సాక్షి, రాయికల్(జగిత్యాల): తాను పీసీసీ రేసులో ఉన్నప్పటికీ పదవి రాలేదని ఏరోజూ బాధపడలేదని, కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకు న్నా తాను కట్టుబడి ఉంటానని అన్నారు. ఏ రోజు కూడా పదవుల కోసం ఆశపడలేదని తెలి పారు. కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం కష్టపడిన వారికి తప్పకుండా గుర్తింపు వస్తుందనే నమ్మకం ఉందని అభిప్రాయపడ్డారు. అందరితో ఐకమత్యంగా ఉంటూ పార్టీ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ఆయన వెల్లడించారు. మిషన్ భగీరథ విషయంలో బీజేపీ నాయకులు సీఎం కేసీఆర్‌పై సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.
మిషన్ భగీరథపై విచారణ జరిపించాలి
మిషన్ భగీరథ పథకంలో చోటుచేసుకున్న అక్రమాలపై దమ్ముంటే బీజేపీ నాయకులు సీఎం కేసీఆర్‌పై సీబీఐ విచారణ చేయించాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి సవాల్ విసిరారు. సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకం పేరిట రూ.50 వేల కోట్లతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడా మిషన్ భగీరథ నీరు క్లోరినేషన్ చేసి సరఫరా చేయడం లేదని ఆరోపించారు. ఆ నీటితో బట్టలు ఉతకడం, మరుగుదొడ్లు శుభ్రం చేసేందుకే వినియోగిస్తున్నారని తెలిపారు.
మిషన్ భగీరథకు వెచ్చించిన నిధులతో ప్రతీ గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి స్వ చ్ఛమైన తాగునీరు అందించే వీలుందని అన్నా రు. ఈసందర్భంగా కైరిగూడెంలో మిషన్ భగీ రథనీరు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు జీవన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన గ్రామానికి చేరుకుని అధికారుల తీరుపై ఆగ్రహంవ్యక్తం చేశారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోపి రాజిరెడ్డి, నాయకులు రవీందర్‌రావు, కొయ్యడి మహిపాల్‌రెడ్డి, మ్యాకల రమేశ్, బాపురపు నర్సయ్య, ఎద్దండి దివాకర్‌రె డ్డి,మహేందర్‌గౌడ్,నర్సింహారెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment