crackers godown
-
బాణాసంచా గోడౌన్లో పేలిన సిలిండర్.. ఆరుగురికి తీవ్ర గాయాలు
-
బాణాసంచా గోడౌన్లో మరో ప్రమాదం
దీపావళి దగ్గర పడేకొద్దీ తమిళనాడులో బాణాసంచా గోడౌన్లలో అగ్నిప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. గురువారం శివకాశీలో ఘోర అగ్నిప్రమాదం సంభవించి తొమ్మిది మంది మరణించిన ఘటనను మరువక ముందే అదే రాష్ట్రంలోని కోయంబత్తూరులో శుక్రవారం మరో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా మరో పది మంది వరకు తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది. ఈ ప్రమాదానికి కారణం ఏంటో తెలియరాలేదు. గోడౌన్లో ఇంకా కొందరు చిక్కుకుపోయి ఉంటారని అంటున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
బాణాసంచా గోడౌన్లో మరో ప్రమాదం
-
పేలుళ్లతో దద్దరిల్లిన శివకాశి
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శివకాశిలో బాణాసంచా నిల్వచేసే ఓ గోడౌన్లో భారీ అగ్నిప్రమాదం సంభవించి ఎనిమిది మంది అక్కడికక్కడే అగ్నికి ఆహుతయ్యారు. వారిలో ఐదుగురు మహిళలున్నారు. మరో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 6 మంది పరిస్థితి సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. దీపావళి అనగానే ముందుగా గుర్తుకొచ్చేవి శివకాశిలో తయారయ్యే టపాసులు. భారతదేశంతో పాటు ప్రపంచంలోని పలు దేశాలకు కూడా టపాసులు సరఫరా చేసే తమిళనాడులోని శివకాశిలో దాదాపు ప్రతియేటా ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. తాజాగా మరోసారి ఇదే తరహా ప్రమాదం జరిగింది. శివకాశి శివార్లలో భారీస్థాయిలో మందుగుండు సామగ్రి నిల్వ చేసే ఓ గోడన్లో మంటలు చెలరేగాయి. అందులో దాదాపు 30 మంది వరకు పనివాళ్లు ఉన్నట్లు సమాచారం. అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించారు. మరో 8 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని సమీపంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో రెండు లారీలు, 20 వరకు ద్విచక్ర వాహనాలు కూడా తగలబడిపోయాయి. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ గోడౌన్ పక్కనే ఒక ప్రైవేటు ఆస్పత్రి కూడా ఉంది.. దానికి కూడా మంటలు వ్యాపించడంతో రోగులను వేరేచోటుకు తరలించారు. స్థానికులు అక్కడకు చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ అని అంటున్నారు. సంవత్సరం పొడవునా తయారుచేసిన టపాసులను శివారు ప్రాంతాల్లోని గోడౌన్లలో నిల్వచేస్తుంటారు. దీపావళి సమీపిస్తుండటంతో విక్రయాలు భారీఎత్తున కొనసాగుతుంటాయి. ఈ సమయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదాలు పెద్దస్థాయిలో జరుగుతాయి. ఇప్పుడు కూడా అలాగే జరిగినట్లు తెలుస్తోంది. -
పేలుళ్లతో దద్దరిల్లిన శివకాశి.. ఆరుగురి మృతి
-
బాణాసంచా గోడౌన్లో మంటలు
-
గోడౌన్లో అగ్నిప్రమాదం: భారీ ఆస్తి నష్టం
కడప : వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు ఆటోనగర్ సమీపంలోని బాణాసంచా గోడౌన్లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో అగ్నికీలలు భారీగా ఎగసిపడుతున్నాయి. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని.... మంటలార్పుతున్నారు. ఈ ప్రమాదంలో రూ. 10 లక్షల ఆస్తి నష్టం సంభవించిందని గోడౌన్ యజమాని చెప్పారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బాణాసంచా గోదాము సీజ్: ఒకరి అరెస్ట్
ఎంవీపీ కాలనీ (విశాఖ) : విశాఖ నగరం గాజువాక ప్రాంతం బీసీరోడ్డులోని ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన బాణాసంచాను పోలీసులు పట్టుకున్నారు. వై.శ్రీనివాసరావు అనే వ్యక్తి తన ఇంట్లో రూ.1.50 లక్షల విలువైన బాణాసంచాను ఎటువంటి అనుమతులు లేకుండా నిల్వ ఉంచినట్లు సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. బాణాసంచాను సీజ్ చేసి శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసును గాజువాక పోలీసులకు బదిలీ చేశారు. -
గోకులపాడు మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా
విశాఖ : విశాఖ జిల్లా గోకులపాడు బాణాసంచా పేలుడు సంభవించిన సంఘటనా స్థలాన్ని డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పన పరిహారం అందచేశారు. అలాగే అనధికారికంగా ఉన్న బాణాసంచా గోడౌన్లపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. శాఖల సమన్వయంతో బాణాసంచా గోడౌన్లపై నిఘా తీవ్రతరం చేస్తామని చినరాజప్ప హెచ్చరించారు. కాగా విశాఖ జిల్లా ఎస్.రాయవరం మండలం గోకులపాడులోని ఓ బాణసంచా తయారీ కేంద్రంలో ఆదివారం సాయంత్రం పేలుడు సంభవించిన ఘటనలో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. -
విశాఖలో విషాదం.. ఏడుగురు మృతి
-
విశాఖలో విషాదం..8 మంది మృతి
బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు ఒక్కసారిగా చెలరేగిన మంటలు నలుగురి సజీవ దహనం ఎస్.రాయవరం: విశాఖ జిల్లా ఎస్.రాయవరం మండలం గోకులపాడు గ్రామంలోని ఓ బాణసంచా తయారీ కేంద్రంలో ఆదివారం సాయంత్రం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు సజీవ దహనమయ్యారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. గ్రామానికి సమీపంలోని పొలాల్లో మడుగుల నానాజీ అనే వ్యక్తి ఓ షెడ్లో నిర్వహిస్తున్న బాణసంచా తయారీ కేంద్రంలో ఆదివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు ఆవరించి నలుగురు సజీవ దహనమయ్యారు. ప్రమాదంలో గోకులపాడుకు చెందిన లింగంపల్లి శేషమ్మ (45), నూతి సత్యవతి(35), పాయకరావుపేటకు చెందిన భూపతి సత్తిబాబు(45), దార్లపూడికి చెందిన భూపతిలోవరాజు (38) సజీవ దహనమయ్యారు. సమ్మంగి రమణ అనే వ్యక్తి ఆచూకీ కనిపించలేదు. పేలుడు ధాటికి ఓ వ్యక్తి సమీపంలోనున్న బావిలో పడినట్లు తెలుస్తోంది. గాయపడిని ఆరుగురిని విశాఖలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబాలకు జగన్ సంతాపం హైదరాబాద్ : గోకులపాడు పేలుడు ఘటనలో పలువురు మృతి చెందడంపట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు జగన్ తీవ్ర సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు. బాధిత కుటుంబీకులకు ఎక్స్గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.