సాక్షి,హైదరాబాద్: దీపావళి అంటేనే వెలుగుల పండుగ.. అమావాస్య చీకట్లను చీల్చుతూ ఎటుచూసినా దీపాల సొబగులే.. అంబరాన్నంటే సంబరాలే.. బంధువుల రాకపోకలు... అతిథి మర్యాదలు... టపాసుల మోతలు ఇలా దీపావళి పండుగ అంతా సందడిగానే ఉంటుంది. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఆనందోత్సవాల మధ్య జరుపుకునే పండుగ ఇది. అలాంటి దీపావళి పండుగలో ఆనందం ఎంత ఉంటుందో ప్రమాదం కూడా అంతే ఉంటుందని ఫైర్ అండ్ సేఫ్టీ అధికారులు హెచ్చరిస్తున్నారు.
లక్ష్మీదేవి ఆరాధన..
దీపావళి రోజు ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి పూజను నిర్వహిస్తారు. ఇంట్లో ఉన్న బంగారం, నగదును అమ్మవారి చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. చీకట్లను పారద్రోలే విధంగా దీపాలను వెలిగించి పూజ చేస్తారు. దీపారాధన అనేది ఈ పండుగలో ప్రత్యేకమైనది. ఇంట్లో దీపాలు వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయని అందరి నమ్మకం. లక్ష్మీదేవి దీప జ్యోతిగా సంపద దైవంగా భావిస్తుండటంతో అందరు దీపావళి రోజు దీపాలను వెలిగిస్తారు.
మార్కెట్‌లో రకరకాల డిజైన్‌లు..
మార్కెట్‌లో వివిధ రకాల డిజైన్‌లతో కూడిన ప్రమిదలు లభిస్తున్నాయి. స్టీల్, ప్లాస్టిక్, మట్టికి సంబంధించి దీపాలు, ప్రమిదలు వివిధ డిజైన్లలో మార్కెట్లో దండిగా లభిస్తున్నాయి. వాటిని కొనుగోలు చేసేందుకు ప్రజలకు కూడా ఆసక్తి కనబరుస్తున్నాయి. అదేవిధంగా ఈ పండుగకు కావాల్సిన వస్తువులు ఆన్‌లైన్‌లో తక్కువ రేటు ఉండటంతో చాలామంది ఆన్‌లైన్ ద్వారా తెíప్పించుకుంటున్నారు. మరికొందరు దుకాణాలకు నేరుగా వెళ్లి తెచ్చుకుంటున్నారు. దీంతో మార్కెట్లు సందడిగా మారాయి.
జాగ్రత్తలు తప్పనిసరి..
దీపావళి పండుగలో ఆనందం ఎంత ఉంటుందో ప్రమాదం కూడా అంటే ఉంటుంది. బాణా సంచా కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అగ్నిమాపకశాఖ, పోలీసులు, వైధ్యాధికారులు చెబుతున్నారు. అప్రమత్తంగా ఉంటే ప్రమాదాలను నివారించవచ్చు.
► టపాసులను ఆరుబయటనే కాల్చాలి. ఇంట్లో కాల్చొద్దు.
► ఆస్పత్రులు, పెట్రోల్ బంకులు ఉన్న ప్రాంతాల్లో టపాసులు పేల్చొద్దు.
► టపాసులు కాల్చే ముందు విధిగా పాదరక్షలు ధరించాలి, అందుబాటులో నీళ్లు ఉంచుకోవాలి. గాయాలు అయితే వెంటనే సమీపంలో ఉన్న వైద్యులను సంప్రదించాలి.
► టపాసులు కాల్చేటప్పుడు చిన్నారులను ఒంటరిగా వదిలిపెటొద్దు. పెద్దల సమక్షంలోనే పిల్లలు టపాసులు కాల్చాలి. సరిగ్గా కాలని బాణసంచాపై నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు.
► టీషర్టులు, జీన్స్‌లాంటి దుస్తులు కాకుండా వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి, కళ్లకు హాని కలగకుండా అద్దాలు వాడాలి.
► అగ్నిమాపక శాఖ వద్ద లైసెన్సులు పొందిన దుకాణాల్లోనే బాణసంచా కొనుగోలు చేయాలి.
► పర్యావరణ హితమైన పదార్థాలతో తయారు చేసిన గ్రీన్ కాకర్స్ ఉపయోగిస్తే మంచిది.
అప్రమత్తంగా ఉండాలి
టపాసుల కాల్చేటప్పుడు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. తగిన జాగ్రత్తలో బాణా సంచా కాల్చాలి. టపాసులు విక్రయించే వారు విధిగా అనుమతులు తీసుకోవాలి. దుకాణాల వద్ద ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా చర్యలు చేపట్టాలి.
– రమేష్‌గౌడ్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్, షాద్‌నగర్ అగ్నిమాపక కేంద్రం
Comments
Please login to add a commentAdd a comment