Woman Allegedly Attacked Man After He Objected To Her Turning Off Air Cooler At Ambikapur Medical College Hospital, Video Viral - Sakshi
Sakshi News home page

వీడియో: చెప్పుతో కొట్టి వీపులో తన్ని తరిమేసింది.. చూస్తూ ఉండిపోయిన బాధితుడు

Oct 20 2022 9:00 AM | Updated on Oct 21 2022 10:47 AM

Chhattisgarh: Man Turns Cooler In Hospital Woman Beat Him Viral - Sakshi

కూలర్‌ ఆన్‌ చేసి పడుకున్న వ్యక్తిని అకారణంగా దాడి చేసిన ఘటన.. 

వైరల్‌: ఔట్‌ పేషెంట్‌ విభాగం వద్ద పడుకోవడం అతను చేసిన ఒక తప్పు అయితే.. ఉక్కగా ఉందని అక్కడున్న కూలర్‌ ఆన్‌ చేసుకోవడం అతను చేసిన రెండో తప్పు. అక్కడే ఉన్న ఓ మహిళకు అది నచ్చలేదు. కోపంతో అతగాడిపై విరుచుకుపడింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది.

పేషెంట్‌ తరపున బంధువుగా భావిస్తున్న ఆ వ్యక్తి.. ఆస్పత్రి వెయిటింగ్‌ హాల్‌లోకి వచ్చి పడుకున్నాడు. ఉక్కగా ఉండడంతో అక్కడే ఉన్న కూలర్‌ ఆన్‌ చేశాడు. అయితే ఆ సయమంలో అక్కడికి చేరుకున్న ఓ మహిళ దానిని ఆఫ్‌ చేసింది. ఎందుకు ఆఫ్‌ చేశావని అతను అడగడంతో.. ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. 

కాలికి ఉన్న చెప్పు తీసి అతన్ని చెడామడా వాయించింది. ఆపై వీపులో జాడిచ్చి తన్నింది. అక్కడే ఉన్న సిబ్బంది సైతం ఆమెకు సపోర్ట్‌గా.. ఆ వ్యక్తిని బయటకు తరిమేసే యత్నం చేశారు. ఇంత జరుగుతున్నా పాపం అతని నుంచి ఎలాంటి ప్రతిఘటన ఎదురు కాలేదు. ఈలోపు సెక్యూరిటీ గార్డులు చేరుకుని.. అతన్ని బయటకు తీసుకెళ్లారు. ఛత్తీస్‌గఢ్‌ సర్గుజా జిల్లా అంబికాపూర్‌ మెడికల్‌ కాలేజ్‌ హాస్పిటల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

వైరల్‌ అయిన ఈ వీడియో విమర్శలకు దారి తీయగా.. ఆస్పత్రి మేనేజ్‌మెంట్‌ స్పందించింది. కారణం లేకుండా ఆ వ్యక్తి లోపలికి వచ్చి పడుకున్నాడని.. ఇలాంటి చర్యలను సహించబోమని తెలిపింది. అయితే దాడిపై స్పందించేందుకు మాత్రం మేనేజ్‌మెంట్‌ నిరాకరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement