క్రమశిక్షణ పేరిట విద్యార్థిపై ఓ స్కూల్ నిర్వాహకుడు ఘాతుకానికి ఒడిగట్టాడు. విద్యార్థి పట్ల అమానుషంగా ప్రవర్తించినందుకు అతడు తగిన మూల్యం చెల్లించుకోవాలసి వచ్చింది.
కోయంబత్తూరు: క్రమశిక్షణ పేరిట విద్యార్థిపై ఓ స్కూల్ నిర్వాహకుడు ఘాతుకానికి ఒడిగట్టాడు. విద్యార్థి పట్ల అమానుషంగా ప్రవర్తించినందుకు అతడు తగిన మూల్యం చెల్లించుకోవాలసి వచ్చింది. విద్యార్ధుల పట్ల ఉపాధ్యాయులు, నిర్వాహకులు ఇలాంటి చర్యలకు పాల్పడుతుండటంతో పాఠశాలకు వెళ్లాలంటేనే విద్యార్ధులు భయంతో వణికిపోతున్నారు. తాజాగా తమిళనాడులో కోయంబత్తూరులో పాఠశాలకు ఆలస్యంగా వచ్చాడనే కారణంతో ఓ పాఠశాల నిర్వాహకుడు విద్యార్థిని ఇస్త్రీపెట్టితో కాల్చిన వైనం స్థానికంగా కలంకలం సృష్టించింది.
విషయం తెలిసిన విద్యార్థి తల్లిదండ్రులు స్కూలు నిర్వాహకుడి తీరుపై ఆగ్రహించారు. అ నిర్వాహకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు స్కూల్ నిర్వాహకుడు షేక్ ఫరీద్ను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.