బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు.. పలువురు మృతి | Massive Blast Rocked At Duttapukur In West Bengal | Sakshi
Sakshi News home page

బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు.. పలువురు మృతి

Published Sun, Aug 27 2023 12:01 PM | Last Updated on Sun, Aug 27 2023 12:24 PM

Massive Blast Rocked At Duttapukur In West Bengal - Sakshi

కోల్‌కత్తా: పశ్చిమ బెంగాల్‌లో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందినట్టు తెలుస్తోంది. మరికొందరు గాయపడినట్టు సమాచారం. 

వివరాల ప్రకారం.. పశ్చిమబెంగాల్‌లోని నార్త్ 24 పరగణా జిల్లాలోని దత్తపుకూర్‌లో అక్రమ ఫైర్ క్రాకర్స్ ఫ్యాక్టరీలో ఆదివారం ఉదయం పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే ఫైర్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఇక, ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందగా మరికొందరు గాయపడ్డారు. కాగా, మరిన్ని మరణాలు పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. మరోవైపు.. బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు ధాటికి చుట్టుపక్కల ఉన్న ఇళ్లు కూడా పాక్షికంగా దెబ్బతిన్నట్టు అధికారులు చెబుతున్నారు. 

ఇది కూడా చదవండి: బయట వర్షం.. బస్సులో గొడుగు పట్టిన డ్రైవర్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement