Dhanteras 2022
-
ధంతేరాస్ దెబ్బ... చైనాకు 75,000 కోట్ల నష్టం
-
చైనాకు రూ. 75 వేల కోట్లు నష్టం! భారతీయులు డ్రాగన్ కంట్రీనీ భలే దెబ్బ కొట్టారు
ధంతేరాస్ దగదగలతో బంగారం వ్యాపారం జోరుగా సాగింది. కరోనా కారణంగా స్తబ్ధుగా ఉన్న మార్కెట్ రెండు సంవత్సరాల తర్వాత తిరిగి పుంజుకుంది. వెరసి కేవలం రెండు రోజుల వ్యవధిలో సుమారు రూ.25 వేల కోట్ల బంగారం అమ్మకాలు జరిగాయి. ధంతేరాస్, దీపావళి సందర్భంగా అక్టోబర్ 22, అక్టోబర్ 23న రూ. 45 వేల కోట్ల విలువైన వ్యాపారం జరిగినట్లు తెలుస్తోంది. బంగారం అమ్మకాలు రూ. 25 వేల కోట్లు ఉండగా మిగిలిన రూ. 20 వేల కోట్లకు ఆటోమొబైల్స్, కంప్యూటర్లు, కంప్యూరట్లకు సంబంధించిన ఇతర గాడ్జెట్స్, ఫర్నీచర్, హోమ్, ఆఫీస్ డెకరేషన్, స్వీట్లు అండ్ స్నాక్స్, కిచెన్ ఐటమ్స్, ఎలక్ట్రానిక్స్ వస్తువులు, మొబైల్ ఐటమ్స్ సేల్స్ జరిగాయి. నేషనల్ ప్రెసిడెంట్ ఆఫ్ ది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(సీఏఐటీ)..రెండు రోజుల పాటు జరిగిన ధంతేరాస్ పండుగ సందర్భంగా భారీ ఎత్తున గోల్డ్, కాయిన్స్, నోట్స్, శిల్పాలు, పాత్రల అమ్మకాలు సుమారు రూ. 25 వేల కోట్ల వరకు జరిగాయని తెలిపింది. చదవండి👉 పాక్ అభిమాని గూబ గుయ్‌మనేలా..సుందర్ పిచాయ్ రిప్లయ్ అదిరింది ఈ ఏడాది దీపావళి పండుగ విక్రయాలు దేశంలో రూ.1,50,000 కోట్లకు మించి ఉంటాయని సీఏఐటీ పేర్కొంది. ఈ పండుగలో మరో సానుకూల అంశం ఏమిటంటే, వినియోగదారులు భారతీయ వస్తువుల్ని మాత్రమే కొనుగోలు చేసేందుకు ఇష్టపడ్డారు. దీని ఫలితంగా చైనాకు వ్యాపారంలో రూ. 75,000 కోట్లు నష్టం వాటిల్లినట్లు అంచనా. బంగారానికి డిమాండ్ పెరిగింది ఆల్ ఇండియా జ్యువెలర్స్ అండ్ గోల్డ్ స్మిత్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు పంకజ్ అరోరా మాట్లాడుతూ.. దేశంలో కోవిడ్ సంక్షోభం మార్కెట్ నుంచి గోల్డ్ మార్కెట్ పూర్తిగా కోలుకుంది. ఆర్థిక కార్యకలాపాలు, వినియోగదారుల డిమాండ్ కారణంగా జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో దేశంలో బంగారం డిమాండ్ 80% వరకు పెరిగింది. "2021తో పోలిస్తే 2022లో భారతదేశంలో బంగారం దిగుమతులు దాదాపు 11.72% తగ్గాయి. గత ఏడాది ప్రథమార్థంలో భారతదేశం 346.38 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకోగా, ఇప్పుడు అది 308.78 టన్నులను దిగుమతి చేసుకుంది. చదవండి👉 ‘భారతీయులకు అంత సీన్‌లేదన్నాడు..రిషి సునాక్ చేసి చూపించారు..’ ఏ ప్రొడక్ట్‌పై ఎంత సేల్ జరిగిందంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సిఎఐటి) జాతీయ అధ్యక్షుడు బీసీ భారతియా మాట్లాడుతూ.. ‘‘ధంతేరాస్, దీపావళి రోజు బంగారం బిజినెస్‌తో పాటు ఆటోమొబైల్ రంగంలో రూ. 6 వేల కోట్లు, రూ. 1500 కోట్ల ఫర్నిచర్, రూ. 2500 కోట్లు కంప్యూటర్, కంప్యూటర్ సంబంధిత వస్తువులు, ఎఫ్ఎంసీజీలో సుమారు రూ. 3 వేల కోట్లు, ఎలక్ట్రానిక్స్ వస్తువులు రూ. 1000 కోట్లు, స్టెయిన్లెస్ స్టీల్, అల్యూమినియం, ఇత్తడి పాత్రల అమ్మకాలు రూ. 500 కోట్లు, వంటగది ఉపకరణాలు, ఎక్స్‌టైల్, రెడీమేడ్ దుస్తులు, ఫ్యాషన్ దుస్తుల వ్యాపారం రూ. 700 కోట్ల వరకు జరిగింది. చదవండి👉 ‘ఎలాన్ మస్క్‌కు ఊహించని షాక్’..ట్విట్టర్ ఉద్యోగుల వార్నింగ్ -
పసిడికి ధన్‌తెరాస్ ధగధగలు..
న్యూఢిల్లీ/ముంబై: ఈ ఏడాది ధన్‌తెరాస్ రెండు రోజులు (శని, ఆదివారాలు) రావడంతో పసిడి, ఆభరణాలు, నాణేల విక్రయాలు జోరుగా జరిగాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి అమ్మకాలు 35 శాతం వరకూ పెరిగి ఉంటాయని ఆభరణాల పరిశ్రమ అంచనా వేస్తోంది. ఆదివారం నాడు భారత్–పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ ఉండటంతో కొద్ది గంటల పాటు మార్కెట్లో కాస్తంత స్తబ్దత నెలకొన్నా, మ్యాచ్ తర్వాత అమ్మకాలు వేగం పుంజుకున్నట్లు ఆభరణాల విక్రేతలు తెలిపారు. పసిడి రేటు కాస్త పెరిగినప్పటికీ వినియోగదారులు కొనుగోళ్లు జరిపినట్లు పేర్కొన్నారు. ఆదివారం దేశ రాజధాని న్యూఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల పసిడి ధర రూ. 50,139 (పన్నులు కాకుండా) పలికింది. ధన్‌తెరాస్ రోజున విలువైన లోహాలు కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. సాధారణంగా ధన్‌తెరాస్ నాడు 20–30 టన్నుల బంగారం అమ్ముడవుతుంది. కోవిడ్ అనంతరం డిమాండ్ పుంజుకోవడంతో గతేడాదితో పోలిస్తే ఈసారి సుమారు 10–15 శాతం మేర అమ్మకాలు పెరిగి ఉంటాయని అంచనా వేస్తున్నట్లు ఆలిండియా జెమ్ అండ్ జ్యుయలరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ ఆశీష్ పేఠే తెలిపారు. మరోవైపు, ధన్‌తెరాస్ సందర్భంగా 15–25 శాతం వరకూ బంగారం అమ్మకాలు పెరిగి ఉండవచ్చని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రాంతీయ సీఈవో (భారత్) సోమసుందరం పీఆర్ పేర్కొన్నారు. ధన్‌తెరాస్ కోసం భారీ స్థాయిలో ప్రి–బుకింగ్స్ జరిగినట్లు కల్యాణ్ జ్యుయలర్స్ ఇండియా ఈడీ రమేష్ కల్యాణరామన్ చెప్పారు. ఈ ఏడాది దాదాపు కొనుగోళ్లలో దాదాపు 80 శాతం వాటా జ్యుయలరీ ఉంటుందని, మిగతాది బులియన్ ఉంటుందని పీఎన్జీ జ్యుయలర్స్ సీఎండీ సౌరభ్ గాడ్గిల్ తెలిపారు. ఎకానమీ కోలుకుందని ప్రజల్లో నమ్మకం కలగడాన్ని ఇది సూచిస్తోందని వివరించారు. రెండు రోజుల ధన్‌తెరాస్ సందర్భంగా తమ అమ్మకాలు పరిమాణంపరంగా 30–35 శాతం, విలువపరంగా 40–45 శాతం పెరిగాయని అంచనా వేస్తున్నట్లు పీఎం షా జ్యుయలర్స్ ఎండీ దినేష్ జైన్ తెలిపారు. వినియోగదారులు డిజిటల్ మాధ్యమాల ద్వారా చెల్లింపులు జరపడం ఈసారి ఆసక్తికరమైన ట్రెండ్ అని పేర్కొన్నారు. -
‘ఏం భయం లేదు మేమున్నాం.. దీపావళి సంతోషంగా జరుపుకోండి’
శ్రీనగర్: యావత్ భారత దేశం దీపావళి వేడుకలకు సిద్ధమైంది. ధంతేరాస్‌లో భాగంగా శనివారం నియంత్రణ రేఖ వద్ద ఆర్మీ జవాన్లు దీపాలు వెలిగించి, బాణసంచా పేల్చుతూ వేడుకలు నిర్వహించారు. దేశ ప్రజలకు దివాళీ శుభాకాంక్షలు తెలిపారు. నియంత్రణ రేఖ సహా సరిహద్దు ప్రాంతాల్లో దీపావళి జరుపుకొన్నారు. అంతా మంచే జరుగుతుందని ప్రజల్లో ధైర్యం నింపారు. సరిహద్దుల వద్ద తాము అప్రమత్తంగా ఉన్నామని, ఎలాంటి చింత లేకుండా కుటుంబంతో కలిసి వేడుకలు జరుపుకోవాలని పేర్కొన్నారు. ‘దేశ ప్రజలు ఎలాంటి చితలేకుండా కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలు జరుపుకోవాలని చెప్పాలనుకుంటున్నా. దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు, సరిహద్దుల్లో మన జవాన్లు అప్రమత్తంగా, నిరంతరం నిఘా వేస్తూ ఉన్నారని భరోసా ఇస్తున్నాం.’ అని కలెనల్ ఇక్బాల్ సింగ్ తెలిపారు. ధంతేరాస్ సందర్భంగా లక్ష్మి పూజ నిర్వహించి.. లక్ష్మీగణపతి హారతి పాటలు పాడారు సైనికులు. సైనికులతో మోదీ దీపావళి వేడుకలు.. ఈ దీపావళి వేడుకలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత ఆర్మీ సైనికులతో కలిసి జరుపుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే జవాన్లతో దీపావళి వేడుకల్లో పాల్గొనాలని ప్రధాని మోదీ నిర్ణయించినట్లు కేంద్రప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా ఏ ప్రాంతానికి వెళ్తారనేది గోప్యంగా ఉంచారు. గత ఏడాది జమ్ముకశ్మీర్‌లోని నౌషేరాలో జవాన్లతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. Jammu and Kashmir | Indian Army soldiers posted along the Line of Control (LoC) in the Akhnoor sector burst crackers & lit earthen lamps as #Diwali festivities began with Dhanteras yesterday pic.twitter.com/ekmaKMJiJr — ANI (@ANI) October 22, 2022 ఇదీ చదవండి: Dhanteras 2022: చీపురు సహా, వీటిని కొనుగోలు చేస్తే..లక్ష్మీ కటాక్షం! -
ధంతేరస్: చీపురు సహా వీటిని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం!
ధనత్రయోదశి లేదా ధంతేరస్ దీపావళి పండుగలో అతి పవిత్రమైనది. కీలకమైంది. ధనత్రయోదశి నాడు లక్ష్మీదేవి, కుబేరులకు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించడమే కాదు, కొత్త పాత్రలు, కొత్త వాహనాలు, వెండి, బంగారు నగలు, ఇత్తడి, ప్రతిమలు కొనడం శుభ ప్రదంగా భావిస్తారు. ధనత్రయోదశి నాడు షాపింగ్ చేస్తే, ఎంతో కొంత బంగారాన్ని కొనుగోలు చేసినా, లేదా కొత్త వస్తువులను ఇంటికి తీసుకు వచ్చినా లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందనీ, సిరసంపదలు, శ్రేయస్సు లభిస్తుందని చాలామంది నమ్మకం. "ధంతేరస్" అనే పదం 13వ శతాబ్దం నుంచి వాడుకలో ఉంది. సంస్కృతంలో దీనికి "సంపద" అని అర్ధం. సంపద శ్రేయస్సుల మేలు కలయిక ధనత్రయోదశి. ఈ సందర్భంగా ధన్వంతరిని పూజిస్తారు. ఈ రోజు ఖరీదైన వస్తువులను కొనుగోలు చేయడం అదృష్టంగా భావిస్తారు. (వామ్మో! సంతకాలను కాపీ చేస్తున్న మెషీన్..ఆ హీరో సంతకం వైరల్) ఈ పవిత్రమైన రోజున కొనుగోలుకు 5 వస్తువులకు ప్రాధాన్యత ఇస్తారు. ♦ దేశవ్యాప్తంగా ధంతేరస్ రోజున కొంచెమైనా బంగారం ,వెండిని కొనుగోలు చేయడం శుభప్రదమని భావిస్తారు. అలాగే "ధన్"తో పాటు నాణేలను లక్ష్మీగా భావించి పూజిస్తారు. ♦ ధంతేరస్ రోజున మార్కెట్ నుండి కొత్త చీపురు కొనడం కూడా అదృష్టంగా, శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారు. చీపురు లక్ష్మీ దేవిగా పరిగణిస్తారు. ♦ ఈ రోజున ఏదైనా వాహనం కొనుగోలు చేయడం ఆనవాయితీ. అలా చేస్తే అదృష్టం కలిసి వస్తుందని నమ్మం. ♦ లక్ష్మీ, గణేష్ ప్రతిమలను కొనుగోలు చేస్తే విఘ్నాలు తొలగి సకల శుభాలు కలుగుతాయని విశ్వాసం. ♦ ఇత్తడి వస్తువులను ఇంటికి తెచ్చుకుంటారు. పౌరాణిక పురాణాల ప్రకారం, ధన్వంతరి సముద్ర మథనం సమయంలో ఆయన చేతిలో అమృతతో నిండిన ఇత్తడి కలశం ఉందని కనుక ఇత్తడి వస్తువవులను కొనుగోలు చేస్తే లక్ష్మీ అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ రోజున సంపదల దేవత లక్ష్మీ, కుబేరుని ప్రసన్నం చేసు కోవాలనుకుంటే, పసుపుతో 21 బియ్యం గింజలను ఎర్రటి వస్త్రంలో కట్టి బీరువాలో ఉంచుకుంటారు. ఇలా చేయడం వల్ల సిరి సంపదలకు లోటు లేకుండా, సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని నమ్మకం. -
బంగారం కొనుగోలు చేస్తున్నారా? అయితే ఈ తప్పులు చేయకండి
ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం, ద్రవ్యోల్బణం వంటి ప్రతికూల పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ బంగారం ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)లో ఇన్వెస్టర్లు పెట్టుబడులకు మొగ్గు చూపుతున్నారు. ఇక సంక్రాంతి, దసరా.. ముఖ్యంగా దంతెరాస్, దీపావళి వంటి పండగల సమయాల్లో ఫిజికల్ గోల్డ్, గోల్డ్ కాయిన్స్, జ్వువెలరీ కొనుగోళ్లు భారీ ఎత్తున జరుగుతుంటాయి. దీనికి తోడు భారత ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 282 జిల్లాల్లో బంగారంపై హాల్‌మార్క్ తప్పని సరిచేయడంతో కొనుగోళ్లు సాఫీగా జరుగుతాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు మనం ఈ ధంతేరాస్, దీపావళికి ఫిజికల్ గోల్డును ఎలా కొనుగోలు చేయాలి? పండగల సమయాల్లో ఎంత బంగారం కొనుగోలు చేయాలో తెలుసుకుందాం. ఇందుకోసం పాప్లీ గ్రూప్ డైరెక్టర్ రాజీవ్ పాప్లీ, బంగారంపై తప్పనిసరి హాల్‌మార్కింగ్‌ను అమలు చేయడానికి వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన నిపుణుల సలహా కమిటీలో ఉన్న ఆల్ ఇండియా జెమ్ & జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ ఛైర్మన్ ఆశిష్ పెథే, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ పూనమ్ రుంగ్తా జాతీయ మీడియాకు ఇచ్చిన సలహాలు ఇలా ఉన్నాయి. కోవిడ్- 19 లాక్డౌన్ ఎత్తివేత, తగ్గిపోతున్న మహమ్మారి కారణంగా భారత్‌లో బంగారంపై డిమాండ్ పెరుగుతుందా? ట్రెండ్స్ ఎలా ఉన్నాయి. రాజీవ్ పాప్లీ : అవును, బంగారానికి డిమాండ్ ఎక్కువగా ఉంది. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో ఇండస్ట్రీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. కానీ ఈ సంవత్సరం ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి బయటపడినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే? రక్షా బంధన్ నుంచి బంగారం విక్రయాలు ఊపందుకున్నాయి. కోవిడ్ ఎఫెక్ట్‌తో అనిశ్చిత కాలంలో గోల్డ్‌లో పెట్టుబడులు సురక్షితమని పెట్టుబడి దారులు భావిస్తున్నారు. ఆశిష్ పేథే : గత రెండేళ్లుగా నేను చూస్తున్న మరో ట్రెండ్ ఏమిటంటే పెట్టుబడి దారులు ముఖ్యంగా యువకులు చిన్న మొత్తాల్లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు. రెట్టింపు ఆదాయం ఉన్న కుటుంబాలు కూడా బంగారం కొనుగోళ్ల కోసం కొంత డబ్బును పక్కన పెట్టడం ప్రారంభించాయి. హాల్‌మార్క్ లేని ఆభరణాలను తప్పుగా అమ్మడం సాధ్యమేనా? పెథే : హాల్‌మార్కింగ్ తప్పనిసరి అయిన 282 జిల్లాల్లో మీరు బంగారం కొనుగోలు చేస్తే, హాల్‌మార్క్ లేని ఒక్క ఆభరణాన్ని కూడా విక్రయించలేరు. 2 గ్రాముల చిన్న ముక్క లేదా చిన్న చెవిపోగు కూడా హాల్‌మార్క్ చేయబడాలి. వాస్తవానికి, ప్రతి స్వర్ణకారుడు కనీసం 10x మాగ్నిఫికేషన్ ఉన్న భూతద్దం కలిగి ఉండాలని చట్టం నిర్దేశిస్తుంది. తద్వారా వినియోగదారు హాల్‌మార్కింగ్‌ను తనిఖీ చేయవచ్చు. 18-క్యారెట్ బంగారు ముక్క మొదలైన వాటి కోసం మార్కింగ్‌ను వివరించే చార్ట్‌ను కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే ఈ తప్పులు చేయకండి పూనమ్ రుంగ్తా : మనం భారతీయులం. బంగారు ఆభరణాల్ని ఎక్కువగా ఇష్టపడతాం. కానీ మన పెట్టుబడుల్ని మాత్రం ఆభరణాల్లో కలపకూడదు. ఎందుకంటే? కొన్న బంగారాన్ని కుటుంబ సభ్యులకు విభజించాలంటే.. వాటిని అమ్మాల్సి ఉంటుంది. అందువల్ల, గోల్డ్ బార్గా లేదా ఇ-గోల్డ్ లేదా పేపర్ గోల్డ్ కొనుగోలు చేయడం వంటి మార్గాలు బంగారంపై ఉత్తమమైన పెట్టుబడిగా భావించాలి. బంగారాన్ని ఈక్విటీ (షేర్లు), డెబిట్ వంటి ఏదైనా ఇతర ఆస్తిలాగా పరిగణించండి. భౌతిక రూపంలో (స్వచ్ఛమైన బంగారం) లేదా గోల్డ్ ఇటిఎఫ్‌లలో మీ పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలో 10-15 శాతం బంగారం రూపంలో ఉంచండి. ధంతేరస్, దీపావళి సమయాల్లో బంగారం ఎలా కొనుగోలు చేయాలి? రుంగ్తా : ప్రజలు ధంతేరస్, దీపావళి సందర్భంగా బంగారం కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతుంటారు. అలాంటి సమయాల్లో బంగారం ధరలు పెరుగుతాయని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే బంగారం ధర కూడా డిమాండ్, సప్లై నిర్విరామంగా కొనసాగుతుంది. అలాంటి సమయాల్లో కొనుగోలు దారులకు నేను ఇచ్చే సలహా ఏంటంటే? పండగల సమయాల్లో బంగారం ధరలు పెరుగుతాయి. ఆ సమయంలో కొద్ది బంగారం మాత్రమే కొనుగోలు చేయాలి. సాధారణ సమయాల్లో మీకు కావాల్సినంత బంగారం కొనుగోలు చేయడం ఉత్తమం. ధంతేరాస్, దీపావళి సమయంలో మేకింగ్ ఛార్జీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి బంగారు నాణేలు కొనుగోలు చేయడం ఉత్తమమేనా? రుంగ్తా : తక్కువ మేకింగ్ ఛార్జీల సంగతి అటుంచితే. బంగారు నాణేలు స్వచ్ఛమైన బంగారంతో తయారు చేశారు. మనకు తెలిసినట్లుగా, బంగారు కడ్డీలు, నాణేలు 24-క్యారెట్ల స్వచ్ఛమైన నాణ్యతతో వస్తాయి. అంతేకాకుండా, బంగారు నాణేలు వినియోగం కంటే పెట్టుబడి పెడితే ఎక్కువ రుణాలు ఇస్తాయి. -
దుబాయ్ బంగారాన్ని తెస్తున్నారా? లిమిట్ ఎంతో తెలుసా?
న్యూఢిల్లీ: భారతీయులకు బంగారం అంటే మోజు ఎక్కువ. అందులోనూ తక్కువ ధరకు, ప్రీమియం క్వాలిటీతో లభించే దుబాయ్ బంగారం అంటే మరీ ఇష్టం. ముఖ్యంగా ధంతేరస్ పర్వదినం సందర్బంగా ఎంతో కొంత గోల్డ్‌ను కొనుగోలు చేయడం బాగా అలవాటు. అయితే మన దేశంలో తరుగు మేకింగ్ చార్జీలు బాదుడు ఎక్కువ. దీంతో దుబాయ్ బంగారానికి గిరాకీ ఎక్కువ. ఐకానిక్ భవనాలు, ఎక్సైటింగ్ ఈవెంట్స్ మాత్రమే కాదు షాపింగ్కోసం ప్రపంచంలోని అత్యుత్తమ నగరాల్లో ఒకటి దుబాయ్. అందుకే చాలామంది దుబాయ్ నుంచి పుత్తడిని, బంగారు ఆభరణాలను భారత్‌కు తీసుకొస్తూ ఉంటారు. కానీ ఇండియాలో బంగారంపై దిగుమతి సుంకాన్ని చెల్లించాలి. రోజువారీ ధరించే లైట్ వేర్ బంగారు ఆభరణాలకు కస్టమ్స్ సుంకం నుండి మినహాయింపు ఉన్నప్పటికీ, బార్లు లేదా నాణేల రూపంలో బంగారం కస్టమ్ డ్యూటీ చెల్లించాల్సిందే. ఈ నేపథ్యంలో దుబాయ్ నుంచి గోల్డ్ తెచ్చుకోవాలంటే కొన్ని మార్గదర్శకాలను పాటించాలి. లేదంటే తిప్పలు తప్పవు. ప్రభుత్వసుంకాలు, ఇతర ఛార్జీలవివరాలను పరిశీలిస్తే.. సెంట్రల్ బోర్డు ఆఫ్ పరోక్ష పన్నులు అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) ప్రకారం 1967 పాస్‌పోర్ట్ చట్టం ప్రకారం జారీ చేయబడిన చెల్లుబాటు అయ్యే భారతీయ పాస్‌పోర్ట్ ఉన్న ఏదైనా భారత సంతతికి చెందిన వ్యక్తులు బ్యాగేజీలో బంగారు ఆభరణాలను భారతదేశానికి తీసుకురావడానికి అర్హులు. దిగుమతి సుంకం విషయానికి వస్తే ఆరు నెలల కంటే ఎక్కువ కాలం ఉంటే..వారు తీసుకొచ్చే పసిడికి 12.5 శాతం+సర్‌చార్జ్ 1.25 శాతం వర్తిస్తుంది. అలాగే దుబాయ్నుంచి ఇండియాకు ఒక వ్యక్తి తెచ్చిన పుత్తడిపై 38.5 శాతం కస్టమ్స్ సుంకం చెల్లించాల్సి ఉంటుంది. ఒక సంవత్సరానికి పైగా విదేశాలలో నివసిస్తున్న ఒక వ్యక్తి 20 గ్రాముల బంగారు ఆభరణాలను, లేదా 50 వేల రూపాయల విలువకు మించకుండా తీసుకురావచ్చు. అదే మహిళా ప్రయాణికులైతే ఒక లక్ష రూపాయల గరిష్ట విలువ, 40 గ్రాముల బంగారు ఆభరణాలు తీసుకురావచ్చు. కాగా కరెంట్ ఖాతా లోటుకు చెక్ చెప్పేలా బంగారంపై దిగుమతి సుంకాన్ని ఈ ఏడాది 15 శాతంగా ప్రభుత్వం నిర్ణయించింది. అంతకుముందు ఇది 10.75 శాతం మాత్రమే. -
నగల అమ్మకాలు జిగేల్!
