విశాఖలో విషాదం..8 మంది మృతి
బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు
ఒక్కసారిగా చెలరేగిన మంటలు నలుగురి సజీవ దహనం
ఎస్.రాయవరం: విశాఖ జిల్లా ఎస్.రాయవరం మండలం గోకులపాడు గ్రామంలోని ఓ బాణసంచా తయారీ కేంద్రంలో ఆదివారం సాయంత్రం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు సజీవ దహనమయ్యారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. గ్రామానికి సమీపంలోని పొలాల్లో మడుగుల నానాజీ అనే వ్యక్తి ఓ షెడ్‌లో నిర్వహిస్తున్న బాణసంచా తయారీ కేంద్రంలో ఆదివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి.
దట్టమైన పొగలు ఆవరించి నలుగురు సజీవ దహనమయ్యారు. ప్రమాదంలో గోకులపాడుకు చెందిన లింగంపల్లి శేషమ్మ (45), నూతి సత్యవతి(35), పాయకరావుపేటకు చెందిన భూపతి సత్తిబాబు(45), దార్లపూడికి చెందిన భూపతిలోవరాజు (38) సజీవ దహనమయ్యారు. సమ్మంగి రమణ అనే వ్యక్తి ఆచూకీ కనిపించలేదు. పేలుడు ధాటికి ఓ వ్యక్తి సమీపంలోనున్న బావిలో పడినట్లు తెలుస్తోంది. గాయపడిని ఆరుగురిని విశాఖలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
మృతుల కుటుంబాలకు జగన్ సంతాపం
హైదరాబాద్ : గోకులపాడు పేలుడు ఘటనలో పలువురు మృతి చెందడంపట్ల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు జగన్ తీవ్ర సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు. బాధిత కుటుంబీకులకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.