భారీ మోసం.. జ్యువెలరీ షాపు ఎండీ అరెస్టు | Jewellery MD Cheat To Private Chit Fund In Hyderabad | Sakshi
Sakshi News home page

Published Fri, Jun 29 2018 7:15 PM | Last Updated on Tue, Sep 4 2018 5:44 PM

Jewellery MD Cheat To Private Chit Fund In Hyderabad

సాక్షి, హైదరాబాద్ : నగరంలోని మీనా జ్యువెలరీ ఎండీ భారీ మోసానికి పాల్పడ్డాడు. ఈ ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. నగల దుకాణం ఎండీ ఉమేష్‌ జత్వాని ఎల్లారెడ్డిగూడాలోని ఓ ప్రైవేట్‌ చిట్‌ ఫండ్‌ వద్ద రూ. 6 కోట్లు చిట్టీల రూపంలో తీసుకున్నారు. అతను చిట్టీ వాయిదాలు చెల్లించడంలో ఆలస్యం చేయడంతో చిట్‌ ఫండ్‌ వారికి అనుమానం వచ్చింది. అంతేకాక ఆ ఎండీ అకౌంట్‌ క్లోజ్‌ చేసిన చెక్కులు ఇచ్చి మోసం చేశాడని చిట్‌ ఫండ్‌ కంపెనీ చైర్మన్‌ హనుమంతరావు సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

రంగంలోకి దిగిన పోలీసులు బంజరాహిల్స్‌లోని మీనా జ్యువెలరీ ఎండీ ఉమేష్‌ జత్వాని, అతని కొడుకు కరణ్‌ జత్వానిలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement