తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయుకురాలు మహువా మొయిత్రా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై విమర్శలు గుప్పించారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న ఐఐటీ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఓ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన దోషులపై ఎందుకు బుల్డోజర్ చర్యలు తీసుకోవడం లేదని మహువా మొయిత్రా సూటిగా ప్రశ్నించారు.
2013 నవంబర్ 1న ఐఐటీ బీహెచ్‌యూలో ముగ్గురు వ్యక్తులు ఓ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పపడ్డారు. ఈ ఘటనలోని నిందితులు బీజేపీ పార్టీ ఐటీ సెల్‌కు చెందినవారని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. వారిని ఆలస్యంగా అరెస్ట్ చేయడం వల్ల సాక్ష్యాలను తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని దుయ్యబట్టారు. ‘విద్యార్థినిపై వేధింపులకు పాల్పడిన నిందితులపై సీఎం సీఎం యోగి ‘బుల్డోజర్ చర్యలు’ ఎందుకు తీసుకోవటం లేదు?. ఈ ఘటన జరిగి రెండు నెలలు గడిచిపోయింది. వారంతా బీజేపీ ఐటీ సెల్ చెందినవారే’ అంటూ ఆమె నిందితులు సీఎం యోగితో దిగిన ఫొటోలను ‘ఎక్స్’ ట్విటర్‌లో ప్రశ్నించారు.
Wonder Ajay Bisht aka @myogiadityanath was doing since Nov 2nd when his BJP Troll Sena aka IT cell vaanars gang -raped a woman.
— Mahua Moitra (@MahuaMoitra) January 2, 2024
Thok dijiye, Sir. Is Baar Bulldozer Chalaane Mein Itni Der Kyon? pic.twitter.com/R4xvJMG1D5
తాజాగా విద్యార్థినిపై లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన ముగ్గురు నిందితులను పార్టీ నుంచి బీజేపీ బహిస్కరించింది. ఇక నిందితులను కునాల్ పాండే, ఆనంద్ చౌహాన్, సాక్షం పటేల్‌గా పోలీసులు గుర్తించారు. ఆదివారం పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. కాగా విద్యార్ధినిపై లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన నిందితులు.. బీజేపీ సభ్యులని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆరోపించారు.
చదవండి: Dawood Ibrahim Maharashtra Home: వేలానికి దావూద్ ఇబ్రహీం చిన్ననాటి ఇల్లు
Comments
Please login to add a commentAdd a comment