బాణాసంచా గోడౌన్లో మరో ప్రమాదం
Published Fri, Oct 21 2016 6:15 PM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM
దీపావళి దగ్గర పడేకొద్దీ తమిళనాడులో బాణాసంచా గోడౌన్లలో అగ్నిప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. గురువారం శివకాశీలో ఘోర అగ్నిప్రమాదం సంభవించి తొమ్మిది మంది మరణించిన ఘటనను మరువక ముందే అదే రాష్ట్రంలోని కోయంబత్తూరులో శుక్రవారం మరో ప్రమాదం సంభవించింది.
ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా మరో పది మంది వరకు తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది. ఈ ప్రమాదానికి కారణం ఏంటో తెలియరాలేదు. గోడౌన్‌లో ఇంకా కొందరు చిక్కుకుపోయి ఉంటారని అంటున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement