
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): చోరీ కోసం ఓ మహిళ దారుణానికి ఒడిగట్టింది. ఏకంగా యాసిడ్ దాడికి పాల్పడింది. వృద్ధురాలి మెడలోని బంగారం చోరీ చేసేందుకు విఫలయత్నం చేయగా... బాధితురాలు గట్టిగా అరవడంతో నోటిలో యాసిడ్ పోసి నిందితురాలు పరారయింది. ఈ దుర్ఘటన రిటైర్డ్ జడ్జి ఇంటిలో చోటు చేసుకుంది. ఎంవీపీ జోన్ ఎస్‌ఐ గోవింద్ రాజు తెలిపిన వివరాల ప్రకారం... ఎంవీపీ కాలనీ సెక్టార్ – 2లో రిటైర్డ్ జడ్జి రామారావు, సత్యవతి దంపతులు నివాసం ఉంటున్నారు. సోమవా రం సాయంత్రం రామరావు వాకింగ్ కోసం వెళ్లారు.
అదే సమయంలో వారి ఎదురింటిలో పనిచేస్తున్న రమణమ్మ అనే మహిళ సత్యవతి మెడలోని బంగారం చోరీ చేసేందుకు విఫలయత్నం చేసింది. సత్యవతి పెద్దగా అరవడంతో రమణమ్మ వెంటనే బాత్‌రూమ్‌లో ఉన్న యాసి డ్ తీసుకొచ్చి సత్యవతి నోటిలో పోసి పరారయింది. స్థానికులు సత్యవతిని స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె భర్త రిటైర్డ్ జడ్జి రామారావు ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ గోవింద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment