓ షాపు యాజమాన్యం ఆమెను చితకబాదింది. స్థానిక నీలగిరి సూపర్ మార్కెట్లో సరుకులు కొందామని ఢిల్లీకి చెందిన సంజు అనే యువతి వచ్చింది. అయితే ఆమెకు తెలుగు రాకపోవడంతో దొంగగా భావించిన సూపర్‌మార్కెట్ యాజమాన్యం ఆమెపై దాడి చేసింది. దెబ్బలకు తాళలేక ఆమె బయటకు పరుగెడుతున్నా.. యాజమాన్యం విడిచి పెట్టలేదు. వెంటపడి మరీ ఆమెను చితక్కొట్టారు. చివరకు అసలు విషయం తెలుసుకుని నాలుక కరుచుకున్నారు. సూపర్‌మార్కెట్ యాజమాన్యం అత్యుత్సాహంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా సూపర్‌మార్కెట్ యాజమాన్యంపై సంజు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
దొంగ అనుకుని చితకొట్టిన జనం
-
ఓట్లు వేయలేదని మహిళపై కత్తులతో దాడి
రేపల్లె : పంచాయతీ ఎన్నికల్లో తమకు ఓటు వేయలేదనే కక్షతో టీడీపీ నాయకులు ఓ మహిళపై కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన గురువారం రేపల్లె మండలం మోళ్లగుంటలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సైకం కనకయ్య, శివపార్వతి దంపతులు వైఎస్సార్సీపీ ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. తనకు వ్యతిరేకంగా ప్రచారం చేయటంతో పాటు, ఓటు వేయలేదనే కక్షతో ఆరోవార్డు మెంబర్, టీడీపీ నాయకుడు కొక్కిలిగడ్డ విష్ణునారాయణ ఎన్నికలు ముగిసిన నాటినుంచి ఈ దంపతులపై వరుస దాడులకు పాల్పడుతున్నాడు. గతంలో రెండు పర్యాయాలు దాడులు చేయగా చోడాయపాలెం పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదైయ్యాయి. దీంతో మరింత కక్ష పెంచుకున్న విష్ణునారాయణ తన బంధువులైన కొక్కిలిగడ్డ జనార్ధన్, కొక్కిలిగడ్డ వెంకటేశ్వరావులతో కలిసి నిన్నఉదయం శివపార్వతిపై కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచి పరారయ్యారు. గమనించిన స్థానికులు శివపార్వతిని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ మల్లేశ్వరావు తెలిపారు. టీడీపీ అకృత్యాలు నిలువరించాలి.. పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల ప్రచారంలో పాల్గొన్నామనే కక్షతో విష్ణునారాయణ పదే పదే తమపై దాడులకు పాల్పడుతున్నారని బాధితురాలి భర్త కనకయ్య ఆరోపించారు. గ్రామంలో టీడీపీ నాయకుల అరాచకాలు నివారించి, తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. -
న్యూఢిల్లీలో మహిళపై యాసిడ్‌తో దాడిచేసిన అగంతకులు
న్యూఢిల్లీ: దేశంలో మహిళలకు రక్షణ కరువైంది. ఒంటరిగా కనిపించిన మహిళలపై అగంతకులు దాడులకు పాల్పడుతున్నారు. మహిళలపై దాడులకు పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయని ఒకవైపు ప్రభుత్వం హెచ్చరిస్తున్నా దాడులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. మెన్న దేశరాజధానిలో సామూహిక అత్యాచారానికి గురైన నిర్భయ ఘటన దేశప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ ఘటన మరవకముందే గురువారం ముంబైలో ఓ ఫోటో విలేకరి అత్యాచారానికి గురైంది. ఇలా ప్రతిచోటా మహిళలు దాడులకు గురవుతూనే ఉన్నారు. న్యూఢిల్లీలో ఓ 40ఏళ్ల మహిళపై శుక్రవారం యాసిడ్ దాడి జరిగింది. ఆ మహిళ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో మోటర్‌సైకిల్‌పై వచ్చిన గుర్తుతెలియని ఇద్దరు అగంతకులు యాసిడ్‌తో దాడిచేశారు. ఈ ఘటన ఈశాన్య రాష్ట్ర ఢిల్లీలోని దిల్షాద్ గార్డెన్ ప్రాంతంలో చోటుచేసుకుంది. యాసిడ్ మంటలు భరించలేక ఆమె గట్టిగా కేకలు వేయడంతో అగంతకులు ఘటనా స్థలం నుంచి పరారైయ్యారు. గాయపడిన ఆ మహిళను చికిత్స మేరకూ దగ్గరలో ఉన్న జీటీబీ ఆస్పత్రికి తరలించారు. యాసిడ్ తీవ్రత కారణంగా ఆ బాధితురాలు ఉదరభాగం, మెఖం సగం వరకూ కాలిపోయినట్టు పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. చికిత్స అనంతరం ఆ మహిళ డిచార్జ్ అయినట్టు వైద్యులు పేర్కొన్నారు. ఈ యాసిడ్ దాడిలో మహిళ కుటంబ సభ్యుల ప్రమేయం ఉండవచ్చనని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.