
సభ్యసమాజానికి అల్లు అర్జున్ మెసేజ్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ అప్ డేట్ ను బన్నీ ప్రకటించాడు. ముందుగా ఈ సినిమాను మేలోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే నిర్మాణాంతర కార్యక్రమాలు ఆలస్యమవుతుండటంతో సినిమాను వాయిదా వేశారు.
మహేష్ బాబు, మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న స్పైడర్ ను జూన్ చివరి వారంలో రిలీజ్ చేయాలని భావించారు. అయితే ఈ సినిమా వాయిదా పడటంతో ఆ గ్యాప్ ను బన్నీ ఫిల్ చేస్తున్నాడు. మహేష్ మిస్ అయిన జూన్ 23న బన్నీ ఎంట్రీ ఇస్తున్నాడు. డీజే సినిమాను జూన్ 23న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు బన్నీ. ఇప్పటి వరకు డీజేలో బన్నీ బ్రాహ్మణ పాత్రకు సంబంధించిన స్టిల్స్ ను మాత్రమే రిలీజ్ చేసిన యూనిట్ తాజాగా బన్నీ మార్క్ స్టైలిష్ లో సూటు బూటుతో ఉన్న బన్నీ పోస్టర్ ను రిలీజ్ చేశారు. 'సభ్య సమాజానికి మెసేజ్ : డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమా జూన్ 23న రిలీజ్ అవుతుంది' అంటూ బన్నీ ట్వీట్ చేశాడు.
Sabbhya Samajaniki Message: DJ DUVVADA JAGANNADHAM Movie releasing on 23rd JUNE 2017! #DJ23rdJune ! pic.twitter.com/Y7AooLY4EW
— Allu Arjun (@alluarjun) 22 April 2017