ఘాజీపూర్: ఉత్తరప్రదేశ్‌లో మరో ఘోరం చోటుచేసుకుంది. ఘాజీపూర్ జిల్లాలోని ఒక కాన్వెంట్ స్కూల్ మేనేజర్ ఏడవ తరగతి విద్యార్థినిని వేధించిన ఉదంతం మరువకముందే మరో ఘటన చోటుచేసుకుంది.
ఘాజీపూర్ జిల్లాలోని మహమ్మదాబాద్ గోహ్నా ప్రాంతంలోని ఒక ఇంటర్ కాలేజీ మేనేజర్‌పై అదే కాలేజీలో చదువుకుంటున్న బాలికల తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధిత బాలికలు 10వ తరగతి చదువుతున్నారు. ఆ విద్యార్థినులిద్దరినీ ఒక్కొక్కరిగా పిలిచిన మేనేజర్ మీరు భారతీయులుగా కనిపించడం లేదని, విదేశీయులుగా ఉన్నారంటూ కామెంట్ చేశాడని సమాచారం. ఆ తర్వాత వారిని వేధింపులకు గురిచేశాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తన మైనర్ కుమార్తెతో పాటు తమ గ్రామానికి చెందిన మరో వ్యక్తి మైనర్ కుమార్తె బర్జాలాలోని తిజియా దేవి ఇంటర్ కాలేజీలో 10వ తరగతి చదువుతున్నారని, సెప్టెంబర్ 13న వీరిద్దరినీ కాలేజీ మేనేజర్ వినోద్ యాదవ్ తన ఛాంబర్‌లోకి పిలిచి వేధించాడని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ మేనేజర్ వీరిద్దరినీ ఒక్కొక్కరిగా పిలిచి, చేతులు పట్టుకుని ఆటపట్టిస్తూ నువ్వు భారతీయురాలిలా కాకుండా విదేశీయురాలిలా కనిపిస్తున్నావంటూ కామెంట్ చేశాడన్నారు. అయితే ఆ విద్యార్థినులు నిరసన తెలపడంతో మేనేజర్ వారిని కులం పేరుతో దుర్భాషలాడాడని బాధిత బాలిక తండ్రి ఆరోపించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: HYD: నర్సింగ్ విద్యార్థినిపై హత్యాచారం?
Comments
Please login to add a commentAdd a comment