భారత్‌-పాక్‌ మ్యాచ్‌ పై కేంద్రమంత్రి కీల​‍క వాఖ్యలు.. | India Should Not Play Matches with Pakistan in T20 World Cup says Ramdas Athawale | Sakshi
Sakshi News home page

T20 WC IND Vs PAK: భారత్‌-పాక్‌ మ్యాచ్‌ పై కేంద్రమంత్రి కీల​‍క వాఖ్యలు..

Published Wed, Oct 20 2021 9:58 AM | Last Updated on Wed, Oct 20 2021 2:13 PM

India Should Not Play Matches with Pakistan in T20 World Cup says Ramdas Athawale - Sakshi

Ramdas Athawale Comments on India Vs Pakistan T20 World Cup Match: టీ20 ప్రపంచకప్‌-2021లో ఈ నెల 24న జరగనున్న దాయాదుల పోరు నేపథ్యంలో కేంద్రమంత్రి రాందాస్ అథవాలే కీలక వాఖ్యలు  చేశారు. జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరుగుతున్నాయని, వలస కూలీల హత్యలతో లోయ దద్దరిల్లుతుందని అన్నారు. ఈ క్రమంలో భారత్‌, పాకిస్తాన్‌తో మ్యాచ్‌ ఆడకూడదని అథవాలే పేర్కొన్నారు.

"పొరుగు దేశం పాకిస్తాన్‌ ఎలాంటి గుణ పాఠాలు నేర్చుకోలేదు. భారత దేశంపై వారి ఉగ్రచర్యలు ఆగడంలేదు. కాశ్మీర్‌ లోయలో పాకిస్తాన్ తన ఉగ్రవాద  కార్యకలాపాలను నిలిపివేయకపోతే, భారత్‌ ఆదేశం పై యుద్దం ప్రకటించాలి. జమ్మూ కాశ్మీర్‌లో  వలస కూలీలపై దాడులు జరుగుతున్నాయి. లోయలో అభివృద్ధిని అనుమతించకూడదనేది పాకిస్తాన్ ఎత్తుగడ. ఇటువంటి పరిస్థితుల్లో భారత్‌.. పాకిస్తాన్‌తో మ్యాచ్‌ ఆడకూడదు’’ అని విలేకరుల సమావేశంలో అథవాలే చెప్పారు.

ఈ విషయంపై  బీసీసీఐ కార్యదర్శి జై షాతో చర్చిస్తానని అథవాలే తెలిపారు. కాగా  ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా భారత్‌- పాకిస్తాన్‌ మ్యాచ్‌పై ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే, టీ20 ప్రపంచకప్‌-2021లో భాగంగా భారత్‌-పాక్‌ల మధ్య అక్టోబర్‌ 24న జరగాల్సిన మ్యాచ్‌ను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు అధికమవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా #BanPakCricket హ్యాష్‌ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. అయితే, ఐసీసీ టోర్నీలో ఓ జట్టుతో ఆడలేమని చెప్పడం సరికాదని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి

చదవండి: T20 WC IND Vs PAK: ఓ పక్క మన వాళ్లను చంపుతుంటే, పాక్‌తో టీ20 అవసరమా..?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement