CRACKERS BLAST
-
ఏలూరులో విషాదం.. స్కూటీపై క్రాకర్స్ తీసుకెళ్తుండగా పేలుడు..
సాక్షి, ఏలూరు: దీపావళి పండుగ వేళ ఏలూరు విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్కూటీపై బాణాసంచా తరలిస్తుండగా అవి ఆకస్మాత్తుగా పేలడంతో ఓ యువకుడు మృతిచెందాడు. దీంతో, స్థానికంగా విషాదకర ఛాయలు అలుముకున్నాయి.వివరాల ప్రకారం.. ఏలూరు జిల్లాలో తూర్పు వీధి గౌరీ దేవీ గుడి వద్ద ప్రమాదం జరిగింది. పండుగ నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులు స్కూటీపై బస్తాలో బాణాసంచా తరలిస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ క్రమంలో స్కూటీపై వెళ్తున్న ఇద్దరిలో ఓ యువకుడు మృతిచెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ క్రమంలో రోడ్డు పక్కనే ఉన్న మరికొందరు గాయపడ్డారు. ఇక, గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం ఏలూరు సర్వజన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
గుడిలో బాణసంచా ప్రమాదం.. 150 మందికి గాయాలు
తిరువనంతపురం:కేరళలోని ఓ గుడిలో వేడుకల సందర్భంగా బాణసంచాకు ప్రమాదవశాత్తు మంటలంటుకున్నాయి. కాసర్గోడ్ నీలేశ్వరంలోని వీరర్కవు గుడిలో కాళియట్లం ఉత్సవాల్లో సోమవారం(అక్టోబర్ 28) అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో 150 మంది దాకా గాయపడ్డారు. వీరిలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది.గాయపడ్డవారిని కాసర్గోడ్, కన్నూర్, మంగళూరులలోని ఆస్పత్రుల్లో చేర్పించి చికిత్సనందిస్తున్నారు. గుడిలో బాణసంచా నిల్వ చేసిన గదికి మంటలంటుకోవడం భారీ అగ్ని ప్రమాదానికి కారణమైందని పోలీసులు తెలిపారు.జిల్లా కలెక్టర్, ఎస్పీ ప్రమాదస్థలాన్ని సందర్శించారు. బాణసంచా నిల్వ ఉన్న ప్రాంతానికి కనీసం 100 మీటర్ల దూరంలోనే వాటిని కాల్చాలన్న నిబంధనను పట్టించుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని కలెక్టర్ చెప్పారు. #Kasargod Firecracker room caught fire at veerakaav temple https://t.co/3tqCteOJXf pic.twitter.com/4TU0dkLZOb— 𝖆𝖓𝖚𝖕 (@anupr3) October 28, 2024 ఇదీ చదవండి: రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న కేరళ సీఎం -
తమిళనాడు-కర్ణాటక బోర్డర్లో భారీ పేలుడు.. 10 మంది మృతి
సాక్షి, తమిళనాడు: కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లో భారీ పేలుడు ఘటన చోటుచేసుకుంది. రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో ఉన్న బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది.ఈ ప్రమాదంలో దాదాపు 10 మందికిపైగా మృత్యువాతపడ్డినట్టు తెలుస్తోంది. వివరాల ప్రకారం.. తమిళనాడు, కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన అత్తిపల్లిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అత్తిపల్లిలో ఉన్న బాణసంచా తయారీ కేంద్రంలో శనివారం సాయంత్రం పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 10 మంది మృతి చెందారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డినట్టు సమాచారం. అయితే, పేలుడు సంభవించిన సమయంలో బాణసంచా తయారీ కేంద్రంలో 30 మంది ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్యల పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇక, పేలుడు సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆపే ప్రయత్నం చేస్తున్నారు. Fire accident in Crackers shop in TN/KA border. Guess who was the rest responder? Tamilnadu!! Fire truck from Karnataka came an hour late, though it happened on their side pic.twitter.com/v9Wg3JDAx2 — Nikel Reddy (@Nikel11860559) October 7, 2023 #Breaking in #Bengaluru A major #fire breaks out at a #cracker shop/godown near #Attibele (#Anekal area) on #Hosur Road near #Karnataka-#TamilNadu border. #Traffic crawls on the #highway.@NammaBengaluroo @WFRising @TOIBengaluru @0RRCA @ECityRising @ELCITA_IN pic.twitter.com/qtwXw0yIIs — Rakesh Prakash (@rakeshprakash1) October 7, 2023 -
బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు.. పలువురు మృతి
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్లో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందినట్టు తెలుస్తోంది. మరికొందరు గాయపడినట్టు సమాచారం. వివరాల ప్రకారం.. పశ్చిమబెంగాల్లోని నార్త్ 24 పరగణా జిల్లాలోని దత్తపుకూర్‌లో అక్రమ ఫైర్ క్రాకర్స్ ఫ్యాక్టరీలో ఆదివారం ఉదయం పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఇక, ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందగా మరికొందరు గాయపడ్డారు. కాగా, మరిన్ని మరణాలు పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. మరోవైపు.. బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు ధాటికి చుట్టుపక్కల ఉన్న ఇళ్లు కూడా పాక్షికంగా దెబ్బతిన్నట్టు అధికారులు చెబుతున్నారు. #Breaking: A massive blast rocked Duttapukur in North 24 pgs district of #WestBengal following a fire reported inside an illegal fire crackers factory. Four people dead in the blast, death toll likely to increase. Several houses adjoining the illegal fire crackers factory have… pic.twitter.com/T6FNWMkua4 — Pooja Mehta (@pooja_news) August 27, 2023 ఇది కూడా చదవండి: బయట వర్షం.. బస్సులో గొడుగు పట్టిన డ్రైవర్! -
బాలుడి మర్మాంగంపై టపాసులు కాల్చిన యువకులు.. వీడియో తీసి వైరల్
సాక్షి, మేడ్చల్: హైదరాబాద్ శివారులో అమానుష సంఘటన చోటు చేసుకుంది. ఉపాధి నిమిత్తం హైదరాబాద్ నగరానికి వచ్చిన 16 ఏళ్ల బాలుడి మర్మాంగాలపై టపాసులు పేల్చి వీడియోను వైరల్ చేసి దారుణానికి ఒడిగట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఖుషీనగర్‌కు చెందిన 16 ఏళ్ల బాలుడిని మూడు నెలల క్రితం నగరానికి ఉపాధి నిమిత్తం బంధువులు పంపించారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధి బాసిరేగడి శివారులో జేఎస్‌డబ్ల్యూ రెడీమిక్స్ ప్లాంట్‌లో పనిచేసేందుకు వచ్చాడు. కాగా కొన్ని రోజులుగా ఆ బాలుడిని ఇబ్బందులకు గురి చేస్తున్న తోటి యువకులు బాలుడి మర్మాంగాలపై టపాసులు పేలుస్తూ ఆ తతంగాన్ని వీడియో చిత్రీకరించారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. సదరు బాలుడి సెల్‌ఫోన్ లాక్కుని బెదిరించారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోను బాధిత బాలుడి బంధువులు తిలకించడంతో విషయం కుటుంబీకులకు చేరింది. ఆ తర్వాత వారు బాలుడికి ఫోన్ చేసి సంఘటన గురించి ఆరా తీశారు. బాలుడు అది నిజం అని తెలపడంతో బాధితుడి తల్లిదండ్రులు ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న అక్కడి పోలీసులు ఆ కేసును మంగళవారం మేడ్చల్ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. ఈ మేరకు మేడ్చల్ ఇన్స్పెక్టర్ ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని ఇన్స్పెక్టర్ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. చదవండి: Hyderabad: విజిటర్‌గా దుబాయ్‌కు వెళ్లి... జల్సాలకు డబ్బంతా ఖర్చు అవ్వడంతో -
టపాసుల వేళ అపశ్రుతులు.. మంటలంటుకుని కళ్లకు, ఒంటికి గాయాలు
సాక్షి, హైదరాబాద్: దీపావళి వేళ బాణసంచా కాలుస్తున్న క్రమంలో నగరంలో కొన్నిచోట్ల అపశ్రుతులు చోటుచేసుకున్నాయి. పలువురికి కళ్లకు, ఒంటికి గాయాలయ్యాయి. నగర వ్యాప్తంగా సుమారు 100 మందికి పైగా బాధితులు పలు ఆస్పత్రుల్లో చేరారు. కంటి గాయాలకు గురైనవారిలో ఎక్కువ మంది చిన్నారులే కావడం గమనార్హం. సరోజినీదేవి ఆస్పత్రికి క్యూ.. మెహిదీపట్నంలోని సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో దీపావళిని ముందు రోజు ముగ్గురు, పండగ రోజు రాత్రి సమయంలో 45 మంది దాకా కంటి గాయాలతో సంప్రదించారు. ఇందులో 21 మంది అవుట్ పేషెంట్ విభాగంలో చూపించుకుని వెళ్లిపోగా 19 మంది అడ్మిట్ అయ్యారు. పండగ తర్వాత రోజు కూడా మరో 2 కేసులు వచ్చాయని వైద్యులు చెప్పారు. వీరిలో అయిదేళ్ల వయసు నుంచి 67 ఏళ్లు పైబడిన వారు ఉన్నారు. మొత్తం బాధితుల్లో అత్యధికులు చిన్నారులే. బాధితుల్లో మల్లెపల్లికి చెందిన అజయ్ సింగ్ (25), విజయ్ ఆనంద్ (61), సి. మహావీర్ (15)ల ఎడమ కళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరితో పాటు కుడికన్నుకు గాయమైన హయత్‌నగర్‌కు చెందిన రాజి (37)లకు శస్త్ర చికిత్సలు నిర్వహించారు. బాధితుల్లో ఒక అబ్బాయి కంటి చూపు కోల్పోయాడని వైద్యులు తెలిపారు. ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి.. బంజారాహిల్స్‌లోని ఎల్వీప్రసాద్ కంటి ఆస్పత్రికి పెద్ద సంఖ్యలోనే బాణసంచా బాధితులు నమోదయ్యారు. పండగ ముందురోజున అయిదుగురు, దీపావళి రోజున 21 మంది, మరుసటి రోజున (సాయంత్రం 4గంటల వరకూ) 11 మంది కంటి గాయాలతో ఆస్పత్రికి వచ్చారని వీరిలో 9 మందికి సర్జరీలు చేశామని వైద్యులు తెలిపారు. గాంధీ ఆస్పత్రిలో బాణసంచా కారణంగా 7 కాలిన గాయాల కేసులు నమోదయ్యాయి. చందానగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తీవ్రగాయాలతో ఒకరు చికిత్స పొందుతున్నారు. పలు ప్రాంతాల్లోని ప్రభుత్వ ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ బాణసంచా బాధితులు చికిత్స పొందుతున్నట్టు సమాచారం. కాలిన గాయాలతో ఉస్మానియాకు... నగరంలో కంటి గాయాలతో చిన్నారులు ఆస్పత్రుల పాలు కాగా కాలిన గాయాలతో పెద్దలు ఆస్పత్రులకు క్యూ కట్టారు. ఉస్మానియా ఆస్పత్రిలో 18 మందికి కాలిన గాయాల బాధితులు సంప్రదించగా ఇందులో ఒకరు తీవ్ర గాయాలతో అడ్మిట్ అయ్యారు. శరీరం కాలిన ఆ మహిళ (63) పరిస్థితి విషమంగా ఉందని, ఆమె దాదాపు 95 శాతం కాలిన గాయాల బారిన పడడంతో వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఇదేం తిక్కరా నాయనా.. లక్ష టపాసులతో కారును డెకరేట్ చేసి మంటపెట్టి..
Viral Video.. దీపావళి అనగానే అందరి టపాసులే గుర్తుకువస్తాయి. చిన్న నుండి పెద్దల వరకు ఎంతో ఆనందంగా టపాసులు కాలుస్తూ ఎంజాయ్ చేస్తారు. అయితే, టపాసులు కాల్చే విషయంలో ఎవరి స్టైల్ వారికే ఉంటుంది. దీపావళి సందర్భంగా ఓ స్పెషల్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మీరు కూడా ఓ లుక్కెయండి. కాగా, దీపావళి సందర్భంగా ఓ యూట్యూబర్ కొత్తగా ఆలోచించాడు. అందరిలా మనం కూడా బాణాసంచా కాలిస్తే కిక్కు ఏముందిలే అనుకున్నాడు ఈ క్రమంలో డిఫరెంట్‌గా థింక్ చేశాడు. రాజస్తాన్‌లోని అల్వార్‌కు చెందిన యూట్యూబర్ అమిత్ శర్మ.. కొత్తగా ఏం చేద్దామా అని ఆలోచించి.. ఓ కారును టార్గెట్ చేశాడు. దీపావళి సందర్భంగా ఆ కారును ఏకంగా లక్ష టపాసులతో అలంకరించాడు. కారు చుట్టూ లక్ష టపాసులకు వరసగా పేర్చాడు. కారు ముందున్న గ్లాస్‌పై మాత్రం టపాసులు పెట్టలేదు. అనంతరం, 1.. 2.. 3.. అంటూ బాంబులను పేల్చాడు. #Watch: Ahead of Diwali, this Youtuber sets car on fire by covering it with firecrackers, video goes viral #ViralVideo #Diwali Video Courtesy: Crazy XYZ pic.twitter.com/oUixu6f5sR — NewsMobile (@NewsMobileIndia) October 23, 2022 ఈ క్రమంలో కొద్దిసేపు ఆ ప్రాంతమంతా బాంబుల శబ్ధంతో మారుమోగిపోయింది. ఆ తర్వాత మళ్లీ కారు దగ్గరుకు వెళ్లాడు. బాంబులు పేలడంతో కారు కలర్ మొత్తం మారిపోయింది. కారు లోపల పొగ నిండిపోయి ఉంది. కారు అద్దంపై బాంబులు లేకపోయినప్పటికీ పేలిన టపాసుల ధాటికి గ్లాస్ మెత్తబడిపోయి పగిలిపోయింది. కానీ, ఇన్ని బాంబులు పేలినా కారు ఇంజన్ మాత్రం పనిచేయడం విశేషం. కొద్దిసేపటి తర్వాత యూట్యూబర్ మళ్లీ కారును స్టార్ట్ చేసి డ్రైవింగ్ చేస్తూ తన దోస్తులతో ఎంజాయ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
Diwali 2022: టపాసులు కాల్చే సమయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
సాక్షి,హైదరాబాద్: దీపావళి అంటేనే వెలుగుల పండుగ.. అమావాస్య చీకట్లను చీల్చుతూ ఎటుచూసినా దీపాల సొబగులే.. అంబరాన్నంటే సంబరాలే.. బంధువుల రాకపోకలు... అతిథి మర్యాదలు... టపాసుల మోతలు ఇలా దీపావళి పండుగ అంతా సందడిగానే ఉంటుంది. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఆనందోత్సవాల మధ్య జరుపుకునే పండుగ ఇది. అలాంటి దీపావళి పండుగలో ఆనందం ఎంత ఉంటుందో ప్రమాదం కూడా అంతే ఉంటుందని ఫైర్ అండ్ సేఫ్టీ అధికారులు హెచ్చరిస్తున్నారు. లక్ష్మీదేవి ఆరాధన.. దీపావళి రోజు ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి పూజను నిర్వహిస్తారు. ఇంట్లో ఉన్న బంగారం, నగదును అమ్మవారి చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. చీకట్లను పారద్రోలే విధంగా దీపాలను వెలిగించి పూజ చేస్తారు. దీపారాధన అనేది ఈ పండుగలో ప్రత్యేకమైనది. ఇంట్లో దీపాలు వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయని అందరి నమ్మకం. లక్ష్మీదేవి దీప జ్యోతిగా సంపద దైవంగా భావిస్తుండటంతో అందరు దీపావళి రోజు దీపాలను వెలిగిస్తారు. మార్కెట్లో రకరకాల డిజైన్లు.. మార్కెట్లో వివిధ రకాల డిజైన్లతో కూడిన ప్రమిదలు లభిస్తున్నాయి. స్టీల్, ప్లాస్టిక్, మట్టికి సంబంధించి దీపాలు, ప్రమిదలు వివిధ డిజైన్లలో మార్కెట్లో దండిగా లభిస్తున్నాయి. వాటిని కొనుగోలు చేసేందుకు ప్రజలకు కూడా ఆసక్తి కనబరుస్తున్నాయి. అదేవిధంగా ఈ పండుగకు కావాల్సిన వస్తువులు ఆన్లైన్లో తక్కువ రేటు ఉండటంతో చాలామంది ఆన్లైన్ ద్వారా తెíప్పించుకుంటున్నారు. మరికొందరు దుకాణాలకు నేరుగా వెళ్లి తెచ్చుకుంటున్నారు. దీంతో మార్కెట్లు సందడిగా మారాయి. జాగ్రత్తలు తప్పనిసరి.. దీపావళి పండుగలో ఆనందం ఎంత ఉంటుందో ప్రమాదం కూడా అంటే ఉంటుంది. బాణా సంచా కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అగ్నిమాపకశాఖ, పోలీసులు, వైధ్యాధికారులు చెబుతున్నారు. అప్రమత్తంగా ఉంటే ప్రమాదాలను నివారించవచ్చు. ► టపాసులను ఆరుబయటనే కాల్చాలి. ఇంట్లో కాల్చొద్దు. ► ఆస్పత్రులు, పెట్రోల్ బంకులు ఉన్న ప్రాంతాల్లో టపాసులు పేల్చొద్దు. ► టపాసులు కాల్చే ముందు విధిగా పాదరక్షలు ధరించాలి, అందుబాటులో నీళ్లు ఉంచుకోవాలి. గాయాలు అయితే వెంటనే సమీపంలో ఉన్న వైద్యులను సంప్రదించాలి. ► టపాసులు కాల్చేటప్పుడు చిన్నారులను ఒంటరిగా వదిలిపెటొద్దు. పెద్దల సమక్షంలోనే పిల్లలు టపాసులు కాల్చాలి. సరిగ్గా కాలని బాణసంచాపై నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు. ► టీషర్టులు, జీన్స్లాంటి దుస్తులు కాకుండా వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి, కళ్లకు హాని కలగకుండా అద్దాలు వాడాలి. ► అగ్నిమాపక శాఖ వద్ద లైసెన్సులు పొందిన దుకాణాల్లోనే బాణసంచా కొనుగోలు చేయాలి. ► పర్యావరణ హితమైన పదార్థాలతో తయారు చేసిన గ్రీన్ కాకర్స్ ఉపయోగిస్తే మంచిది. అప్రమత్తంగా ఉండాలి టపాసుల కాల్చేటప్పుడు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. తగిన జాగ్రత్తలో బాణా సంచా కాల్చాలి. టపాసులు విక్రయించే వారు విధిగా అనుమతులు తీసుకోవాలి. దుకాణాల వద్ద ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా చర్యలు చేపట్టాలి. – రమేష్‌గౌడ్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్, షాద్‌నగర్ అగ్నిమాపక కేంద్రం -
పంజాబ్‌లో ఘోర ప్రమాదం; 15మంది మృతి
-
పంజాబ్‌లో ఘోర ప్రమాదం; 15మంది మృతి
చంఢీగర్ : పంజాబ్‌లో శనివారం సాయంత్రం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్కులో తీసుకెళుతున్న బాణాసంచా ప్రమాదావశాత్తు పేలడంతో 15 మంది మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు. -
ఆరిపోయిన ఇంటి దీపాలు
దీపావళి రోజున వెలుగులు నింపడానికి బాణసంచా తయారీలో పనికి కుదిరిన ఆ కూలీల జీవితాల్లో విషాదమే మిగిలింది. వ్యవసాయ పనులేవీ లేకపోవడంతో నెల రోజుల ఉపాధి కోసం వెళ్లిన ఈ ఐదుగురూ మృత్యువుతో పోరాడి అసువులు బాశారు. బుధవారం ఇద్దరు, గురువారం ముగ్గురు మృత్యువాత పడడంతో సామర్లకోట మండల పరిధిలోని వేట్లపాలెం శివారు కాలనీల్లో కన్నీరు గూడుకట్టుకుంది. తెలతెలవారుతుండగానే... సూరీడు పొద్దు పొడవకముందే ఆ గ్రామంలో కూలీలు నిద్రలేచి కూటి కోసం పరుగులు తీస్తారు. రోజూలాగానే 12 మంది కూలీలందరూ కలసి గత నెల 30వ తేదీన బాణసంచా తయారీ పనులకు వెళ్లారు. గత నెలాఖరు... అదే వారి జీవితాల్లో ఆఖరి ఘడియలని తెలుసుకోలేకపోయారు. వారి బతుకులతో విధి ఆడిన వికృత క్రీడకు ఆ ఇంటి దీపాలు ఆరిపోయాయి. సామర్లకోట (పెద్దాపురం): మండలంలోని వేట్లపాలెం–జి.మేడపాడు మధ్య కెనాల్ రోడ్డులో ఉన్న ఇందిరా ఫైర్ వర్క్స్‌లో గత సోమవారం బాణసంచా తయారీ చేస్తుండగా జరిగిన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య ఐదుగురికి చేరింది. వేట్లపాలెం శివారు ప్రాంతం గూడపర్తి, జొన్నలదొడ్డికి చెందిన 12 మంది సోమవారం బాణసంచా తయారు చేస్తుండగా అగ్ని ప్రమాదం సంభవించిన విషయం విదితమే. ఈ సంఘటనలో 9 మంది తీవ్రంగా గాయపడగా, వారిని మెరుగైన వైద్యం కోసం వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు ఆధ్వర్యంలో కాకినాడలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ క్షతగాత్రులైన బంటు చెల్లాయ్యమ్మ (45) మాకిరెడ్డి నూకాలమ్మ (70) బుధవారం మృతి చెందగా, బత్తిన లోవ కుమారి (45) కాకర అనిత(30) కొంగు లక్ష్మి(55) గురువారం మృతి చెందారు. క్షతగాత్రులు మృతి చెందిన విషయం తెలియడంతో వేట్లపాలెంలోని శివారు ప్రాంతాలైన జొన్నలదొడ్డి, గూడపర్తిలలో విషాదఛాయలు అలముకున్నాయి. బంటు చెల్లాయ్యమ్మకు ఇద్దరు కుమార్తెలు. వారికి పెళ్లిళ్లు చేసింది. భర్తను పోషించడానికి కూలి పనికి వెళ్లి పేలుడు ప్రమాదంలో చనిపోయింది. మాకిరెడ్డి నూకాలమ్మ వృద్ధాప్యంలోనూ కుటుంబపోషణకు వెళ్లి బలైంది. బత్తిన లోవకుమారికి భర్త, ఇద్దరు కుమార్తెలు. బాణసంచా తయారీ పనికి వెళ్లి కుటుంబాన్ని పోషిస్తోంది. నాలుగు రోజులుగా తన తల్లి కనిపించకపోవడంతో ఏడో తరగతి, నాలుగో తరగతి చదువుతున్న చిన్నారులు బిక్కుబిక్కుమంటూ దిక్కులు చూస్తున్నారు. గురువారం తల్లి మృతి చెందిన విషయం తెలిసి చిన్నారులతో పాటు ఆ ప్రాంత ప్రజలు విషాదంలో మునిగిపోయారు. కాకర అనితకు ఇద్దరు కుమార్తెలు ఉండగా ఒక కుమార్తె ఇంటర్, మరో కుమార్తె ఆరో తరగతి చదువుతున్నారు. సోమవారం నుంచి తండ్రి దుర్గారావుతోపాటు వారు కూడా కంటిపై కునుకు లేకుండా ఉన్నారు. గురువారం అనిత మరణ వార్తతో ఆ కుటుంబం కుప్పకూలిపోయింది. కొంగు లక్ష్మికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. ఇద్దరు కుమార్తెలు, పెద్ద కుమారుడికి వివాహమైంది. చిన్నకుమారుడుకి పెళ్లి చేయాలనే ఆలోచనలో ఉన్న సమయంలో ఆమె లేకుండా పోయిందని ఆమె బంధువులు రోదించారు. మృతదేహాలను ఇళ్లకు తీసుకువెళ్లకుండా కాకినాడ నుంచి నేరుగా వేట్లపాలెంలోని శ్మశాన వాటికకు గురువారం రాత్రి తీసుకువెళ్లి దహన సంస్కారాలు నిర్వహించారు. ఆందోళనతో విజయం సాధించాం బాణసంచా పేలుడు ప్రమాదంలో క్షతగాత్రులు మృతి చెందడంతో వారి కుటుంబాలకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టరు కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించామని దళిత నాయకులు లింగం గంగాధర్, లింగం శివప్రసాద్, వల్లూరి సత్తిబాబు, సరిపల రాజేష్, సిద్ధాంతుల కొండబాబు, పి.జనార్దన్‌లు తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వెంటనే స్పందించి బాధిత కుటుంబాలకు న్యాయం చేయడానికి ముందుకు వచ్చారని వారు తెలిపారు. బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సహాయంతో పాటు, ఉద్యోగం ఇవ్వడానికి అంగీకరించారని తెలిపారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు దళిత సంఘాల ఆందోళనకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెంటనే స్పందించారని వైఎస్సార్ సీపీ పెద్దాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు తెలిపారు. మృతి చెందిన వారి, క్షతగాత్రుల ఆర్థిక పరిస్థితిని ముఖ్యమంత్రికి మంత్రి కన్నబాబు వివరించడంతో ఆయన సానుకూలంగా స్పందించి మృతి చెందిన వారికి రూ.పది లక్షలు, క్షతగాత్రులకు రూ.నాలుగు లక్షలు ఇవ్వడానికి అంగీకరించారని దొరబాబు స్థానిక విలేకర్లకు తెలిపారు. వీరి కుటుంబాలకు అన్ని ప్రభుత్వ పథకాలు అందేలా చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని దొరబాబు తెలిపారు. -
కొంప ముంచిన లాభాపేక్ష
సాక్షి ప్రతినిధి, వరంగల్: బాణసంచా నిల్వ చేయాల్సిన చోట అక్రమంగా తయారీ మొదలు పెట్టారు. ఏళ్ల తరబడి ఈ పనులు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం మానేశారు. ఫలితంగా పదిమంది నిండు ప్రాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. భధ్రకాళి ఫైర్వర్క్స్ ప్రమాదంలో పోలీసు, అగ్నిమాపకశాఖ, రెవెన్యూ విభాగాల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కాశిబుగ్గకు చెందిన గుల్లపెల్లి రాజ్‌కుమార్ అలియాస్ బాంబుల కుమార్.. ఇతర ప్రాంతాల్లో తయారైన బాణసంచాను ఏడాదిపాటు అమ్ముకునేందుకు మాత్రమే అనుమతులు పొందాడు. తమిళనాడులోని శివకాశిలో తయారు చేసిన బాణసంచాను ట్రాన్స్‌పోర్టు ద్వారా వరంగల్‌కు తెప్పించి.. ఇక్కడ గోదాముల్లో నిల్వ చేసి అమ్మకాలు చేసుకోవచ్చు. ఎక్కడో తయారు చేసిన వాటిని ఇక్కడకు తెచ్చి అమ్మడం కంటే ఇక్కడే తయారు చేసి అమ్మితే ఎక్కువ లాభాలు వస్తాయనే దురాశే కొంప ముంచింది. దీంతో అమ్మకాల అనుమతుల మాటున దర్జాగా బాణసంచా తయారీ చేయడం ప్రారంభించారు. సంబంధిత అధికారులు కూడా మరో ఆలోచన లేకుండా వరుసగా అమ్మకాలకు అనుమతులు ఇస్తూ వెళ్లారు. 15 కేజీల వంతున విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. భద్రకాళి ఫైర్వర్క్స్లో నిబంధనలకు విరుద్ధంగా సుతిల్తాడు బాంబు, చిచ్చుబుడ్డి, రాకెట్లు, స్మాల్ షాట్స్, పేపర్షాట్స్ తయారు చేస్తున్నారు. దీనికి అవసరమైన గంధకం, పొటాషియం, ఎలక్ట్రికల్ పౌడర్, ట్రాజన్, బరాట, వైట్ (సెకండ్క్వాలిటీ, శక్తివంతమైన పేలుడు పదార్థం) తమిళనాడులోని చెన్నై, శివకాశి నుంచి రాజ్‌కుమార్ తెప్పిస్తున్నట్లు సమాచారం. ఒక్కో మెటీరియల్‌ను కనీసం 15 కేజీలు తగ్గకుండా ప్రైవేటు ట్రాన్సుపోర్టు సంస్థల ద్వారా వరంగల్‌కు రప్పిస్తున్నారు. ఇలా వచ్చిన పదార్థాలను భద్రకాళి ఫైర్వర్క్స్ ఔట్లెట్ వెనక భాగంలో ఉన్న బాణసంచా తయారీ గదుల్లో భద్రపరుస్తున్నారు. ఈ మిశ్రమాన్ని వివిధ బాంబులకు అనుగుణంగా తగు మోతాదుల్లో కలిపి బాంబులు తయారు చేస్తారు. వివిధ మోతాదుల్లో మందుగుండు సామగ్రిని కలిపి మిశ్రమంగా చేసే పనిని రాజ్‌కుమార్ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తాడు. ఇలా రూపొందిన మిశ్రమాన్ని బాణసంచా తయారీలో వినియోగిస్తారు. ఇలా కలిపిన మిశ్రమంతో తొలుత కొన్ని శాంపిల్స్ బాణసంచా తయారు చేసి, ఒక రోజంతా పరిశీలనలో ఉంచుతారు. అనంతరం వాటిని పేల్చి పరీక్ష చేస్తారు. సరిగా పేలకుంటే మిశ్రమంలో మార్పు చేస్తారు. తగు మోతాదులో ఉందని తేలితే బాణసంచా తయారీలో వినియోగిస్తారు. మిశ్రమం రూపొందించే క్రమంలో ఏ మాత్రం ఒత్తిడి పెరిగినా మంటలు రాజుకోవడం సాధారణం. మందుగుండు గదిలో మంటలు ప్రమాదం జరిగిన రోజు మొత్తం 14 మంది భధ్రకాళి ఫైర్వర్క్స్లో పనికి వచ్చారు. కంపెనీ ముందుభాగంలో కంపెనీ కార్యాలయం, దాని పక్కన గదిలో తయారు చేసిన బాంబులు విక్రయిస్తారు. దీని వెనుక రెండో భాగంలో బాంబులు తయారు చేస్తారు. బుధవారం ఉదయం బాంబులు తయారు చేసే విభాగంలో మూడు గదులు ఉన్నాయి. ఇందులో చివరి గదిలో మల్లిఖార్జున్, రాకేశ్. అశోక్ బాంబులకు మందులను కలుపుతున్నారు. రెండో గదిలో నలుగురు మహిళా కార్మికులు కూర్చుని తయారు చేసిన బాంబులకు వత్తులు అమర్చుతున్నారు. మూడో గది తలుపు వద్ద పరికరాల మోహన్ బాంబుల తయారీలో అవసరమైన ఇసుకను పడుతున్నాడు. ఈ సమయంలో నలుగురు వ్యక్తులు బాంబులు కొనేందుకు వచ్చి తమకు శక్తివంతమైన బాంబులు కావాలంటూ ఔట్లెట్లో ఉన్న రఘుపతిని కోరారు. దీంతో రఘుపతి బాంబుల తయారీ యూనిట్‌కు వచ్చి చివరి గదిలోకి వెళ్లాడు. కాసేపటికే చివరి గదిలో పెద్ద ఎత్తున పేలుడు సంభవించింది. ఏం జరుగుతుందో తెలిసేలోగా ఆ గదిలో నుంచి పెద్ద ఎత్తున రాళ్లు, రేకు ముక్కలు, ఇనుప చువ్వలు బాణాల్లా వేగంగా గాలిలో దూసుకొచ్చి అక్కడ పని చేస్తున్న వారిని తీవ్రంగా గాయపరిచాయి. తొలి పేలుడు తీవ్రతకు మూడో గది తలుపు వద్ద ఉన్న మోహన్, బాంబులు కొనేందుకు వచ్చిన నలుగురు వ్యక్తులు పరిగెత్తుతూ వెళ్లి కింద పడిపోయారు. కాసేపు నేలపై పడిపోవడం వారి ప్రాణాలను కాపాడింది. బాణాల్లా దూసుకు వచ్చే ఇటుకలు, రాళ్లు, రేకు ముక్కలు, చువ్వల బారి నుంచి వీరు తప్పించుకోగలిగారు. భారీ పేళ్లులు ఆగిపోగానే వీరంతా లేచి దూరంగా పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు. ఇప్పటి వరకు ఎనిమిది మంది మరణించినట్లు గుర్తించగా.. ఇద్దరు మృతులను ధ్రువీకరించేందుకు డీఎన్ఏ టెస్ట్ నిమిత్తం హైదరాబాద్, ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. గాయపడిన నలుగురిలో సురేశ్ పరిస్థితి విషమంగా ఉండగా, మోహన్‌కు కర్ణభేరీ దెబ్బతింది. ప్రమాదం జరగడానికి కొన్ని క్షణాల ముందు కనకరాజు, రాజ్‌కుమార్ అక్కడి నుంచి బయటకు వచ్చారు. -
జీవనాధారమే ఉసురు తీసింది
తణుకు : కుటుంబానికి జీవనాధారంగా నిలిచిన కుటీర పరిశ్రమే వారిని కబళించింది. వారు తయారు చేసిన బాణసంచా భార్యాభర్తల్ని సజీవ దహనం చేసింది. తణుకు మండలం దువ్వలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకున్న బాణసంచా పేలుడు ఘటనలో వేగిరౌతు సత్యనారాయణ (55), ఆయన భార్య మణికుమారి (50) సజీవ దహనమయ్యారు. ఆ సమయంలో బాణసంచా పెద్దఎత్తున పేలడంతో ఇంట్లో ఉన్నవారిని రక్షించేందుకు గ్రామస్తులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వారు నివసిస్తున్న రెండు పోర్షన్ల తాటాకిల్లు నిమిషాల్లోనే అగ్నికి ఆహుతైంది. వారి మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలి బొగ్గుల్లా మారాయి. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన చేరుకుని మంటలను అదుపు చేసినా ప్రయోజనం లేకపోయింది. ఈ ప్రమాదంతో దువ్వలో విషాదఛాయలు అలముకున్నాయి. ఇంట్లోనే నిల్వ ఇంట్లో నిల్వ ఉంచిన బాణసంచా ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని భావిస్తున్నారు. మృతుడు సత్యనారాయణ భార్య రామలక్ష్మి 15 ఏళ్ల క్రితం మరణించడంతో అదే గ్రామానికి చెందిన మణికుమారిని రెండో వివాహం చేసుకున్నాడు. అప్పటినుంచి కుటుంబ సభ్యులకు దూరంగా ఆ గ్రామంలోనే వేరే ఇంట్లో సత్యనారాయణ, మణికుమారి నివాసం ఉంటున్నారు. సత్యనారాయణకు శ్రీనివాస్, రామశివాజీ, హరికృష్ణ అనే కుమారులతోపాటు కుమార్తె చంద్రకళ ఉన్నారు. వీరందరికీ వివాహాలు కావడంతో తణుకు పరిసర ప్రాంతాల్లో స్థిరపడ్డారు. శ్రీనివాస్, రామశివాజీ గ్రామంలోని వయ్యేరు కాలువ గట్టు సమీపంలో బాణసంచా తయారీ కేంద్రాన్ని నడుపుతున్నారు. గతంలో అక్కడే పనిచేసిన అనుభవం ఉన్న సత్యనారాయణ అక్కడి నుంచి ముడిసరుకు తెచ్చుకుని ఇంటి వద్దే బాణసంచా తయాచే చేసి అమ్ముకుంటూ జీవనోపాధి పొందుతున్నాడని స్థానికులు తెలిపారు. 2013లో ఇదే గ్రామంలోని బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో నలుగురు సజీవ దహనమయ్యారు. రక్షించే అవకాశం లేక.. : దువ్వ గ్రామంలోని మెయిన్ రోడ్డును ఆనుకుని ఉన్న వేణుగోపాలస్వామి ఆలయం సమీపంలో తాటాకింట్లో సత్యనారాయణ దంపతులు నివాసం ఉంటున్నారు. ఆ ఇంటి యజమాని తన సామగ్రిని ఒక పోర్షన్లో భద్రపరచుకుని హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఇంటిని ఆనుకుని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఉండటం, ప్రమాదం జరిగిన సమయంలో పెద్దఎత్తున బాణాసంచా పేలడంతో గ్రామస్తులు వారిద్దరినీ రక్షించే సాహసం చేయలేకపోయారు. పేలుడు ధాటికి ఇల్లు ధ్వంసమైంది. భార్యాభర్తలు ఒకే గదిలో బొగ్గులా మాడి ఉండటం చూపరులను కలచివేసింది. స్థానిక ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఘటనా స్థలానికి వెళ్లి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఆద్యంతం నిర్లక్ష్యమే.. బాణసంచా తయారీ కేంద్రాల్లో కనీస నిబంధనలు పాటించకపోవడం.. అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తుండటంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీపావళి సీజన్లో హడావుడి చేయడం మినహా ఆ తర్వాత వీటి గురించి పట్టించుకునే నాథులు ఉండటం లేదు. ఫలితంగా బాణసంచా తయారీ కేంద్రాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. l 2010లో ఉంగుటూరు మండలం వెల్లమిలి్లలోని బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించి 8మంది మృత్యువాత పడ్డారు. ఈ గ్రామం తాటాకు టపాసుల తయారీ కేంద్రంగా పేరొందింది. దాదాపు 40 కుటుంబాలు దీపావళికి రెండు, మూడు నెలలు ముందు నుంచే టపాసుల తయారీలో నిమగ్నమై ఉంటారు. ఈ ఘటన అనంతరం అప్పటి ఎస్సైను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. l 2010లో పెరవలి మండలం అన్నవరప్పాడు గ్రామంలో అనుమతులు లేకుండా ఒక ఇంట్లో నిల్వ ఉంచిన బాణసంచా పేలిపోవడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఖండవల్లి గ్రామానికి చెందిన నలుగురు మృతి చెందారు. l 2012లో ఉండ్రాజవరం మండలం తాడిపర్రులో సత్యనారాయణ అనే వ్యక్తి అన«ధికారికంగా బాణసంచా తయారు చేస్తుండగా జరిగిన ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. l 2013లో తణుకు మండలం దువ్వలో బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో నలుగురు సజీవ దహనమయ్యారు. -
గోకులపాడు మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా
విశాఖ : విశాఖ జిల్లా గోకులపాడు బాణాసంచా పేలుడు సంభవించిన సంఘటనా స్థలాన్ని డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పన పరిహారం అందచేశారు. అలాగే అనధికారికంగా ఉన్న బాణాసంచా గోడౌన్లపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. శాఖల సమన్వయంతో బాణాసంచా గోడౌన్లపై నిఘా తీవ్రతరం చేస్తామని చినరాజప్ప హెచ్చరించారు. కాగా విశాఖ జిల్లా ఎస్.రాయవరం మండలం గోకులపాడులోని ఓ బాణసంచా తయారీ కేంద్రంలో ఆదివారం సాయంత్రం పేలుడు సంభవించిన ఘటనలో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. -
విశాఖలో విషాదం.. ఏడుగురు మృతి
-
విశాఖలో విషాదం..8 మంది మృతి
బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు ఒక్కసారిగా చెలరేగిన మంటలు నలుగురి సజీవ దహనం ఎస్.రాయవరం: విశాఖ జిల్లా ఎస్.రాయవరం మండలం గోకులపాడు గ్రామంలోని ఓ బాణసంచా తయారీ కేంద్రంలో ఆదివారం సాయంత్రం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు సజీవ దహనమయ్యారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. గ్రామానికి సమీపంలోని పొలాల్లో మడుగుల నానాజీ అనే వ్యక్తి ఓ షెడ్లో నిర్వహిస్తున్న బాణసంచా తయారీ కేంద్రంలో ఆదివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు ఆవరించి నలుగురు సజీవ దహనమయ్యారు. ప్రమాదంలో గోకులపాడుకు చెందిన లింగంపల్లి శేషమ్మ (45), నూతి సత్యవతి(35), పాయకరావుపేటకు చెందిన భూపతి సత్తిబాబు(45), దార్లపూడికి చెందిన భూపతిలోవరాజు (38) సజీవ దహనమయ్యారు. సమ్మంగి రమణ అనే వ్యక్తి ఆచూకీ కనిపించలేదు. పేలుడు ధాటికి ఓ వ్యక్తి సమీపంలోనున్న బావిలో పడినట్లు తెలుస్తోంది. గాయపడిని ఆరుగురిని విశాఖలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబాలకు జగన్ సంతాపం హైదరాబాద్ : గోకులపాడు పేలుడు ఘటనలో పలువురు మృతి చెందడంపట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు జగన్ తీవ్ర సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు. బాధిత కుటుంబీకులకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
కంట్రీ ఫెస్ట్
చిన్నపిల్లల కేరింతలు, బాణసంచా పేలుళ్లతో బేగంపేట కంట్రీక్లబ్ హోరెత్తింది. బుధవారం రాత్రి కంట్రీక్లబ్ 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సిల్వర్‌జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా దివాలీ మేళా కార్యక్రమం చేశారు. క్లబ్ సభ్యులు వారి కుటుంబ సభ్యులు ఈ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. మిరుమిట్లుగొలిపే క్రాకర్స్‌తో క్లబ్ ప్రాంగణం మెరిసిపోయింది. సిల్వర్ జూబ్లీ సందర్భంగా క్లబ్ సభ్యులకు మరిన్ని వసతులు కల్పించనున్నట్టు సీఎండీ రాజిరెడ్డి తెలిపారు. - ఫొటోలు: అమర్ -
మచిలీపట్నంలో బాణసంచా పేలుడు!
-
మచిలీపట్నంలో బాణాసంచా పేలుడు
మచిలీపట్నం: వాకతిప్ప దుర్ఘటన జరిగి 24 గంటలు గడవకముందే కృష్ణా జిల్లా మచిలీపట్నంలో బాణాసంచా పేలుడు సంభవించింది. అనుమతి లేకుండా బాణాసంచా తయారుచేస్తున్న ఓ ఇంట్లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో జోగి కిరణ్(22) అనే యువకుడు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు సంభవించిన వెంటనే మంటలు గ్యాస్ సిలిండర్ కు అంటుకోవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. గాయపడిన వారిని జోగి నాగలక్ష్మి, తులసి గా గుర్తించారు. బాధితులంతా ఒకే కుటుంబానికి చెందినవారు. గాయపడిన వారిని సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తూర్పుగోదావరి జిల్లా వాకతిప్పలోని బాణసంచా తయారీ కేంద్రంలో సోమవారం సంభవించిన భారీ విస్పోటంలో 18 మంది దుర్మరణం పాలయ్యారు. -
అశ్వారావుపేట బాణాసంచా దుకాణంలో పేలుడు
ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలోని ఓ బాణాసంచా దుకాణానికి చెందిన గోడౌన్లో శనివారం తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించింది. మంటలు తీవ్రస్థాయిలో ఎగసిపడ్డాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక దళ సిబ్బంది తీవ్రస్థాయిలో శ్రమించాల్సి వచ్చింది. ఈ సంఘటనలో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ప్రమాదానికి కారణాలేంటో మాత్రం ఇంతవరకు తెలియరాలేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.