
కలకత్తా: కట్టుకున్న భర్త ఉండగా ఓ మెడికల్ దుకాణం యజమానితో భార్య వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. విషయం తెలిసిన భర్త రెండు మూడు సార్లు వారించాడు. భార్యతో సంబంధాలు కొనసాగిస్తున్న వ్యక్తిని పలుమార్లు హెచ్చరించాడు. అయినా ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఇక తట్టుకోలేక అతడిని అంతమొందించాడు. ఈ సంఘటన పశ్చిమబెంగాల్‌లోని తూర్పు 24 పరగణాల జిల్లా అశోక్‌నగర్‌లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
అశోక్‌నగర్‌లో అపు కహార్ తన భార్యతో కలిసి నివసిస్తున్నాడు. అయితే భార్యకు శ్రీకృష్ణాపూర్ ప్రాంతంలో ఉన్న మెడికల్ షాప్ యజమాని మిలాన్ ఘోష్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆయన మెడికల్ దుకాణం నిర్వహిస్తుండడంతో తరచూ ఆమె అక్కడకు వెళ్లేది. కొన్నాళ్లు విషయం భర్త కహర్‌కు తెలిసింది. అతడు మిలాన్‌ను హెచ్చరించాడు. అయినా కూడా వారిద్దరూ సంబంధం కొనసాగిస్తున్నారు.
తీవ్ర ఆగ్రహంతో శుక్రవారం మధ్యాహ్నం మిలాన్‌ను చంపేందుకు బయల్దేరాడు. రద్దీగా ఉండే నోట్ని మార్కెట్‌కు షాపింగ్ కోసం వెళ్లిన మిలాన్ ఘోష్ వెంటపడ్డాడు. అందరూ చూస్తుండగానే మిలాన్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు. అతడిని స్థానికులు నిలువరించారు. గాయాలపాలైన మిలాన్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. దాడికి పాల్పడిన అఫు కహార్‌ను స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment