attack with slippers
-
ఎవరికో వచ్చిన ఆర్డర్ లాక్కుని డెలివరీ బాయ్‌పై యువతి దాడి
ప్రస్తుత రోజుల్లో ఆహార పదార్థాలను ఇంటికే డెలివరీ చేస్తున్నాయి పలు సంస్థలు. వర్షం, ట్రాఫిక్ వంటి అడ్డంకులను అధిగమించి ఆహారాన్ని మన వద్దకు చేరుస్తారు డెలివరీ ఏజెంట్లు. కొన్ని సార్లు చిన్న పొరపాట్లు జరిగాయని క్షణికావేశంలో డెలివరీ ఏజెంట్లపై కస్టమర్లు దాడి చేసిన సంఘటనలు వెలుగు చూశాయి. అలాంటి వీడియోనే ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ దృశ్యాలను బోగాస్04 అనే ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో.. నడిరోడ్డుపై ఓ డెలివరీ బాయ్‌పై దాడికి దిగింది ఓ యువతి. షూతో కొడుతూ దుర్భాషలాడింది. ఆమె దాడి చేస్తున్నా మౌనంగా ఉండిపోయిన బాధితుడు.. తన ఉద్యోగం పోతుందేమోననే భయంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ‘హాయ్ జొమాటోకేర్.. నా ఆర్డర్ అందించేందుకు వస్తుండగా డెలివరీ బాయ్ దాడికి గురయ్యాడు. అతడి నుంచి ఆర్డర్ లాక్కున్న కొందరు మహిళలు అతడిని షూతో కొట్టారు. నా వద్దకు ఏడ్చుకుంటూ వచ్చిన బాధితుడు ఉద్యోగం పోతుందని బాధపడ్డాడు.’ అంటూ రాసుకొచ్చారు నెటిజన్. జొమాటో కస్టమర్ కేర్‌కు ఫోన్ చేస్తే ఎలాంటి స్పందన లేదని తెలిపారు. తన ఆర్డర్ గురించి పట్టించుకోనవసరం లేదని, దాడికి గురైన బాధితుడికి సాయం చేయాలని సూచించినట్లు చెప్పారు. మరోవైపు.. ఈ విషయాన్ని పరిశీలిస్తామని కామెంట్ చేసింది జొమాటో. దాడికి పాల్పడిన మహిళపై కేసు పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: ‘రియల్ హీరో’.. పిల్లలతో విధులకు జొమాటో డెలివరీ బాయ్ -
25 సార్లు చెప్పుతో కొట్టాను: ఎంపీ
-
మన దేశాన్ని దేవుడే కాపాడాలి
-
మన దేశాన్ని దేవుడే కాపాడాలి
న్యూఢిల్లీ: శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని, అందరిముందు తనను తీవ్రంగా అవమానించి దాడికి పాల్పడ్డారని ఎయిరిండియా అధికారి సుకుమార్ చెప్పారు. ఎంపీ తన కళ్లజోడు పగలగొట్టారని, ఇలాంటి ఘటన జరుగుతుందని తాను ఎప్పుడూ ఊహించలేదని అన్నారు. మన ఎంపీల ప్రవర్తన, సంస్కృతి ఇదే అయితే మన దేశాన్ని దేవుడే రక్షించాలని సుకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. గైక్వాడ్‌పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని సుకుమార్ డిమాండ్ చేశారు. దాడి ఘటనకు సంబంధించి ఆయనపై ఫిర్యాదు చేశారు. సీటు విషయంపై ఎంపీ చెప్పిన విషయం సాధ్యంకాదని చెప్పానని, దీంతో ఎంపీ తనను అసభ్య పదజాలంతో తిట్టారని, చేయిచేసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గురువారం ఢిల్లీ విమానాశ్రయంలో సీటు విషయంపై సుకుమార్‌తో గొడవపడిన ఎంపీ గైక్వాడ్ చెప్పుతో ఆయన్ను కొట్టారు. ఈ విషయాన్ని ఎంపీ అంగీకరించారు. ఎంపీ దురుసు ప్రవర్తనపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు ఈ ఘటనపై స్పందిస్తూ.. భౌతిక దాడులను ఏ పార్టీ కూడా ప్రోత్సహించదని, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకూడదని అన్నారు. ఇలాంటి ఘటనలను శివసేన సహించదని ఆ పార్టీ నేత మనీషా కయండె చెప్పారు. -
25 సార్లు చెప్పుతో కొట్టాను: ఎంపీ
న్యూఢిల్లీ: తానో ఎంపీనని.. గౌరవ, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నానన్న విషయాన్ని, స్థాయిని మరచిపోయిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ ఢిల్లీ విమానాశ్రయంలో గురువారం వీరంగం సృష్టించారు. సీటు విషయంపై ఎయిరిండియా సిబ్బందితో గొడవపడి దాడి చేశారు. ఎంపీ ఆగ్రహంతో దుర్భాషలాడుతూ, తన చెప్పు తీసి ఎయిరిండియా అధికారిని కొట్టారు. ఎయిరిండియా అధికారిపై దాడి చేసిన విషయాన్ని గైక్వాడ్ అంగీకరించారు. తన పట్ల ఆయన దురుసుగా ప్రవర్తించాడని, 25 సార్లు చెప్పుతో కొట్టానని అన్నారు. తాను బిజినెస్ క్లాస్ టికెట్ తీసుకోగా, ఎకానమీ క్లాస్ సీటు ఇచ్చారని చెప్పారు. ఈ విషయం గురించి తాను ఫిర్యాదు చేయగా, ఎయిరిండియా సిబ్బంది సరిగా స్పందించలేదని తెలిపారు. మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ నుంచి గైక్వాడ్ తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. ఎయిరిండియా ప్రతినిధి మాట్లాడుతూ.. ఈ ఘటనపై విచారణకు ఓ బృందాన్ని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. సీటు విషయంపై గొడవ జరిగినట్టు తెలిపారు.