ప్రతీకాత్మక చిత్రం
కొన్ని ముఖ్యమైన ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనానికై ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్న చిట్కాలివి.
1.అశ్వగంధ వేర్లు తీసుకుని మెత్తగా నూరి ఒక చెంచా పొడిని అర కప్పు నీళ్ళల్లోగాని, పాలల్లోగాని కలుపుకుని తాగితే నడుం నొప్పి తగ్గుతుంది.
2.నిమ్మ రసంలో పాలు కలిపి రాత్రి పూట రాసి, ఉదయం గోరువెచ్చని నీటితో కడిగితే మొహంమీద మచ్చలు పోతాయి.
మొటిమలు తగ్గుతాయి
3. ఒక చెంచా కస్తూరి పసుపు మెత్తగా చేసి, నువ్వుల నూనెలో గాని, పల్లీనూనెలో గాని కలిపి రాసుకుంటే మొటిమలు తగ్గుతాయి.
4.వేపాకు మెత్తగా నూరి శనగ గింజంత మోతాదులో మాత్ర చేసుకుని రోజుకు మూడుసార్లు మింగితే మొటిమలు తగ్గుతాయి.
స్థూలకాయం తగ్గి
5. ఉసిరికాయ రసం పంచదారతో కలిపి పూటకు పది గ్రాముల వంతున రెండు పూటలు తీసుకుంటే కీళ్ళనొప్పులు తగ్గుతాయి.
6. పుదీనా కట్టలు నాలుగు తీసుకుని, పది గ్రాముల మిరియాలు, పది గ్రాముల శొంఠి కలిపి మెత్తగా నూరాలి. శనగ గింజంత టాబ్లెట్లు చేసుకుని నీడలో ఆరబెట్టాలి. రోజుకు మూడు టాబ్లెట్లు మూడునెలలు. తీసుకుంటే స్థూలకాయం తగ్గుతుంది.
నరాలకు మేలు
7.అశ్వగంధ చూర్ణాన్ని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం పాలతో కలిపి పుచ్చుకుంటే నరాలకు మేలు చేస్తాయి.
8.కరక్కాయ బెరడు దవడకు పెట్టుకొని దాని రసం మింగితే జలుబు, దగ్గు తగ్గుతుంది.
కడుపు నొప్పి ఉంటే
9.రావి చికురుటాకులు తొమ్మిదింటి రసం తీసుకుని, తేనెతో కలిపి తీసుకుంటే రెండుమూడు పూటల్లో జలుబు తగ్గుతుంది.
10.తులసి ఆకు రసంతో కొంచెం అల్లం రసం గాని, లేక కొంచెం శొంఠి రసం గాని కలిపి, టీ స్పూన్ తేనె కూడా కలిపి తాగితే కడుపునొప్పి వెంటనే తగ్గుతుంది.
పేను కొరుకుడు వేధిస్తోందా
11.దానిమ్మ గింజలు చప్పరించి తింటే ఏ వయసు వారికైనా వాంతులు ఆగిపోతాయి. వేవిళ్ళతో ఉన్న వాళ్లకి తక్షణం పనిచేస్తుంది.
12.ఎర్ర మందారం పూలను రెండు గ్లాసుల నీళ్ళలో వేసి ఉడికించి ఒక గ్లాసు నీరు వచ్చేవరకు మరిగించి, వడకట్టి, కషాయం తీసి సీసాలోకి తీసుకుని, రోజూ తలకి పెట్టుకొని రెండు గంటల తర్వాత తల స్నానం చేస్తే పేనుకొరుకుడు తగ్గుతుంది.
చుండ్రు నివారణకు
13.మెంతులు (పచ్చివి) మెత్తగా పొడి చేసి, తలకి సరిపోయే పొడిని రాత్రి నీళ్ళల్లో నానబెట్టి, అందులో నిమ్మరసం, పెరుగు కలిపి తలకు పట్టించి గంటసేపు వుండి, తల స్నానంచేస్తే చుండ్రు తగ్గుతుంది.
14.కలబంద నుండి గుజ్జుతీసి మెత్తగా చేసి, గుజ్జుని తలకి పట్టించి గంట తర్వాత తల స్నానం చేస్తే చుండ్రు నివారణ అవుతుంది.
మడమ నొప్పి తగ్గాలంటే
15.చల్లటి ఒక కప్పు ఆవుపాలు తీసుకుని అందులో ఒక చెక్క నిమ్మరసం కలిపి వెంటనే తీసుకుంటే అర్షమొలలు తగ్గుతాయి.
16.జిల్లేడు పువ్వు, పసుపు సమానంగా తీసుకుని నూరి అందులో కొంచెం ఆముదాన్ని వేసి మడమకి రాత్రిపూట కట్టి ఉదయం తీసేస్తే మడమ నొప్పి తగ్గుతుంది.
పచ్చకామెర్లు ఉంటే
17.శొంఠి మిరియాలు సమానంగా తీసుకుని, రెండింటిని దోరగా వేయించి చూర్ణంచేసి పూటకి ఐదు గ్రాములు తేనెతో కలిపి రోజూ మూడు పూటలా 10 రోజుల్లో కీళ్ళ నొప్పులు తగ్గుతాయి.
18.రావి చెక్క కొద్దిగా ఒక గ్లాసు నీళ్ళలో ఉడికించి కషాయం తీయాలి. చల్లారిన కషాయాన్ని రాత్రికి అలాగే వుంచి పరగడుపున తాగాలి. ఇలా మూడురోజులు తాగాలి. నేల ఉసిరి మందుతోపాటు రావిచెక్క కషాయం తాగితే పచ్చకామెర్లు తగ్గుతాయి.
షుగర్ పేషెంట్లకు ఇది దివ్య ఔషధం
19.మెంతులు రెండు చెంచాలు, లేత వేప చిగురు, కాకరకాయ, బోగన్‌విల్లా లేత చిగుర్లు (ఎనిమిది లేక పది) తింటే మధుమేహం అదుపులో ఉంటుంది.
20.ఒక కాకరకాయ, ఒక కీర కాయ, ఒక టమోటా పండు, పది తెల్ల బిళ్లగన్నేరు పూలు, పది వేప చిగుళ్ళు కలిపి కొంచెం నీళ్ళు కలిపి రసం తీసి, ఒక సీసాలో పోసుకుని ఫ్రిజ్‌లో భద్రపరచి పరగడుపున ఒక చెంచా రసం తాగితే షుగర్ పేషెంట్లకు ఇది దివ్య ఔషధం.
పార్శ్వపు నొప్పి తగ్గటానికి
21.పెద్ద ఉసిరికాయంత అల్లం, రెండు పసుపుకొమ్ములు కలిపి దంచి దానికి ఒక కాయ నిమ్మరసం, మూడు చెంచాల ఆముదం కలిపి గోరువెచ్చ చేయాలి. తలకి పట్టువేసి గుడ్డతో గట్టిగా కట్టి గంటసేపు నిద్రపోతే తలనొప్పికి ఉపయుక్తంగా ఉంటుంది.
22. తులసి రసాన్ని నాలుగుచుక్కలు తీసుకుని ఎడమవైపు నొప్పి వస్తే కుడి ముక్కులో, కుడివైపు నొప్పి వస్తే ఎడమవైపు ముక్కులో వేసుకుని గంటసేపు పడుకుంటే పార్శ్వపు నొప్పి తగ్గుతుంది.
-నవీన్ నడిమింటి, ఆయుర్వేద వైద్య నిపుణులు
నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే!
Comments
Please login to add a commentAdd a comment