slipper shot
-
TSRTC: సీటు కోసం చెప్పులతో కొట్టుకున్నారు
సిద్దిపేట, సాక్షి: తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఉచిత ప్రయాణం మూలంగా కష్టాలు మాత్రం తప్పడం లేదు. ఆర్టీసీ సిబ్బందితో గొడవ పడడం దగ్గరి నుంచి ఆఖరికి మహిళలు వాళ్లలో వాళ్లు కొట్టుకోవడం దాకా చూస్తూనే ఉన్నాం. తాజాగా మహిళలు చెప్పులతో కొట్టుకున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. సీటు తనదంటే తనదంటూ ఇద్దరు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఇద్దరూ చెప్పులు ఝులిపించుకున్నారు. ఒకరిపై ఒకరు చెప్పులతో దాడులు చేసుకున్నారు. ఆ మధ్యలో ఉన్న ఓ మహిళ వాళ్లను నిలువరించే ప్రయత్నం చేయగా.. ఇంతలో మరో ఇద్దరు పురుషులు జోక్యంతో వివాదం సర్దుమణిగింది. ఆ గొడవను ప్రయాణికులంతా ఆసక్తిగా తిలకించగా.. అక్కడే ఉన్న కొందరు ఆ వీడియో తీయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సికింద్రాబాద్ నుంచి దుబ్బాక వెళ్తున్న దుబ్బాక డిపో బస్సులో.. తోగుట మండలం వెంకట్రావ్ పేట వద్ద ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమచారం. ఉచిత ప్రయాణ విషయంలో ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ ఎప్పటికప్పుడు విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నా.. ఇలాంటి ఘటనలు మాత్రం ఆగడం లేదు. -
షాకింగ్: మాట్లాడుతూనే.. చెప్పు తీసి లాగి కొట్టింది
ఢిల్లీ: దేశరాజధానిలో హిందూ ఏక్తా మంచ్ ఇవాళ నిర్వహించిన ఓ కార్యక్రమం రసాభాసగా మారింది. వేదిక మీద ప్రసంగిస్తున్న సమయంలో ఓ మహిళ.. నిర్వాహకుల్లో ఒకతన్ని చెప్పుతో కొట్టింది. హిందూ ఏక్తా మంచ్ ఆధ్వర్యంలో భేటీ బచావో మహాపంచాయత్ కార్యక్రమాన్ని ఛత్తార్పూర్ ప్రాంతంలో నిర్వహించారు. దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్యోదంతంపై ఈ కార్యక్రమంలో చర్చ జరిగింది. ఆ సమయంలో వేదిక ఎక్కిన ఓ మహిళ.. తన సమస్యలను ప్రస్తావించుకుంటూ వెళ్లింది. అయితే.. ఏమైందో ఏమో ఉన్నట్లుండి ఒక్కసారిగా ఆమె ప్రసంగం ఆపి మరీ తన చెప్పు తీసి పక్కనే ఉన్న అతన్ని లాగి కొట్టింది. దీంతో అక్కడే ఉన్న కొందరు ఆమెను అడ్డుకునే యత్నం చేశారు. ఆ పెనుగులాటలోనూ ఆమె తన సమస్యలను చెప్తుండగా.. వేదిక మీద ఉన్న నిర్వాహకులు మైకును పక్కకు తప్పించే యత్నం చేశారు. ఆ మహిళ కూతురిని, ఆ పక్కనే ఉన్న వ్యక్తి కొడుకు ప్రేమ మాయమాటలతో ఎటో తీసుకెళ్లిపోయాడట. అందుకే ఆమె ప్రసంగిస్తున్న టైంలో అడ్డుకునే యత్నం చేశాడని తెలుస్తోంది. ‘ఐదు రోజుల నుంచి పోలీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నా. ఎవరూ నన్ను పట్టించుకోవట్లేదు అని ఆక్రోశంతో చెప్తూనే ఆమె చెప్పుతో అతన్ని లాగి కొట్టింది. #WATCH | Chattarpur, Delhi: Woman climbs up the stage of Hindu Ekta Manch's program 'Beti Bachao Mahapanchayat' to express her issues; hits a man with her slippers when he tries to push her away from the mic pic.twitter.com/dGrB5IsRHT — ANI (@ANI) November 29, 2022 -
