Delhi Chattarpur Woman Slipper Slap At Man Hindu Ekta Manch Event - Sakshi
Sakshi News home page

షాకింగ్‌ వీడియో: కూతురిని ట్రాప్‌ చేసి తీసుకెళ్లాడు.. స్టేజ్‌పై చెప్పుతో వాడి తండ్రిని కొట్టింది

Published Tue, Nov 29 2022 2:33 PM | Last Updated on Tue, Nov 29 2022 3:58 PM

Delhi Chattarpur Woman Slipper Slap At Man Hindu Ekta Manch Event - Sakshi

ఢిల్లీ: దేశరాజధానిలో హిందూ ఏక్తా మంచ్‌ ఇవాళ నిర్వహించిన ఓ కార్యక్రమం రసాభాసగా మారింది. వేదిక మీద ప్రసంగిస్తున్న సమయంలో  ఓ మహిళ.. నిర్వాహకుల్లో ఒకతన్ని చెప్పుతో కొట్టింది. 

హిందూ ఏక్తా మంచ్‌ ఆధ్వర్యంలో భేటీ బచావో మహాపంచాయత్‌ కార్యక్రమాన్ని ఛత్తార్‌పూర్‌ ప్రాంతంలో నిర్వహించారు. దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన శ్రద్ధా వాకర్‌ హత్యోదంతంపై ఈ కార్యక్రమంలో చర్చ జరిగింది. ఆ సమయంలో వేదిక ఎక్కిన ఓ మహిళ.. తన సమస్యలను ప్రస్తావించుకుంటూ వెళ్లింది. అయితే.. ఏమైందో ఏమో ఉన్నట్లుండి ఒక్కసారిగా  ఆమె ప్రసంగం ఆపి మరీ తన చెప్పు తీసి పక్కనే ఉన్న అతన్ని లాగి కొట్టింది. దీంతో అక్కడే ఉన్న కొందరు ఆమెను అడ్డుకునే యత్నం చేశారు. 

ఆ పెనుగులాటలోనూ ఆమె తన సమస్యలను చెప్తుండగా.. వేదిక మీద ఉన్న నిర్వాహకులు మైకును పక్కకు తప్పించే యత్నం చేశారు. ఆ మహిళ కూతురిని, ఆ పక్కనే ఉన్న వ్యక్తి కొడుకు ప్రేమ మాయమాటలతో ఎటో తీసుకెళ్లిపోయాడట. అందుకే ఆమె ప్రసంగిస్తున్న టైంలో అడ్డుకునే యత్నం చేశాడని తెలుస్తోంది. ‘ఐదు రోజుల నుంచి పోలీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నా. ఎవరూ నన్ను పట్టించుకోవట్లేదు అని ఆక్రోశంతో చెప్తూనే ఆమె చెప్పుతో అతన్ని లాగి కొట్టింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement