School Administrator
-
విదేశీయుల్లా ఉన్నారంటూ బాలికలకు వేధింపులు
ఘాజీపూర్: ఉత్తరప్రదేశ్‌లో మరో ఘోరం చోటుచేసుకుంది. ఘాజీపూర్ జిల్లాలోని ఒక కాన్వెంట్ స్కూల్ మేనేజర్ ఏడవ తరగతి విద్యార్థినిని వేధించిన ఉదంతం మరువకముందే మరో ఘటన చోటుచేసుకుంది.ఘాజీపూర్ జిల్లాలోని మహమ్మదాబాద్ గోహ్నా ప్రాంతంలోని ఒక ఇంటర్ కాలేజీ మేనేజర్‌పై అదే కాలేజీలో చదువుకుంటున్న బాలికల తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధిత బాలికలు 10వ తరగతి చదువుతున్నారు. ఆ విద్యార్థినులిద్దరినీ ఒక్కొక్కరిగా పిలిచిన మేనేజర్ మీరు భారతీయులుగా కనిపించడం లేదని, విదేశీయులుగా ఉన్నారంటూ కామెంట్ చేశాడని సమాచారం. ఆ తర్వాత వారిని వేధింపులకు గురిచేశాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.తన మైనర్ కుమార్తెతో పాటు తమ గ్రామానికి చెందిన మరో వ్యక్తి మైనర్ కుమార్తె బర్జాలాలోని తిజియా దేవి ఇంటర్ కాలేజీలో 10వ తరగతి చదువుతున్నారని, సెప్టెంబర్ 13న వీరిద్దరినీ కాలేజీ మేనేజర్ వినోద్ యాదవ్ తన ఛాంబర్లోకి పిలిచి వేధించాడని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ మేనేజర్ వీరిద్దరినీ ఒక్కొక్కరిగా పిలిచి, చేతులు పట్టుకుని ఆటపట్టిస్తూ నువ్వు భారతీయురాలిలా కాకుండా విదేశీయురాలిలా కనిపిస్తున్నావంటూ కామెంట్ చేశాడన్నారు. అయితే ఆ విద్యార్థినులు నిరసన తెలపడంతో మేనేజర్ వారిని కులం పేరుతో దుర్భాషలాడాడని బాధిత బాలిక తండ్రి ఆరోపించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: HYD: నర్సింగ్ విద్యార్థినిపై హత్యాచారం? -
తరగతి గదిని స్విమ్మింగ్ ఫూల్ చేసిన హెడ్మాస్టర్!
ప్రస్తుతం దేశంలో ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు ఉక్కపోత, వేడి గాలులకు తల్లడిల్లిపోతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు తీవ్రమైన ఎండల కారణంగా అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ పరిస్థితులను గుర్తించిన ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వినూత్న ఆలోచనతో విద్యార్థులను పాఠశాలకు రప్పిస్తున్నారు.ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలోని ఒక ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పిల్లలను పాఠశాలకు రప్పించడానికి ఒక ప్రత్యేకమైన విధానాన్ని ఆశ్రయిస్తున్నారు. పాఠశాలలోని తరగతి గదిని స్విమ్మింగ్ పూల్‌గా మార్చివేశారు. ఇది విజయవంతమయ్యింది. దీంతో చిన్నారులంతా పాఠశాలకు క్రమంతప్పక వస్తున్నారు. తరగతి గదిలోని స్విమ్మింగ్ పూల్‌లో చిన్నారులు సరదాగా ఆడుకుంటున్న వైనానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇది కన్నౌజ్ జిల్లాలోని మహసోనాపూర్లోని ప్రాథమిక పాఠశాలకు సంబంధించిన ఉందంతం. ఇక్కడ ఉష్ణోగ్రతలు 40 నుండి 42 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటున్నాయి. దీంతో ఎండ వేడిమి నుంచి తమ పిల్లలను రక్షించేందుకు తల్లిదండ్రులు వారిని పాఠశాలలకు పంపడం లేదు. దీంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పిల్లల హాజరు శాతాన్ని పెంచేందుకు తరగతి గదిలోనే స్విమ్మింగ్ పూల్‌ను ఏర్పాటు చేశారు.పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వైభవ్ రాజ్‌పుత్ మీడియాతో మాట్లాడుతూ ‘పాఠశాలలోని ఒక తరగతి గదిని నీటితో నింపేసి, స్విమ్మింగ్ పూల్‌గా మార్చివేశాం. దీనిని చూసి పిల్లలు ముచ్చట పడ్డారు. ఆ స్విమ్మింగ్ ఫూల్లో ఆడుకోవడం మొదలు పెట్టారు. వారి ఆనందానికి అంతులేకుండా పోతోంది. ఆ నీటిలో ఈత కొడుతూ ఆడుకుంటున్నారు. ఇలా ఎంజాయ్ చేసేందుకు విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు వస్తున్నారు’ అని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో విద్యార్థులకు వేసవి సెలవులు మే 21 నుంచి జూన్ 30 వరకూ ఉంటాయి. -
జనవరి 9న అమ్మఒడి అందజేస్తాం
సాక్షి, తిరుపతి : ఈ నెల 26లోపు అమ్మ ఒడి లబ్ధిదారుల జాబితాను ప్రకటిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఆయన బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. గ్రామ సచివాలయాల్లో అభ్యర్థుల జాబితా పెడతామని, అందులో పేరులేని అర్హులైనవారు మళ్లీ నమోదు చేసుకోవచ్చని అన్నారు. 30న తుది జాబితా ప్రకటిస్తామని తెలిపారు. జనవరి 9న ముఖ్యమంత్రి చేతుల మీదుగా అమ్మ ఒడి నగదును తల్లుల ఖాతాలో వేస్తామన్నారు. (చదవండి: ‘43 లక్షల మంది తల్లులకు అన్నయ్య అయ్యారు’) ప్రయివేటు స్కూల్ విద్యార్థులకు కూడా అమ్మ ఒడిని ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పెద్దమనసుతో ప్రకటించారన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను ప్రతి స్కూల్ యాజమాన్యం పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. అమ్మ ఒడి డబ్బులను ఫీజులకు ముడిపెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గతేడాది ఫీజు 70శాతం మాత్రమే తీసుకోవాలన్నారు. అమ్మ ఒడి డబ్బును ఫీజులతో ముడి పెట్టటం ఆక్షేపణీయమని, ఇలాంటి పని ఏ స్కూల్ యాజమాన్యం చేసినా ఒప్పుకునేది లేదని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. -
తెలంగాణ విద్యాశాఖలో అవినీతి తిమింగలాలు
-
పాఠశాలపై దేశద్రోహం కేసు
సాక్షి, బీదర్: కర్నాటకలోని బీదర్‌లో ఒక విచిత్రమైన కేసు నమోదైంది. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కి వ్యతిరేకంగా వ్యవహరించారన్న ఆరోపణలతో ఒక పాఠశాలపై దేశద్రోహం కేసునమోదైంది. భారతీయ శిక్షాస్మృతిలోని 124 (ఎ), 153 (ఎ) సెక్షన్ల క్రింద "వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం" అనే ఆరోపణల నేపథ్యంలో కోసం షాహీన్ పాఠశాల యాజమాన్యంపై కూడా కేసులు నమోదయ్యాయి. జనవరి 26 న సామాజిక కార్యకర్త నీలేష్ రక్షాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. జనవరి 21న పాఠశాల అధికారులు విద్యార్థులను నాటకం ప్రదర్శించడానికి 'ఉపయోగించారని' ఫిర్యాదుదారుడు ఆరోపించారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), పౌరుల జాతీయ రిజిస్టర్ (ఎన్ఆర్సీ)ని తీసుకొచ్చిన ప్రధానమంత్రి నరేంద్రీ మోదీని స్కూలు యాజమాన్యం అవమానించిందనేది ప్రధాన ఆరోపణ. విద్యార్థులను అడ్డం పెట్టుకుని, వారు ప్రదర్శించిన నాటకం ద్వారా ప్రధాని మోదీని దుర్భాషలాడారని నీలేష్ ఆరోపించారు. అయితే ఇంతవరకు ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు. దీంతో నరేంద్రమోదీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కావాలనే విద్యార్థులను నాటకం ప్రదర్శించడానికి అనుమతించారనే ఆరోపణలతో దేశద్రోహ కేసు నమోదైంది. బీదర్ నగరంలోని షాహీన్ పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా, పాఠశాల విద్యార్థులు సీఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా చిన్న నాటకాన్ని ప్రదర్శించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎవరైనా మీ వద్దకు వచ్చి పత్రాల గురించి అడిగితే చెప్పులతో కొట్టండన్న డైలాగులు వివాదాన్ని సృష్టించాయి Recently on d anniversary of Shaheen's school in Bidar city, children played a short skid against CAA & NRC. & made a controversy by saying our beloved PM as a cheap teaseller, further in d play children said if the PM comes to u & ask about documents then beat him with chappals pic.twitter.com/LH9qjBpMoM — Enchanted_Virgo 🇮🇳 🚩 (@Snowflake_3925) January 27, 2020 -
పాఠశాలా.. పశువుల పాకనా...
సాక్షి, పెద్దపల్లి: రోజు పిల్లలు బడికి వెళ్ళడం చూస్తాం... కానీ ఇక్కడ రోజు గేదెలు వస్తాయి... ప్రార్థన అనంతరం పిల్లలు తరగతి గదులకు చేరుకోగానే పాఠశాల మైదానంలోని పచ్చికను మేస్తుంటే సిబ్బంది సైతం చూస్తూ పట్టించుకున్న పాపాన పోరు. ఇది పాఠశాల లేక బంజరు దొడ్డా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు... బుధవారం పెద్దపల్లి శివారు రంగంపల్లిలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల ఆవరణలో ఇలా గేదెలు మేస్తూ సాక్షికి కనిపించడంతో హుటాహుటిన సిబ్బంది కాపరితో సహా గేదెలను బయటకు తరిమారు. ప్రహరీ గోడ, గేటు ఉన్నా ఇది ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. -
‘సమ్మర్’ టీచర్లకు నిరాశ
ఆత్మకూరు(పరకాల) : జిల్లాలో 678 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. గత ఏడాది వేసవి సెలవుల్లో స్కూల్‌కు ఒకరి చొప్పున ప్రభుత్వ ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజన నిర్వహణ విధులకు హాజరయ్యారు. ఇందుకుగాను స్కూల్‌అసిస్టెంట్, హెచ్ఎం క్యాడర్ స్థాయి వారికి రోజుకు రూ.300, ఎస్జీటీలకు రూ.225 చొప్పున చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఏడాది గడుస్తున్నా గౌరవ వేతనం, పీపీఎల్(సంపాదిత సెలవులు) జాడలేదు. మళ్లీ ఎండాకాలం సెలవులు వస్తున్నాయి. ఇప్పటి వరకు హానరోరియం అందించకపోగా తాజాగా గౌరవ వేతనంలో భారీగా కోత పెడుతూ విద్యాశాఖ కమిషనర్ కిషన్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. రూ.300లకు బదులు రూ.25, రూ.225కు బదులు రూ.18.75 చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో ఉపాధ్యాయులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఇదెక్కడి అన్యాయమని ప్రశ్నిస్తున్నారు. మొదట ప్రకటించిన విధంగా హానరోరియమ్‌తో పాటు పీపీఎల్ సెలవులు మంజూరుచేస్తూ తిరిగి ఉత్తర్వులను జారీచేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
విద్యార్థిపై స్కూల్ నిర్వాహకుడి ఘాతుకం
కోయంబత్తూరు: క్రమశిక్షణ పేరిట విద్యార్థిపై ఓ స్కూల్ నిర్వాహకుడు ఘాతుకానికి ఒడిగట్టాడు. విద్యార్థి పట్ల అమానుషంగా ప్రవర్తించినందుకు అతడు తగిన మూల్యం చెల్లించుకోవాలసి వచ్చింది. విద్యార్ధుల పట్ల ఉపాధ్యాయులు, నిర్వాహకులు ఇలాంటి చర్యలకు పాల్పడుతుండటంతో పాఠశాలకు వెళ్లాలంటేనే విద్యార్ధులు భయంతో వణికిపోతున్నారు. తాజాగా తమిళనాడులో కోయంబత్తూరులో పాఠశాలకు ఆలస్యంగా వచ్చాడనే కారణంతో ఓ పాఠశాల నిర్వాహకుడు విద్యార్థిని ఇస్త్రీపెట్టితో కాల్చిన వైనం స్థానికంగా కలంకలం సృష్టించింది. విషయం తెలిసిన విద్యార్థి తల్లిదండ్రులు స్కూలు నిర్వాహకుడి తీరుపై ఆగ్రహించారు. అ నిర్వాహకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు స్కూల్ నిర్వాహకుడు షేక్ ఫరీద్‌ను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.