వైరల్ వీడియో: ఆమెకు మండింది.. చెప్పుతో కొట్టి తన్ని తరిమేసింది
-
ఆమెకు మండింది.. చెప్పుతో కొట్టి తన్ని తరిమేసింది
వైరల్: ఔట్ పేషెంట్ విభాగం వద్ద పడుకోవడం అతను చేసిన ఒక తప్పు అయితే.. ఉక్కగా ఉందని అక్కడున్న కూలర్ ఆన్ చేసుకోవడం అతను చేసిన రెండో తప్పు. అక్కడే ఉన్న ఓ మహిళకు అది నచ్చలేదు. కోపంతో అతగాడిపై విరుచుకుపడింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. పేషెంట్ తరపున బంధువుగా భావిస్తున్న ఆ వ్యక్తి.. ఆస్పత్రి వెయిటింగ్ హాల్లోకి వచ్చి పడుకున్నాడు. ఉక్కగా ఉండడంతో అక్కడే ఉన్న కూలర్ ఆన్ చేశాడు. అయితే ఆ సయమంలో అక్కడికి చేరుకున్న ఓ మహిళ దానిని ఆఫ్ చేసింది. ఎందుకు ఆఫ్ చేశావని అతను అడగడంతో.. ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. కాలికి ఉన్న చెప్పు తీసి అతన్ని చెడామడా వాయించింది. ఆపై వీపులో జాడిచ్చి తన్నింది. అక్కడే ఉన్న సిబ్బంది సైతం ఆమెకు సపోర్ట్‌గా.. ఆ వ్యక్తిని బయటకు తరిమేసే యత్నం చేశారు. ఇంత జరుగుతున్నా పాపం అతని నుంచి ఎలాంటి ప్రతిఘటన ఎదురు కాలేదు. ఈలోపు సెక్యూరిటీ గార్డులు చేరుకుని.. అతన్ని బయటకు తీసుకెళ్లారు. ఛత్తీస్‌గఢ్ సర్గుజా జిల్లా అంబికాపూర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. వైరల్ అయిన ఈ వీడియో విమర్శలకు దారి తీయగా.. ఆస్పత్రి మేనేజ్మెంట్ స్పందించింది. కారణం లేకుండా ఆ వ్యక్తి లోపలికి వచ్చి పడుకున్నాడని.. ఇలాంటి చర్యలను సహించబోమని తెలిపింది. అయితే దాడిపై స్పందించేందుకు మాత్రం మేనేజ్మెంట్ నిరాకరించింది. -
టోల్ ఛార్జీ కట్టమన్నందుకు దాడి, తిరిగి చెప్పుతో..
భోపాల్: టోల్ ఛార్జీ కట్టమన్నందుకు టోల్ బూత్‌లో పని చేసే యువతిపై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. అయితే ఆ వ్యక్తిని తీవ్రంగానే ప్రతిఘటిస్తూ.. ఆ యువతి కూడా ప్రతిదాడి చేయడం గమనార్హం. ప్రస్తుతం ఈ దాడికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్ రాజ్ఘడ్-భోపాల్ కచ్నారియా టోల్‌ప్లాజా వద్ద శనివారం ఈ ఘటన జరిగింది. రాజ్‌కుమార్ గుజార్ అనే వ్యక్తి తన కారుకు ఫాస్ట్‌ట్యాగ్(ఈ-టోల్ పేమెంట్ వ్యవస్థ) లేకుండానే అక్కడికి వచ్చాడు. తాను స్థానికుడినని, టోల్ ఛార్జీల నుంచి తనకు మినహాయింపు ఉందని, ఆ ప్లాజా నిర్వాహకుడికి సైతం తనకు తెలుసని చెప్పాడు. అయితే అతను, ఆ వాహనం లోకల్‌దే అని నిరూపించుకోవడానికి ఎలాంటి ఆధారాలు అతని వద్ద లేవు. పైగా నిర్వాహకుడు సైతం ఆ వ్యక్తి ఎవరో తెలీదని చెప్పాడు. దీంతో.. టోల్ ఛార్జీ కట్టాల్సిందేనని సిబ్బందిగా పని చేస్తున్న అనురాధా దాంగి తేల్చి చెప్పింది. ఆ మాట వినగానే కోపోద్రిక్తుడైన రాజ్‌కుమార్ ఆమె వైపు దూసుకొస్తూ.. దుర్భాషలాడాడు. అంతటితో ఆగక ఆమె చెంప చెల్లుమనిపించాడు. అయితే అనురాధా ఊరుకోలేదు. ఆమె సైతం తన చెప్పు తీసి రాజ్‌కుమార్‌ను చెడామడా వాయించింది. ఇద్దరి మధ్య పెనుగులాట జరగ్గా.. అక్కడే ఉన్న కొందరు ఆ ఇద్దరినీ నిలువరించే ప్రయత్నం చేశారు. బూత్‌లో ఏడుగురు మహిళా సిబ్బంది ఉన్నా.. సెక్యూరిటీ గార్డులెవరూ లేనట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మహిళా సిబ్బంది ఫిర్యాదు చేయగా కేసు నమోదు అయ్యింది. అయితే.. నిందితుడిని ఇంకా పోలీసులు అరెస్ట్ చేయలేదని సమాచారం. A man slapped a woman employee of a toll both in Rajgarh after she refused to let him go without paying the tax. The man is seen angrily walking towards the employee and then slapping her across the face, The woman hits him back with her footwear @ndtv @ndtvindia pic.twitter.com/hmK0ghdImX — Anurag Dwary (@Anurag_Dwary) August 21, 2022 -
చెప్పుతో కొట్టిన సర్పంచ్.. యువకుడి ఆత్మహత్య
సాక్షి, రఘునాథపల్లి: వీధి లైటు వేయాలని ప్రశ్నించిన యువకుడిని సర్పంచ్ చెప్పుతో కొట్టాడు. దీంతో అవమాన భారం భరించలేక అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కుసుంబాయి తండాలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సర్పంచ్ ధరావత్ రమేష్ ఆదివారం తండాలో వీధి లైట్లు వేయిస్తున్నాడు. ఈ క్రమంలో తన ఇంటి ముందు కూడా వీధిలైటు వేయాలని తండాకు చెందిన గుగులోతు ఎల్లేష్ (28) సర్పంచ్‌ను అడిగాడు. నన్ను అడిగేందుకు నువ్వేవరివి అని సర్పంచ్ పేర్కొనడంతో ఇరువురి మధ్య మాటామాట పెరిగింది. కోపోద్రిక్తుడైన సర్పంచ్.. ఎల్లేష్‌ను చెప్పుతో కొట్టాడు. ఇంటికి వెళ్లిన ఎల్లేష్.. జరిగిన విషయాన్ని భార్యతో రోదిస్తూ తెలిపాడు. ఆ తర్వాత పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు. కాగా, తండావాసులు సోమవారం పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. సర్పంచ్‌పై కేసు నమోదు చేసి తక్షణ చర్యలు తీసుకోవాలని, మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని తండావాసులు డిమాండ్ చేశారు. చివరకు మృతుడి కుటుంబానికి 10 గుంటల భూమి, రూ.30 వేల నగదు ఇచ్చేలా తండా పెద్దలు నచ్చచెప్పారు. (కరోనాతో మరో టీఆర్ఎస్ నేత మృతి) -
2 చెప్పుదెబ్బలతో రేపిస్టు విడుదల
లక్నో: యూపీలో పంచాయతీ పెద్దల తీర్పుపై సామాజిక వేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేపిస్టులను రెండు చెప్పుదెబ్బలు కొట్టి వదిలేయాలని తీర్పునిచ్చారు. డిసెంబర్ 19న హాపూర్ గ్రామంలో ఓ యువతిపై ఇద్దరు అత్యాచారం చేశారు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ ఆ బాలిక పంచాయతీ పెద్దలను వేడుకుంది. దీంతో రేపిస్టులు తలో ఐదులక్షల రూపాయలు చెల్లించాలని పంచాయతీ ఆదేశించింది. అంత ఇచ్చుకోలేమని వారు చెప్పటంతో.. సరే రెండు చెప్పుదెబ్బలు కొట్టి వదలేయమని.. బాధితురాలని గ్రామపెద్దలు సూచించారు. దీనిపై యూపీ సామాజిక వేత్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.