న్యూఢిల్లీ: ధనత్రయోదశి, దీపావళి సందర్భంగా బంగారం ఆభరణాల విక్రయాలు జోరుగా సాగుతాయని జ్యుయలరీ పరిశ్రమ అంచనాలతో ఉంది. ముఖ్యంగా దసరా సందర్భంగా ఆభరణాల విక్రయాలు 30 శాతం అధికంగా నమోదు కావడం, పరిశ్రమలో సానుకూల అంచనాలకు మద్దతునిస్తోంది. ఇదే ధోరణి దీపావళి పండుగ వరకు కొనసాగొచ్చని భావిస్తోంది. తదుపరి వివాహ శుభ ముహూర్తాలు కూడా ఉండడంతో అమ్మకాలపై బలమైన అంచనాలతో కంపెనీలు ఉన్నాయి. బంగారం ధరలు దిగిరావడానికి తోడు, ఆర్థిక కార్యకలాపాలు పూర్తి స్థాయిలో అనుమతించడం అనుకూలిస్తున్నట్టు పరిశ్రమ అంటోంది. ఆభరణాలకు వినియోగించే 22 క్యారట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.50వేల దిగువకు రావడం గమనార్హం. దసరా సమయంలో రూ.49,000 స్థాయిలో ఉన్న ధర ప్రస్తుతం ఇంకా తగ్గి రూ.46వేలకు దిగొచ్చింది. దీంతో దీపావళికి విక్రయాలు అంచనాలను మించుతాయని ఆభరణాల వర్తకులు భావిస్తున్నారు. దసరా నుంచి సానుకూలత దసరా నుంచి కొనుగోళ్లు సానుకూలంగా ఉన్నట్టు పీఎన్జీ జ్యుయలర్స్ సీఎండీ సౌరభ్ గాడ్గిల్ తెలిపారు. గతేడాదితో పోలిస్తే కస్టమర్లు రెట్టింపు విలువ మేరకు కొనుగోలు చేస్తున్నట్టు చెప్పారు. కస్టమర్లు ముందుగా బుక్ చేసుకుని, స్టోర్లకు వచ్చి తీసుకెళుతున్నట్టు తెలిపారు. టెంపుల్ జ్యుయలరీ, ఆధునికతను జోడించుకున్న సంప్రదాయ డిజైన్లకు మద్దతు ఉన్నట్టు వివరించారు. మొత్తం మీద గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పండుగల సీజన్లో విక్రయాలు సమారు 30 శాతం అధికంగా ఉన్నట్టు తెలిపారు. ద్రవ్యోల్బణ ప్రభావం పెద్దగా లేదు ద్రవ్యోల్బణ ప్రభావం కస్టమర్ల కొనుగోళ్లను పెద్దగా ప్రభావితం చేయలేదని ఇండియా బులియన్ అండ్ జ్యుయలర్స్ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి సురేంద్ర మెహతా పేర్కొన్నారు. దసరా విక్రయాల్లో ఇదే కనిపించిందని, ఆర్థిక కార్యకలాపాలను పూర్తి స్థాయిలో అనుమతించడం కలిసొచ్చినట్టు చెప్పారు. దసరా నవరాత్రుల్లో విక్రయాలు బలంగా నమోదు కావడం, తదుపరి దీపావళి విక్రయాలకు మద్దతుగా నిలుస్తుందని పరిశ్రమ అంచనాతో ఉంది. ‘‘దీపావళి సందర్భంగా విక్రయాలు మరింత అధికంగా ఉంటాయని అంచనా వేస్తున్నాం. గతేడాది దీపావళి విక్రయాలతో పోలిస్తే ఈ ఏడాది 40 శాతం అధికంగా ఉండొచ్చు. ఈ పండుగల సీజన్ పట్ల మేము ఎంతో ఆశావహంగా ఉన్నాం’’అని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ చైర్మన్ ఎంపీ అహ్మద్ తెలిపారు. ‘‘దసరా సీజన్ బలంగా ఉంది. దీంతో దీపావళి, ధనత్రయోదశి విక్రయాలపై ఆశలతో ఉన్నాం. గడిచిన మూడేళ్లతో పోలిస్తే ఈ సీజన్ గొప్పగా ఉంటుంది’’అని సి. కృష్ణయ్య చెట్టి గ్రూప్ ఆఫ్ జ్యుయలర్స్ ఎండీ సి. వినోద్ హయగ్రీవ్ పేర్కొన్నారు. ‘‘దసరా సమయంలో మా స్టోర్లలో 30 శాతం అధిక విక్రయాలు నమోదయ్యాయి. మార్కెట్లో ఎంతో పెంటప్ డిమాండ్ (గతంలో నిలిచిన డిమాండ్ ఇప్పుడు పుంజుకోవడం) ఉంది. వినియోగదారులు బంగారం కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. పెట్టుబడుల కోణంలో కస్టమర్లు కాయిన్లను సైతం కొనుగోలు చేస్తున్నారు’’అని జోయాలుక్కాస్ జ్యుయలరీ సీఎండీ జాయ్ అలుక్కాస్ తెలిపారు. -
ధంతేరస్ 2022: బంగారు, వెండిపై ఫోన్‌పే క్యాష్ బ్యాక్ ఆఫర్
సాక్షి, ముంబై: ధంతేరస్ 2022కి టాప్ ఫిన్‌టెక్ ప్లాట్‌ఫారమ్ ఫోన్‌పే బంపర్ ఆఫర్ అందిస్తోంది. తన ఫ్లాట్‌ఫాం ద్వారా బంగారం, వెండి కొనుగోలు చేసిన వినియోగ దారులకు క్యాష్‌బ్యాక్ ఆఫర్ చేస్తోంది. రానున్న ధన్తేరస్ సందర్భంగా గోల్డెన్ డేస్ ప్రచారంలో భాగంగా వినియోగదారుల బంగారం, వెండి కొనుగోళ్లపై ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలను ప్రకటించింది. ముఖ్యంగా బంగారం కొనుగోళ్లపై రూ. 2,500, వెండి కొనుగోళ్లపై రూ. 500 వరకు క్యాష్ బ్యాక్‌ను పొందవచ్చు. క్యాష్‌బ్యాక్ ఆఫర్‌కు ఎవరు అర్హులు? అక్టోబర్ 26 వరకు బంగారం లేదా వెండి కొనుగోళ్లను చేసినట్లయితే, కస్టమర్లు క్యాష్‌బ్యాక్ ఆఫర్‌కు అర్హులు. ధంతేరస్ సందర్భంగా యాప్లోఈ ఆఫర్ పొందాలంటే రూ. 1,000 లేదా అంతకంటే ఎక్కువ బంగారం ,వెండి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కస్టమర్లు 99.99 శాతం స్వచ్ఛమైన 24కె బంగారం, వెండిని కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు బీమా చేయబడిన డోర్‌స్టెప్ డెలివరీ అవకాశం ఉంది. లేదంటే ధృవీకృత 24కే గోల్డ్ బార్లను ఉచితం సేఫ్‌గా డిజిటల్‌గా గ్రేడ్ గోల్డ్ లాకర్లో దాచుకోవచ్చు. బంగారాన్ని ఎలా కొనుగోలు చేయాలి ♦ ఫోన్‌పేలో సైట్ దిగువన ఉన్న వెల్త్ చిహ్నాన్ని ఎంచుకోండి. ♦ బంగారం, వెండి ఏది కొనుగోలు చేయాలనుకుంటున్నారో, ఎంచుకుని, పేమెంట్ పద్ధతిని ఎంచుకోవాలి. ♦ ఆప్షన్లలో 'స్టార్ట్ అక్యుమ్యులేటింగ్' లేదా ‘బై మోర్ గోల్డ్ ఎంచుకోవాలి. ఆ తరువాత డోర్ డెలివరీ కావాలనుకుంటే ఆ ఆప్షన్ ఎంచుకోవాలి. ♦ చివరగా మీరుకొనాలనుకునే బంగారు లేదా వెండి నాణేలను క్లిక్ చేయవచ్చు. సంబంధిత నగదును నమోదు చేసి 'ప్రొసీడ్' బటన్‌పై క్లిక్ చేయాలి.