ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న 2025 మహా కుంభమేళా(Maha Kumbh Mela2025) కు ప్రపంచవ్యాప్తంగా భక్తులు తరలివస్తున్నారు. జనవరి 13న ప్రారంభమైన ఈ మహా కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు కొనసాగనున్న ఈ ఆధ్యాత్మిక వేడుకకు కేవలం భారతీయులేకాదు, సాధువులు కూ విదేశీ ప్రముఖులు, సందర్శకులు పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. అయితే ఈ మహా కుంభమేళాలో రష్యాకు చెందిన "కండరాల బాబా" విశేషంగా నిలుస్తున్నాడు. ఈయన ఫోటోలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
కాషాయ దుస్తులు ధరించి, కండలుతిరిగిన దేహంతో కనిపిస్తున్న ఈయన స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాడు. భుజాన పెద్ద బ్యాగ్, మెడలో రుద్రాక్ష మాల, ముఖంలో కాంతివంతమైన తేజస్సు, ఏడు అడుగుల అందమైన రూపంతో ఈ సాధువు ఆకర్షిస్తున్నాడు. కెవిన్‌బుబ్రిస్కీగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ అయిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో త్వరగా వైరల్ అయ్యాయి.
కండల బాబా అసలు పేరు ఆత్మ ప్రేమ్ గిరి మహారాజ్(Atma Prem Giri Maharaj) ఈ "కండల బాబా" రష్యాకుచెందిన వాడు. ఇపుడు నేపాల్‌లో నివసిస్తున్నాడు. అతను దాదాపు 30 సంవత్సరాల క్రితం హిందూ మతాన్ని స్వీకరించాడు. బలమైన శరీరంతో ఉండటంతో చాలా మంది అతనిని పరశురాముడి అవతారంగా పిలుస్తారట. ఆత్మ ప్రేమగిరి మహారాజ్ ఒకప్పుడు రెజ్లర్. తన బోధనా వృత్తిని విడిచి పెట్టి మరీ నేపాల్‌లో హిందూ మతాన్ని ప్రోత్సాహం కోసం కృషి చేస్తున్నారు.ఒకప్పుడు పైలట్ బాబా శిష్యుడిగా ఉన్న ప్రేమ్‌గిరి మహారాజ్‌ప్రస్తుతం జునా అఖారా సభ్యుడు. ఆత్మ ప్రేమ్ గిరి గంటల తరబడి వ్యాయామం చేయడానికి ఇష్టపడతాడట.
కాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, ప్రయాగ్‌రాజ్ పుణ్యక్షేత్రంలో మహాకుంభమేళాఅంగరంగ వైభవంగా జరుగుతోంది. పవిత్ర గంగా, యమున, సరస్వతి సంగమంలో స్నానాలు, "హర హర మహాదేవ" అనే భక్త కోటి నినాదాలతో మహాకుంభమేళా మార్మోగుతోంది.
ఇదీ చదవండి: అత్యధిక జీతాన్ని వద్దనుకొని.. ఇపుడు ఏడాదికి రూ. 30 లక్షలు
Comments
Please login to add a commentAdd a comment