డబీర్పురాలో దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని నలుగురు వ్యక్తులు ఆదివారం ఉదయం డబిర్ పురాలో ఓ యువతిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు బాధితురాలిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యలు తెలిపారు. డబీర్పురా ఏసీపీ కార్యాలయానికి సమీపంలో ఘటన జరిగింది. కాగా బాధితురాలు సాఫ్ట్వేర్ ఇంజనీర్ నయీమాగా పోలీసులు గుర్తించారు.