Diwali 2022: Health Care Tips For Diabetes, Blood Pressure (BP) Patients During Festival - Sakshi
Sakshi News home page

Health Tips: పండక్కి ఫుల్లుగా తినండి కానీ... వీళ్లు కాస్త జాగ్రత్తగా ఉండాలి! లేదంటే

Published Sat, Oct 22 2022 9:52 AM | Last Updated on Sat, Oct 22 2022 11:50 AM

Diwali 2022: Health Care Tips For Diabetes BP Patients During Festival - Sakshi

Diwali 2022- Health Care Tips In Telugu: కాస్త జాగ్రత్తపండగనాడు బోలెడన్ని పిండివంటలు, స్వీట్లు వంటి వాటితో హైక్యాలరీ ఫుడ్‌ తినేసే అవకాశాలుంటాయి. కాబట్టి మన ఆరోగ్యాన్ని అనుసరించి ఏ మేరకు, ఎంత పరిమితిలో స్వీట్లు తినాలన్న విషయంపై జాగ్రత్తగా ఉండాలి.

అంతేకాదు... ఒకోసారి పండగ సమయాల్లో వేడుకల్లో పడిపోయి సరైన వేళల్లో ఆహారం తీసుకోకపోవడం కూడా ఉంటుంది. ఈ అంశం డయాబెటిస్, హైబీపీ ఉన్న రోగులపై దుష్ప్రభావం చూసే అవకాశాలెక్కువ. అందుకే ఆహారం విషయంలో జాగ్రత్త ఎంతో అవసరం. 

►దీపావళి పండగకు స్వీట్స్‌ వినియోగం ఎక్కువ కాబట్టి... ఈ పండగ సమయంలో క్యాలరీలను తగ్గించే వ్యాయామాలను క్రమం తప్పనివ్వకూడదు. 
►స్వీట్స్‌ పంచుకునే పండగ దీపావళి. కాబట్టి డయాబెటిస్‌ రోగులు తమ చక్కెర పాళ్లను నియంత్రణలో ఉంచుకోవడం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.
►మీ డాక్టర్‌ ఇచ్చిన చక్కెర నియంత్రణ ట్యాబ్లెట్లను ఎప్పుడూ అందుబాటులో ఉంచుకోండి.

►అలాగే స్వీట్లు తిన్న తర్వాత కూడా భోజనం ఫుల్లుగా లాగించేయవద్దు. స్వీట్లు తింటే గనక ఆ మేరకు అన్నం కాస్త తగ్గించి తినడం మంచిది. 
►మరో విషయం... బాణాసంచా కాల్చడం వల్ల వాతావరణంలోకి సల్ఫర్, పొటాషియం వంటి రసాయనాలు వెలువడి అలర్జీలు కలిగే అవకాశాలు ఎక్కువ. అందుకే ఆస్తమా రోగులు తమ ఇన్‌హేలర్స్‌ను ఒకసారి చెక్‌ చేసుకోవాలి. ఒకటి అదనంగా కొని స్పేర్‌లో పెట్టుకోవడమూ మంచిదే.  

చదవండి: Health Tips: నట్స్‌, డార్క్‌ చాక్లెట్స్‌, అరటి పండ్లు తరచూ తింటున్నారా? డోపమైన్‌ అనే హార్మోన్‌ విడుదల చేసి..
Paranoia: రోజూ రాగానే ఇల్లంతా వెతకడం.. వాడిని ఎక్కడ దాచావ్‌ అంటూ భార్యను తిట్టడం! ఈ పెనుభూతం వల్ల..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement