బన్నీ vs మహేష్ | Allu arjun vs Mahesh babu | Sakshi
Sakshi News home page

బన్నీ vs మహేష్

Published Sun, Apr 23 2017 10:47 AM | Last Updated on Tue, Sep 5 2017 9:31 AM

బన్నీ vs మహేష్

బన్నీ vs మహేష్

టాలీవుడ్ స్టార్ హీరోలు మహేష్ బాబు, అల్లు అర్జున్లు పక్కా ప్లాన్తో దూసుకుపోతున్నారు. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే నెక్ట్స్ సినిమా ను రెడీ చేసేస్తున్నారు. అంతేకాదు షూటింగ్ కూడా ప్రారంభం కాకముందు రిలీజ్ డేట్ల కోసం ఖర్చీఫ్ వేసేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో చేస్తున్న స్పైడర్ సినిమాను ఆగస్టు 11న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అను నేను సినిమాను స్టార్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి 2018 సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, హరీష్ శంకర్ దర్శకత్వంలో డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చింది. అయితే నిర్మాణాంతర కార్యక్రమాలు ఎక్కువ సమయం పడుతుందన్న ఆలోచనతో డీజే జూన్ 23న రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా తరువాత వక్కంతం వంశీ దర్శకత్వంలో సినిమాను ఎనౌన్స్ చేశాడు బన్నీ. నాపేరు సూర్య నా ఇళ్లు ఇండియా అనే టైటిల్ను పరిశీలిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను కూడా ఆరు నెలల్లో పూర్తి చేసి 208 సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. గత రెండేళ్లుగా సంక్రాంతి సీజన్లో భారీ పోటిని చూస్తున్న ప్రేక్షకులకు వచ్చే ఏడాది కూడా కనువిందు చేసేందుకు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement