2 చెప్పుదెబ్బలతో రేపిస్టు విడుదల
లక్నో: యూపీలో పంచాయతీ పెద్దల తీర్పుపై సామాజిక వేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేపిస్టులను రెండు చెప్పుదెబ్బలు కొట్టి వదిలేయాలని తీర్పునిచ్చారు. డిసెంబర్ 19న హాపూర్ గ్రామంలో ఓ యువతిపై ఇద్దరు అత్యాచారం చేశారు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ ఆ బాలిక పంచాయతీ పెద్దలను వేడుకుంది.
దీంతో రేపిస్టులు తలో ఐదులక్షల రూపాయలు చెల్లించాలని పంచాయతీ ఆదేశించింది. అంత ఇచ్చుకోలేమని వారు చెప్పటంతో.. సరే రెండు చెప్పుదెబ్బలు కొట్టి వదలేయమని.. బాధితురాలని గ్రామపెద్దలు సూచించారు. దీనిపై యూపీ సామాజిక వేత్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.