ప్రస్తుత రోజుల్లో ఆహార పదార్థాలను ఇంటికే డెలివరీ చేస్తున్నాయి పలు సంస్థలు. వర్షం, ట్రాఫిక్ వంటి అడ్డంకులను అధిగమించి ఆహారాన్ని మన వద్దకు చేరుస్తారు డెలివరీ ఏజెంట్లు. కొన్ని సార్లు చిన్న పొరపాట్లు జరిగాయని క్షణికావేశంలో డెలివరీ ఏజెంట్లపై కస్టమర్లు దాడి చేసిన సంఘటనలు వెలుగు చూశాయి. అలాంటి వీడియోనే ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఈ దృశ్యాలను బోగాస్04 అనే ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో.. నడిరోడ్డుపై ఓ డెలివరీ బాయ్‌పై దాడికి దిగింది ఓ యువతి. షూతో కొడుతూ దుర్భాషలాడింది. ఆమె దాడి చేస్తున్నా మౌనంగా ఉండిపోయిన బాధితుడు.. తన ఉద్యోగం పోతుందేమోననే భయంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ‘హాయ్ జొమాటోకేర్.. నా ఆర్డర్ అందించేందుకు వస్తుండగా డెలివరీ బాయ్ దాడికి గురయ్యాడు. అతడి నుంచి ఆర్డర్ లాక్కున్న కొందరు మహిళలు అతడిని షూతో కొట్టారు. నా వద్దకు ఏడ్చుకుంటూ వచ్చిన బాధితుడు ఉద్యోగం పోతుందని బాధపడ్డాడు.’ అంటూ రాసుకొచ్చారు నెటిజన్. జొమాటో కస్టమర్ కేర్‌కు ఫోన్ చేస్తే ఎలాంటి స్పందన లేదని తెలిపారు. తన ఆర్డర్ గురించి పట్టించుకోనవసరం లేదని, దాడికి గురైన బాధితుడికి సాయం చేయాలని సూచించినట్లు చెప్పారు. మరోవైపు.. ఈ విషయాన్ని పరిశీలిస్తామని కామెంట్ చేసింది జొమాటో. దాడికి పాల్పడిన మహిళపై కేసు పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: ‘రియల్ హీరో’.. పిల్లలతో విధులకు జొమాటో డెలివరీ బాయ్
Comments
Please login to add a commentAdd a comment