దేశ వాణిజ్య రాజధాని ముంబై మురికివాడలో జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో గతంలో చాలా సినిమాల్లో చూశాం. తాజాగా జొమాటో డెలివరీ ఏజెంట్ షేర్ చేసిన అతని హోం టూర్ ఇంటర్నెట్‌లో సంచలనంగా మారింది. ప్రంజయ్ బోర్గోయరీ ఇన్‌స్టాలో రూ. 500 అద్దెతో జీవిస్తున్న తన గదికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఇప్పటికే 50 లక్షలకు పైగా మిలియన్స్‌తో ఇది వైరల్ అవుతోంది.
ఈశాన్య భారతదేశానికి చెందిన ప్రంజయ్ బోర్గోయరీ అనే యువకుడు ఉపాధి నిమిత్తం ముంబైకి వచ్చాడు. మహానగరాల్లో ఉద్యోగంలో వెతుక్కునే సమయంలో అందరికీ కనిపించే తొలి ఆప్షన్. డెలివరీ బాయ్ లేదా, క్యాబ్, బైక్ రైడింగ్. ఇతను కూడా జొమాటో డెలివరీ బాయ్ పనే ఎంచుకున్నాడు. సోనూ అనే స్నేహితుడితో కలిసి ఇరుకు గదిలో ఉంటున్నాడు.ఈ క్రమంలో తన కఠినమైన జీవన పరిస్థితులను గురించి ‘స్ట్రగులింగ్ ఆర్టిస్ట్’ అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాలో షేర్ చేశాడు.
తన కుటుంబ నేపథ్యం, నిరుపేదలైన తల్లిదండ్రులను కష్టాలను ఈ వీడియోలో పంచుకున్నాడు. ఇప్పటికే తన కోసం వారు చాలా ఖర్చుచేశారని, ముఖ్యంగా తాను అనారోగ్యానికి గురైనప్పుడు వాళ్లు ఎంతో ఇబ్బంది పడి వైద్యం చేయించారని గుర్తు చేసుకున్నాడు. అందుకే ఇకపై వాళ్లపై ఆధారపడి జీవించడం ఇష్టం లేదని చెప్పుకొచ్చాడు. అలాగే టాయిలెట్ రూం కష్టాలను కూడా కళ్ళకు కట్టినట్టు మరో వీడియోలో చూపించాడు. అన్నట్టు వీళ్లకి ఒక పిల్లి పిల్ల కూడా ఉంది. సింగర్‌గా ఫుట్ బాయల్ ప్లేయర్‌గా రాణించాలనే ఇతని డ్రీమ్.
త్వరలోనే ఈ పరిస్థితులనుంచి బయటపడేలా కృషి చేస్తా అన్నాడు. ముంబై మురికివాడల్లో జీవితం ఎంత దుర్బరంగా ఉంటుందో తెలిసింది అంటూ నెటిజన్లు కమెంట్ చేశారు. బోర్గోయరీకి ఆన్‌లైన్‌లో భారీ మద్దతు లభిస్తోంది. అతడి వీడియో చూసిన స్పందించిన ఖుషీ యూజర్ మూడు నెలల అద్దె చెల్లించాడు. మంచి రోజులు వస్తాయంటూ శుభాకాంక్షలందించారు మరికొంతమంది. ఇతనికి ప్రస్తుతం ఇన్‌స్టాలో 1.45 లక్షల మంది ఫాలోయర్లు ఉండటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment