North 24 Parganas district
-
బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు.. పలువురు మృతి
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్లో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందినట్టు తెలుస్తోంది. మరికొందరు గాయపడినట్టు సమాచారం. వివరాల ప్రకారం.. పశ్చిమబెంగాల్లోని నార్త్ 24 పరగణా జిల్లాలోని దత్తపుకూర్‌లో అక్రమ ఫైర్ క్రాకర్స్ ఫ్యాక్టరీలో ఆదివారం ఉదయం పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఇక, ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందగా మరికొందరు గాయపడ్డారు. కాగా, మరిన్ని మరణాలు పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. మరోవైపు.. బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు ధాటికి చుట్టుపక్కల ఉన్న ఇళ్లు కూడా పాక్షికంగా దెబ్బతిన్నట్టు అధికారులు చెబుతున్నారు. #Breaking: A massive blast rocked Duttapukur in North 24 pgs district of #WestBengal following a fire reported inside an illegal fire crackers factory. Four people dead in the blast, death toll likely to increase. Several houses adjoining the illegal fire crackers factory have… pic.twitter.com/T6FNWMkua4 — Pooja Mehta (@pooja_news) August 27, 2023 ఇది కూడా చదవండి: బయట వర్షం.. బస్సులో గొడుగు పట్టిన డ్రైవర్! -
భిక్షమెత్తుకుంటున్న మాజీ ముఖ్యమంత్రి మరదలు
కలకత్తా: పదేళ్ల పాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక నాయకుడిగా వెలుగొందారు. అలాంటి వ్యక్తి భార్య చెల్లెలు అంటే డాబుగీబు దర్పంతో ఉంటుందని అనుకుంటే పొరపాటే. ఆమె ఫుట్‌పాత్‌పై భిక్షమెత్తుకుంటున్న దౌర్భాగ్యపు పరిస్థితి. పశ్చిమబెంగాల్లోని ఉత్తర 24 పరగణాల జిల్లా బరాబజార్ ప్రాంతంలోని దున్లాప్‌లో ఆమె మాసిపోయిన దుస్తులతో కనిపించింది. ఫుట్‌పాత్‌పైనే ఆమె జీవనం గడుపుతున్న దుస్థితి. చదవండి: మహిళలు జన్మనివ్వడానికే.. మంత్రులుగా పనికి రారు బుద్ధదేవ్ భట్టాచార్య పదేళ్ల పాటు బెంగాల్ ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆయన భార్య మీరా. ఆమె సోదరినే ఇరా బసు. ఫుట్‌పాత్‌పై ఉంటున్న ఇరా వైరాలజీలో పీహెచ్డీ చేసింది. ఆమె అద్భుతంగా ఆంగ్లంతోపాటు బెంగాలీ మాట్లాడగలదు. అంతేకాదు రాష్ట్ర స్థాయి టేబుల్ టెన్నీస్ క్రీడాకారిణి. క్రికెట్లో కూడా రాష్ట్రస్థాయిలో ఆడింది. అలాంటి ఇరా రెండేళ్లుగా ఫుట్‌పాత్‌పై నివసిస్తోంది. 1976లో ప్రియానాథ్ బాలిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా ఉద్యోగ జీవితం ప్రారంభించిన ఇరా బసు 2009లో పదవీ విరమణ పొందారు. ఆమె టీచర్‌గా ఉన్నప్పుడు బావ బుద్ధదేవ్ భట్టాచార్య ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో బరానగర్‌లో ఉంటున్న ఆమె ఖర్దాలోని లిచూ బగాన్‌కు మకాం మార్చారు. కొన్నాళ్లకే ఏమైందో ఏమోగానీ ఆమె పరిస్థితి తారుమారైంది. ఇప్పుడు దున్లాప్‌లోని ఫుట్‌పాత్‌పై జీవనం సాగిస్తోంది. ఆమె అలా జీవనం సాగించడంపై ఆమె పనిచేసిన ప్రియానాథ్ పాఠశాల హెడ్ మిస్ట్రెస్ కృష్ణకాలి చందా స్పందించారు. ‘ఇరా బసు మా పాఠశాలలోనే బోధించారు. పదవీ విరమణ అనంతరం పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోమని చెబితే ఇంతవరకు ఆమె పత్రాలు సమర్పించలేదు. ఆమె ఎందుకు పింఛన్‌కు దరఖాస్తు చేసుకోలేదో తెలియదు’ అని పేర్కొన్నారు. అయితే మొన్న ఉపాధ్యాయ దినోత్సవం నాడు మాత్రం ఇరాబసును కొందరు స్థానిక సంఘాల నాయకులు సన్మానించారు. పూలమాల.. శాలువా వేసి సన్మానించారు. ఆ సమయంలో ఇరా బసు మాట్లాడింది. ‘నన్ను ఎంతో మంది ఉపాధ్యాయులు, విద్యార్థులు గుర్తు చేసుకుంటున్నారు. ఇంకా నన్ను ప్రేమిస్తున్నారు. కొందరు నన్ను కౌగిలించుకుని కన్నీళ్లు పెడతారు’ అని తెలిపింది. ఈ సందర్భంగా తన బావ బుద్ధదేవ్ భట్టాచార్య గురించి మాట్లాడింది. ‘నేను టీచర్‌గా ఉన్నప్పుడే అతడి నుంచి ఎలాంటి లబ్ధి పొందను. నా కుటుంబ వివరాలు తెలుసుకున్న వారందరూ నాకు వీఐపీ గుర్తింపు ఇవ్వనవసరం లేదు’ అని స్పష్టం చేసింది. ఆమె ఫుట్‌పాత్‌పై జీవిస్తున్నది తెలుసుకున్న అధికారులు ఆమెను వెంటనే అంబులెన్స్‌లో కలకత్తాకు తీసుకెళ్లారు. ఆమెకు వైద్యారోగ్య పరీక్షలు చేయించి చికిత్స అందించే అవకాశం ఉంది. ఆమె బాగోగులు ప్రభుత్వం చూసుకునే అవకాశం ఉంది. -
మెడికల్ షాపులో భార్య రాసలీలలు.. తట్టుకోలేక అతడిని..
కలకత్తా: కట్టుకున్న భర్త ఉండగా ఓ మెడికల్ దుకాణం యజమానితో భార్య వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. విషయం తెలిసిన భర్త రెండు మూడు సార్లు వారించాడు. భార్యతో సంబంధాలు కొనసాగిస్తున్న వ్యక్తిని పలుమార్లు హెచ్చరించాడు. అయినా ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఇక తట్టుకోలేక అతడిని అంతమొందించాడు. ఈ సంఘటన పశ్చిమబెంగాల్లోని తూర్పు 24 పరగణాల జిల్లా అశోక్‌నగర్‌లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అశోక్‌నగర్‌లో అపు కహార్ తన భార్యతో కలిసి నివసిస్తున్నాడు. అయితే భార్యకు శ్రీకృష్ణాపూర్ ప్రాంతంలో ఉన్న మెడికల్ షాప్ యజమాని మిలాన్ ఘోష్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆయన మెడికల్ దుకాణం నిర్వహిస్తుండడంతో తరచూ ఆమె అక్కడకు వెళ్లేది. కొన్నాళ్లు విషయం భర్త కహర్‌కు తెలిసింది. అతడు మిలాన్‌ను హెచ్చరించాడు. అయినా కూడా వారిద్దరూ సంబంధం కొనసాగిస్తున్నారు. తీవ్ర ఆగ్రహంతో శుక్రవారం మధ్యాహ్నం మిలాన్‌ను చంపేందుకు బయల్దేరాడు. రద్దీగా ఉండే నోట్‌ని మార్కెట్‌కు షాపింగ్ కోసం వెళ్లిన మిలాన్ ఘోష్ వెంటపడ్డాడు. అందరూ చూస్తుండగానే మిలాన్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు. అతడిని స్థానికులు నిలువరించారు. గాయాలపాలైన మిలాన్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. దాడికి పాల్పడిన అఫు కహార్‌ను స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బిర్యానీ బిల్లు అడిగాడని హత్య
కోల్‌కతా : బిర్యానీ డబ్బులు అడిగినందుకు హోటల్ యజమానిని కాల్చి చంపిన ఘటన పశ్చిమ బెంగాల్లో కలకలం రేపింది. ఉత్తర 24 పరగణ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సంజయ్ మండల్ అనే వ్యక్తి స్థానికంగా హోటల్ నిర్వహిస్తున్నాడు. ఆదివారం రాత్రి హోటల్‌కు వచ్చిన నలుగురు కస్టమర్లు ప్లేట్ బిర్యానీ ఆర్డర్ చేశారు. బిల్లు 190 రూపాయలు అయింది. అయితే తిన్న తర్వాత డబ్బులు కట్టకుండానే కస్టమర్లు వెళ్లిపోతుండగా.. వారిని ఆపిన సంజయ్ బిల్లు కట్టిన తర్వాతే ఇక్కడి నుంచి వెళ్లాలంటూ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కోపోద్రిక్తుడైన మహమ్మద్ ఫిరోజ్ అనే కస్టమర్ తన వద్ద ఉన్న తుపాకీతో సంజయ్‌ను కాల్చగా.. అతడు అక్కడిక్కడే మరణించాడు. సంజయ్ తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే కేవలం బిర్యానీ బిల్లు కోసమే ఈ హత్య జరిగిందా లేదా మరేదైనా కారణముందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఫేస్‌బుక్కా? ఫేక్‌బుక్కా?
