minority residential schools
-
బాలికల పాఠశాలలో దారుణం.. రెండు జడలు వేసుకోలేదని 200 గుంజీలు
జడ్చర్ల టౌన్: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పట్టణం కావేరమ్మపేటలో ఉన్న మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. విద్యార్థినులు రెండు జడలు వేసుకోలేదని ఆగ్రహించిన పీఈటీ శ్వేత బుధవారం వారితో 120 నుంచి 200 వరకు గుంజీలు (ఉట్బైట్) తీయించింది. దీంతో పిల్లలు నడవలేని స్థితికి చేరుకున్నారు. నొప్పులు తాళలేక రోదిస్తున్నారు. అయితే విషయం బయటకు పొక్కకుండా ఉపాధ్యాయులు తీవ్ర ప్రయత్నం చేశారు. 50 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురికాగా, కొందరికి జ్వరం వచ్చింది. కనీసం వైద్యాధికారులకు సమాచారం ఇవ్వకుండా తమకు తోచినవిధంగా ఉపశమన చర్యలు తీసుకుని సిక్‌రూంలో తాళం వేసి బంధించారు. గురువారం మధ్యాహ్నం 20 మందికి జ్వరం తీవ్రం కావడంతో అర్బన్‌హెల్త్ సెంటర్‌కు తీసుకువెళ్లి ప్రాథమిక చికిత్స చేయించారు. అయితే నొప్పులు భరించలేక కొందరు పిల్లలు తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో వారు పాఠశాల వద్దకు వచ్చి ఆందోళన చేపట్టారు. బుధవారం జరిగిన ఈ ఘటన తల్లిదండ్రుల ధర్నాతో గురువారం బయటకు వచ్చింది. అక్కడికి వెళ్లిన విలేకరులను సైతం ఉపాధ్యాయులు అడ్డుకున్నారు. ఇంత జరిగినా.. సెలవులో ఉన్న ప్రిన్సిపాల్ కల్పనకు గురువారం సాయంత్రం వరకు సమాచారం అందించలేదు. విషయం బయటకు పొక్కగానే ఆమె పాఠశాలకు చేరుకుని చిన్న విషయమే.. అంటూ దాటవేసేందుకు యత్నించారు. విషయం తెలుసుకున్న గురుకులాల ఆర్ఎల్సీ జమీర్ అహ్మద్ పాఠశాలకు చేరుకున్నారు. ఆయన కూడా ఇది చిన్న విషయమేనని పేర్కొన్నారు. కాగా, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కాంట్రాక్ట్ పద్ధతిపై పనిచేస్తున్న పీఈటీ శ్వేతను విధుల్లోంచి తొలగిస్తున్నట్లు జమీర్ అహ్మద్ తెలిపారు. -
పాఠశాలా.. పశువుల పాకనా...
సాక్షి, పెద్దపల్లి: రోజు పిల్లలు బడికి వెళ్ళడం చూస్తాం... కానీ ఇక్కడ రోజు గేదెలు వస్తాయి... ప్రార్థన అనంతరం పిల్లలు తరగతి గదులకు చేరుకోగానే పాఠశాల మైదానంలోని పచ్చికను మేస్తుంటే సిబ్బంది సైతం చూస్తూ పట్టించుకున్న పాపాన పోరు. ఇది పాఠశాల లేక బంజరు దొడ్డా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు... బుధవారం పెద్దపల్లి శివారు రంగంపల్లిలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల ఆవరణలో ఇలా గేదెలు మేస్తూ సాక్షికి కనిపించడంతో హుటాహుటిన సిబ్బంది కాపరితో సహా గేదెలను బయటకు తరిమారు. ప్రహరీ గోడ, గేటు ఉన్నా ఇది ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. -
గురుకులాల్లో 16వేల మందికి ప్రవేశాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 204 మైనారిటీ గురుకులాల్లో వచ్చే విద్యా సంవత్సరానికి గాను 5 నుంచి 9వ తరగతుల్లో 16 వేల మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించనున్నట్లు తెలంగాణ మైనారిటీ గురుకులాల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి బి.షఫీయుల్లా వెల్లడించారు. సోమవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. 2018–19 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతిలో కొత్త అడ్మిషన్లతో పాటు 6, 7, 8, 9వ తరగతుల్లో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. కుటుంబ వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలు గల విద్యార్థులు గురుకులాల్లో ప్రవేశాలకు అర్హులన్నారు. ఆన్లైన్లో tmreis.telangana.gov.in వెబ్సైట్ ద్వారా ఫొటో, ఆధార్‌తో ఏప్రిల్ 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. సీట్ల కంటే దరఖాస్తులు అధికంగా వస్తే ఏప్రిల్ 28న లక్కీ డ్రా ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తామని చెప్పారు. ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఏప్రిల్ 30 నుంచి మే 5 వరకు ఉంటుందన్నారు. జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయన్నారు. వివరాల కోసం హెల్ప్‌లైన్ నంబర్ 040–23437909ను సంప్రదించవచ్చన్నారు. -
అద్దె భవనం కావాలి
►మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లకు దొరకని అనువైన భవనాలు ►నెలల తరబడి జల్లెడ పడుతున్న అధికారులు ►స్కూళ్ల ప్రారంభానికి దగ్గర పడుతున్న సమయం ఇందూరు (నిజామాబాద్ అర్బన్) : జిల్లాకు 12 నూతన మైనారిటీ రెసిడెన్షియల్ సూళ్లు మంజూరు కాగా వాటికి భవనాలను సమకూర్చడం అధికారులకు పెద్ద సమస్యగా మారింది. భవనాలు అద్దెకు కావాలెను అని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు పత్రికల్లో ప్రకటనలు ఇస్తున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదు. రెండు, మూడు నెలలుగా అనువైన అద్దె భవనాల కోసం మైనారిటీ సంక్షేమ అధికారులు జిల్లా మొత్తం చక్కర్లు కొట్టి జల్లెడ పడుతున్నారు. కేవలం నాలుగైదు స్కూ ళ్లకు మాత్రమే అనువైన అద్దె భవనాలు దొరికాయి. అగ్రీమెంట్ కూడా చేసుకున్నారు. మిగిలిన వాటికి అద్దె భవనాలు దొరక్క అధికారులు నానా తంటాలు పడుతుంటే.. మరికొన్నింటికి దొరికినట్లే దొరికి చేజారుతున్నాయి. అద్దె భవనాల యజమానులు మళ్లీ వెనక్కి తీసుకుం టున్నారు. జిల్లాకు నూతనంగా 12 మై నారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లను 2017 జనవరి 27న జీఓ. నెంబర్ 4 ద్వారా ప్రభుత్వం మంజూరు చేసింది. నిజామాబాద్ ప్రాంతానికి మూడు బాలికల స్కూళ్లు, మూడు బా లుర స్కూళ్లు ఉం డగా డిచ్పల్లి బాలుర 1, బోధన్ బాలి కల 1, ఆర్మూర్ బాలి కల 1, రెంజల్ బాలికల 1, బాల్కొండ కు బాలుర 1, బాలికల 1 చొప్పున రెసిడెన్షియల్ స్కూ ళ్లు ఉన్నాయి. వీటికి సొంత భవనాలను నిర్మించే వరకు తా త్కాలికంగా అద్దె భవనాలను చూసి అందులో 2017–18 విద్యా సంవత్సరానికి తరగతులను ప్రారంభించాలని ప్రభుత్వం మైనారిటీ సంక్షేమాధికారులను ఆదేశించింది. అధికారులు ముం దుగా పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల పక్రియను పూర్తి చేశారు. ప్రస్తు తం జూన్ 12న స్కూళ్లు పున:ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లాకు మం జూరు చేసిన 12 స్కూళ్లను కూడా అప్పు డే ప్రారంభించాల్సి ఉంది. బాల, బాలి కలకు స్కూళ్లలోనే విద్యతో పాటు వస తి, భోజనం కల్పించాలి. తరగతుల బోధన, విద్యార్థులకు వసతిని కల్పించాలంటే ఇందుకు పెద్ద భవనాలు అవసరం ఉంటుంది. కనిపించిన వారికల్లా అద్దె భవనాలు ఉంటే చూడండి అని అధికారులు చెబుతూనే ఉన్నారు. చివరికి పత్రికల్లో ప్రకటనలు ఇస్తున్నారు. ప్రస్తుతం నాలుగైదు స్కూళ్లకు మాత్రమే అద్దె భవనాలు దొరికాయి. ఒక్కో భవనానికి ప్రభుత్వం నుంచి నెలకు రూ.1 లక్ష నుంచి రూ.1 లక్ష 50 వేలకు పైగా చెల్లించడానికి అధికారులు ముందుకు వస్తున్నారు.అయితే సౌకర్యాలున్న పెద్ద పెద్ద భవనాలు దొరకడం కష్టంగా మారింది. వెతుకుతున్నాం : కిషన్, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి జిల్లాకు మంజూరైన నూతన మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లకు అనువైన అద్దె భవనాల కోసం వెతుకుతున్నాం. ప్రస్తు తం కొన్ని స్కూళ్లకు భవనాలు దొరికా యి. మరికొన్నింటికి భవనాలు దొరకడం కష్టంగా మారింది. అద్దె భవనాల కోసం అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నాం. -
అదృష్టం ఉంటేనే ఆ గురుకులాల్లో ప్రవేశాలు!
► నేడు లక్కీ డ్రా ద్వారా మైనారిటీ గురుకులాల్లో విద్యార్థుల ఎంపిక ► హైదరాబాద్ మినహా 30 జిల్లాల్లో అడ్మిషన్ల ప్రక్రియ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న మైనారిటీ గురుకుల పాఠశాలల్లో ప్రవేశానికి విద్యార్థులు అదృష్టం పరీక్షించుకోవాల్సిందే. 2017–18 విద్యా సంవత్సరానికి మైనారిటీ గురుకుల పాఠశాల్లో 5, 6, 7 తరగతుల్లో లక్కీ డ్రా ద్వారా అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగనుంది. హైదరాబాద్ జిల్లాలోని 31 పాఠశాలలు మినహా మిగిలిన 30 జిల్లాల్లో 170 పాఠశాలల్లో ప్రవేశానికి గురువారం లక్కీ డ్రా ద్వారా విద్యార్థులను ఎంపిక చేయనున్నారు. మొత్తం 201 గురుకులాల్లోని 5, 6, 7 తరగతుల్లో 35 వేల సీట్లు ఉండగా ఆన్లైన్, ఆఫ్‌లైన్ ద్వారా సుమారు 85 వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో దరఖాస్తులు చేసుకునే గడువు ఈ నెల 15 వరకు ఉండటంతో 19వ తేదిన లక్కీ డ్రా నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర మైనారిటీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టెమ్రీస్) ప్రకటించింది. మొత్తం 210 పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నూతనంగా ప్రారంభిస్తున్న 118 గురుకుల పాఠశాల్లో ఐదు, ఆరు, ఏడు తరగతుల్లో, గతేడాది ప్రారంభించిన 71 పాఠశాలలతోపాటు విద్యాశాఖ నుంచి బదిలీ అయిన 12 పాఠశాలల్లో కేవలం 5వ తరగతిలో మాత్రమే ప్రవేశం కల్పించనున్నారు. లక్కీ డ్రా అనంతరం విద్యార్థుల జాబితాను ప్రకటించి అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగించనున్నారు. మొత్తం సీట్లలో మైనారిటీలైన ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్శీలకు 75 శాతం, మైనారిటీయేతరులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ/ఈబీసీలకు 25 శాతం ప్రాతిపదికన ప్రవేశం కల్పించనున్నారు. లక్కీ డ్రాలో తల్లిదండ్రులు పాల్గొనాలి మైనారిటీ గురుకుల పాఠశాలల్లో ఐదు, ఆరు, ఏడు తరగతుల్లో ప్రవేశానికి గురువారం నిర్వహించే లక్కీ డ్రా లో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొనాలని రాష్ట్ర మైనారిటీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి బి.షఫీ ఉల్లా కోరారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా నాణ్యమైన మాంటిస్సోరి విద్యా బోధన, వసతులు అందిస్తున్నామన్నారు. బాలికలకు గట్టి భద్రత కల్పిస్తున్నామన్నారు. -
1,907 పోస్టులు మంజూరు
రాష్ట్రంలోని మైనారిటీ, ఎస్సీ రెసిడెన్షియల్ స్కూళ్లకు 1,907 పోస్టులు మంజూరయ్యాయి. దీనికి సంబంధించిన ఫైలుపై బుధవారం సీఎం కేసీఆర్ సంతకం చేశారు. ఇందులో మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లలో 1,640 పోస్టులు, ఎస్సీ రెసిడెన్షియల్ స్కూళ్లలో 267 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి.