
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, జగిత్యాలటౌన్: మెదక్ జిల్లా శివ్వంపేట తహసీల్దార్ భానుప్రకాశ్‌పై డీజిల్ పోయడం అమానుషమని ట్రెసా జిల్లా అధ్యక్షుడు ఎండీ.వకీల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని రెవెన్యూ భవన్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ధరణి వెబ్‌సైట్‌లో అన్ని ఆప్షన్లు లేకపోవడం వల్లే సమస్యలు వస్తున్నాయని చెప్పారు.
ప్రభుత్వ అధికారులపై ఇలాంటి దాడులు సబబు కాదని తెలిపారు. తహసీల్దార్ కార్యాలయాల్లో సీసీ కెమెరాలు, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. సంఘం జిల్లా కార్యదర్శి కృష్ణ, నాయబ్ తహసీల్దార్లు పాల్గొన్నారు.