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో నెలకొన్న మత ఉద్రిక్తతలకు సోషల్ మీడియాలో, ముఖ్యంగా ఫేస్బుక్లో ప్రచారమవుతున్న తప్పుడు వార్తలు ఆజ్యం పోస్తున్నాయి. ఓ భోజ్‌పురి సినిమాలో ఓ యువతి పైట లాగుతున్న దృశ్యాన్ని పోస్ట్ చేసి మత ఘర్షణలు చెలరేగిన 24 పరిగణాల జిల్లాలో ఓ హిందూ యువతి పైటలాగుతున్న ముష్కరలు అంటూ కామెంట్ పెట్టారు. ఆ దృశ్యంలో యువతి మేకప్ వేసుకొని ఉండడం, పిల్లలు, పెద్దలంతా కలసి ఆ దృశ్యాన్ని చూస్తుంటే అది సినిమా షూటింగ్ లేదా సినిమాలో స్టిల్ అని కచ్చితంగా అర్థమవుతుంది. ఎవరో ఆకతాయి చేసిన ఈ పోస్ట్‌ను సాక్షాత్తు బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్ వర్గియా సోషల్ మీడియాలో సర్కులేట్ చేయడం ఆశ్చర్యం కలిగించింది. మొహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద చిత్రాన్ని వేసి ప్రస్తుత బెంగాల్ మత ఉద్రిక్తతలకు కారణమైన యువకుడి తల్లిదండ్రులను 24 పరిగణాల జిల్లాలోని బడూరియాలో ఎలా హింసించారో చూడండి అంటూ ఫేస్బుక్లో మరో చిత్రాన్ని పోస్ట్‌చేసి కామెంట్ రాశారు. అసలు ఆ యువకుడికి తల్లే లేదని ఇరుగుపొరుగువారు చెబుతున్నారు. పైగా ఆ చిత్రం బంగ్లాదేశ్‌లో 2014లో జరిగిన ఓ గొడవకు సంబంధించినదని ఆన్లైన్లో తప్పుడు వార్తలను వెతికిపట్టుకొనే సైట్ ‘ఆల్ట్‌న్యూస్ డాట్ ఇన్’ వెల్లడించింది. ఒకప్పుడు శాంతి, సౌభ్రాతత్వాలు విరాజిల్లిన బెంగాల్ నేడు అన్ని రంగాల్లో విఫలమైందన్న వ్యాఖ్యలతో ఆటోట్రాలీ తగులబడుతున్న దశ్యాన్ని పోస్ట్ చేశారు. ఈ తగులబడుతున్న దశ్యం ఈనాటిది కాదు. నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రాష్ట్రంలో 2002లో జరిగిన అల్లర్లకు సంబంధించినది. దీన్ని బీజీపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఫేస్బుక్ ఫేక్బుక్గా మారుతోందని, తాను ఫేస్‌బుక్‌ను ఎంతైనా ప్రేమిస్తానని, ఫేక్బుక్ను ద్వేషిస్తానని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేకపోలేదు. -
ఈ భయానక పరిస్థితి ఎప్పుడు మారుతుందో?
స్వేచ్ఛా భారతంలో పేదవాడికి వైద్యం అందని మానిపండులా మారింది. శాస్త్రసాంకేతిక రంగాల్లో వడివడిగా అడుగులు వేస్తున్న భారతావని లేనోడికి మెరుగైన వైద్యం అందించే విషయంలో ఇంకా నేలచూపులు చూస్తోంది. నేతలు మారినా పేదల తలరాతలు మారడం లేదు. గరీబుకు గోరంత వైద్యం అందించే దవాఖాలు నేటికి దొరక్కపోవడం దేశ ప్రజల దౌర్భగ్యం. పేరు గొప్ప పాలకుల నిష్క్రియ నిరుపేదల పాలిట శాపంగా మారుతోంది. కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకునే స్తోమతలేక రోగోపశమనం కోసం సర్కారీ దవాఖాన మెట్లు ఎక్కుతున్న పేద రోగులకు చీదరింపులు ఎదురవుతున్నాయి. ఆస్పత్రిలో చేరే లోపు బడుగుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా పాలకులకు చీమ కుట్టినట్టు లేకపోవడం శోచనీయం. యథారాజ... చందంగా లంచాలు మరిగిన సర్కారీ సిబ్బంది బీదసాదల చావులకు కారణమవుతున్నారు. లంచం ఇవ్వలేదన్న అక్కసుతో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి సిబ్బంది ఇద్దరు రోగుల పట్ల నిర్దయగా వ్యవరించారు. అత్యవసరంగా వైద్యం అందాల్సివున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. సరైన వైద్యం అందకపోవడంతో లాల్‌బజార్ కు చెందిన డప్పు వాయిద్యకారుడు భార్య మంచానికే పరిమితమయింది. ఇక పశ్చిమ బెంగాల్ లో ఉత్తర 24 పరగణాల జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ మహిళ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వైద్యం కోసం వచ్చిన మహిళను అంబులెన్స్ డ్రైవర్ రోడ్డు పక్కన పడేసిపోవడంతో ఆమె మృతి చెందింది. ఇలా చెప్పుకుంటు పోతే ఎన్నో ఉదంతాలు సర్కారీ నిష్పూచికి నిలువుటద్దంలా నిలుస్తాయి. భగవంతుడా.. ఈ భయానక పరిస్థితి ఎప్పుడు మారుతుందో? -
గ్యాంగ్ రేప్ కేసులో ఇద్దరు నిందితులు అరెస్ట్
టీనేజ్ యువతిపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన ఇద్దరు యువకులను హౌరా, కొల్కత్తా స్టేషన్ పరిసర ప్రాంతాల్లో గత రాత్రి అరెస్ట్ చేసినట్లు పోలీసులు శుక్రవారం ఇక్కడ వెల్లడించారు. వారిని కోర్టులో హారుపరుచగా న్యాయమూర్తి నిందితులకు రిమాండ్ విధించారని చెప్పారు. పోలీసుల కథనం ప్రకారం... 24 పరిగణ జిల్లాలోని రాజర్ ప్రాంతంలో ప్రైవేట్ ఆసుపత్రిలో అత్యాచారానికి బాధితురాలు వైద్య సహాయకురాలిగా విధులు నిర్వర్తిస్తుందని తెలిపారు. అయితే ఆ యవతి విధులు నిర్వహించిన అనంతరం నివాసం చేరుకునేందుకు బిదాన్ నగర్ రైల్వే స్టేషన్ చేరుకునేందుకు ప్రవేట్ వాహనం ఎక్కింది. ఆ వాహనం కొంత దూరం వెళ్లిన తర్వాత అప్పటికే ఆ వాహనంలో ఉన్న ఇద్దరు యువకులు ఆ యువతిపై డ్రైవర్ కళ్ల ఎదుటే సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. దాంతో ఆ యువతి సృహ కొల్పోయింది. సృహ వచ్చి చూసుకునే సరికి కొల్‌కత్తాలోని వ్యభిచార కేంద్రమైన సోనాగాచ్లోని గదిలో పడి ఉండటంతో ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. అందులో భాగంగా ఇద్దరు యువకులను పోలీసులు గత రాత్రి అరెస్ట్ చేశారు.