
ముజఫర్‌నగర్: లోన్ తీసుకుని మరీ.. మరదలిపై సామూహి క అత్యాచారం, హత్య చేయించాడో ప్రభుద్ధుడు. ఈ దారుణ ఘటన యూపీలోని మీరట్‌లో జరిగింది. ముజఫర్‌నగర్‌కు చెందిన ఆశిష్ అనే వ్యక్తి.. తన భార్య చెల్లెలితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఏం జరిగిందో తెలియదు.. ఆమెను వదిలించుకోవాలనుకున్నాడు. చంపేంత ధైర్యం ఒక్కడికే లేదు. అందుకోసం ఇద్దరు మనుషులను మాట్లాడుకున్నాడు. వారికి చెల్లించడానికి డబ్బులు లేకపోవడంతో రూ.40 వేలు అప్పుగా తీసుకుని మరీ శుభమ్, అతని స్నేహితుడు దీపక్‌కు చెల్లించాడు. జనవరి 21న బాధితురాలికి కాల్ చేసి రప్పించారు.
స్కూటర్‌పై మీరట్‌లోని నాను కాలువ సమీపంలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తరువాత కండువాతో గొంతు నులిమి చంపేశారు. మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగులబెట్టి.. ఎక్కడి వాళ్లక్కడ వెళ్లిపోయారు. 21న ఇంటి నుంచి వెళ్లిపోయిన అమ్మాయి ఎంతకీ రాకపోవడం, ఫోన్ పనిచేయకపోవడంతో జనవరి 23న కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె చివరిసారి ఆశిష్, శుభం, దీపక్‌లతో కనిపించినట్లు తేలింది. ఆశిశ్‌ను విచారించడంతో నేరాన్ని అంగీకరించాడు. మరదలు బ్లాక్‌మెయిల్ చేయడంవల్లే చంపాల్సి వచ్చిందని చెప్పాడు. ఘటనా స్థలం నుంచి బాధితురాలి అవశేషాలు, కాలిపోయిన దుస్తులు, ఉంగరం, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment