ఒడిషా: దుండగల ఆగడాలు రోజురోజుకూ మితిమీరుతున్నాయి. ఒకవైపు మహిళలపై దాడులకు పాల్పడితే కఠిన శిక్షలు విధిస్తామంటూ ప్రభుత్వం హెచ్చరిస్తున్న మహిళలపై ఉన్మాదులు దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. నిర్భయ చట్టం తెచ్చిన దుండగుల ఆగడాలు అరికట్టలేని దుస్థతి ఏర్పడింది. దేశంలో ఎక్కడో ఒకచోట మహిళలు దాడులకు గురవతూనే ఉన్నారు.
తాజాగా ఓ మహిళపై కిరోసిన్ పోసి దుండగులు నిప్పుంటించిన ఘటన ఒడిషా రాష్ట్రంలో బుధవారం చోటుచేసుకుంది. రేషన్ డీలర్గా వ్యాపారం చేస్తున్న ఆమెపై దుండగులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. మంటల తీవ్రతతో ఆమె శరీరం దాదాపు సగం కాలిపోయినట్టు పోలీసులు తెలిపారు. ఆమె పరిస్థతి విషమించడంతో చికిత్స మేరకు విశాఖ జిల్లా ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు పేర్కొన్నారు. చికిత్స పొందుతూ ఆ మహిళ మృతిచెందినట్టు సమాచారం.
మహిళపై కిరోసిన్ పోసి నిప్పుంటించిన దుండగులు
Published Wed, Jan 1 2014 6:21 PM | Last Updated on Sat, Sep 2 2017 2:11 AM
Advertisement
Advertisement