అక్టోబర్‌లో కశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా | Jammu and Kashmir statehood may be restored in October | Sakshi
Sakshi News home page

అక్టోబర్‌లో కశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా

Published Fri, Aug 9 2024 5:12 AM | Last Updated on Fri, Aug 9 2024 5:12 AM

Jammu and Kashmir statehood may be restored in October

కేంద్ర మంత్రి అథవాలె వెల్లడి

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌కు అక్టోబర్‌లో రాష్ట్ర హోదా పునరుద్ధరణతోపాటు అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత శాఖ సహాయ మంత్రి రాందాస్‌ అథవాలె చెప్పారు. శ్రీనగర్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లా డారు. ‘మహారాష్ట్ర, హరియాణా, జార్ఖండ్‌ రాష్ట్రాల అసెంబ్లీలకు అక్టోబర్‌లో ఎన్నికలు జరగనున్నాయి. 

వీటితోపాటు జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి. అప్పుడే జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ ప్రకటన వెలువడే అవకాశాలు కూడా ఉన్నాయి’అని మంత్రి అథవాలె వివరించారు. జమ్మూకశ్మీర్‌ రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామంటూ గతంలో ఆర్టికల్‌ 370 రద్దు సమయంలోనే హోం మంత్రి అమిత్‌ షా ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement