![Coimbatore Kovai co Bonus Rs 14 5 Crore To Employees](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/bonus.jpg.webp?itok=4B89NtQz)
దేశంలోని చాలా దిగ్గజ కంపెనీలు భారీ లాభాలను పొందినప్పటికీ.. ఉద్యోగులను తొలగించడం, జీతాలు పెంచకపోవడం వంటివి చేస్తుంటాయి. ఇలాంటి ఘటనలు గతంలో కోకొల్లలు. అయితే తాజాగా కోయంబత్తూరుకు చెందిన ఓ కంపెనీ మాత్రం తన ఉద్యోగులకు ఏకంగా రూ.14.5 కోట్ల బోనస్ ప్రకటించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
కోయంబత్తూరుకు చెందిన 'కోవై.కో' అనే కంపెనీ.. సంస్థలో మూడేళ్ళుగా పనిచేస్తున్న 140 మంది ఉద్యోగులకు 'టుగెదర్ వి గ్రో' చొరవ కింద రూ.14.5 కోట్లు విరాళం ప్రకటించింది. ఈ బోనస్‌ను డిసెంబర్ 31, 2022 నాటికి కంపెనీలో మూడు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన వారికి పంపిణీ చేయనున్నట్లు సమాచారం.
మూడేళ్లు పూర్తి చేసిన ఉద్యోగులు వారి వార్షిక జీతంలో 50% బోనస్ పొందుతారు. ఇది వారి కృషి, అంకితభావానికి నిదర్శనం. ఇప్పటికే మొదటి దశలో 80 మందికి పైగా ఉద్యోగులు ఇప్పటికే వారి జనవరి జీత చెల్లింపులలో భాగంగా బోనస్‌లను అందుకున్నారు.
కంపెనీ వృద్ధికి, విజయానికి సహాయపడే ఉద్యోగులకు.. సంస్థ పొందిన లాభాలలో వాటా ఇవ్వడం నా కల. అందుకే ఉద్యోగులకు బోనస్‌లు ఇస్తున్నట్లు కోవై.కో వ్యవస్థాపకుడు.. సీఈఓ శరవణ కుమార్ అన్నారు. 2023లో కంపెనీ గణనీయమైన లాభాలను ఆర్జించింది. బెంగళూరుకు చెందిన ఫ్లోయిక్‌ను కొనుగోలు చేసిన తరువాత సంస్థ వేగంగా అభివృద్ధి చెందిందని ఆయన అన్నారు.
ఇదీ చదవండి: ముంబైలో ఆఫీస్ కొన్న సన్నీ లియోన్.. ఎన్ని కొట్లో తెలుసా?
ఉద్యోగులకు షేర్ రూపంలో ఇవ్వడం కంటే.. నగదు రూపంలో డబ్బు ఇవ్వడం వల్ల వారి ప్రయోజనాలను ఉపయోగపడుతుంది. బ్యాంక్ లోన్స్ చెల్లించడానికి లేదా ఇతర అవసరాలకు ఈ డబ్బు ఉపయోగపడుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకునే బోనస్‌ను నగదు రూపంలో ఇవ్వాలని నిర్ణయించినట్లు శరవణ కుమార్ పేర్కొన్నారు. కంపెనీ తాము ఊహించినదానికంటే ఎక్కువ బోనస్ ఇచ్చినందులు ఉద్యోగుల ఆనందానికి అవధులు లేకుండా పోతోంది.
Comments
Please login to add a commentAdd a comment