
సాక్షి, పెద్దపల్లి: రోజు పిల్లలు బడికి వెళ్ళడం చూస్తాం... కానీ ఇక్కడ రోజు గేదెలు వస్తాయి... ప్రార్థన అనంతరం పిల్లలు తరగతి గదులకు చేరుకోగానే పాఠశాల మైదానంలోని పచ్చికను మేస్తుంటే సిబ్బంది సైతం చూస్తూ పట్టించుకున్న పాపాన పోరు. ఇది పాఠశాల లేక బంజరు దొడ్డా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు... బుధవారం పెద్దపల్లి శివారు రంగంపల్లిలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల ఆవరణలో ఇలా గేదెలు మేస్తూ సాక్షికి కనిపించడంతో హుటాహుటిన సిబ్బంది కాపరితో సహా గేదెలను బయటకు తరిమారు. ప్రహరీ గోడ, గేటు ఉన్నా ఇది ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment