గోడౌన్లో అగ్నిప్రమాదం: భారీ ఆస్తి నష్టం | fire accident in crackers godown in proddatur | Sakshi
Sakshi News home page

గోడౌన్లో అగ్నిప్రమాదం: భారీ ఆస్తి నష్టం

Published Fri, Jan 22 2016 8:36 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

fire accident in crackers godown in proddatur

కడప : వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు ఆటోనగర్ సమీపంలోని బాణాసంచా గోడౌన్లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో అగ్నికీలలు భారీగా ఎగసిపడుతున్నాయి. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని.... మంటలార్పుతున్నారు.  ఈ ప్రమాదంలో రూ. 10 లక్షల ఆస్తి నష్టం సంభవించిందని గోడౌన్ యజమాని చెప్పారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement