అల్లు అర్జున్కు షాక్ ఇచ్చిన లీకు వీరులు | Allu Arjun As DJ Duvvada Jagannadham Leaked Pic | Sakshi
Sakshi News home page

అల్లు అర్జున్కు షాక్ ఇచ్చిన లీకు వీరులు

Published Fri, Feb 17 2017 11:26 AM | Last Updated on Tue, Sep 5 2017 3:57 AM

అల్లు అర్జున్కు షాక్ ఇచ్చిన లీకు వీరులు

అల్లు అర్జున్కు షాక్ ఇచ్చిన లీకు వీరులు

స్టార్ హీరోల సినిమాలకు లీకుల బెడద తప్పటం లేదు. కోట్ల ఖర్చుతో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాలకు సంబంధించిన విశేషాలు అఫీషియల్ రిలీజ్ కన్నా ముందే సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. యూనిట్ సభ్యులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా లీకు వీరుల నుంచి తప్పించుకోలేకపోతున్నారు. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్కు కూడా ఈ సమస్య ఎదురైంది. బన్నీ తాజా చిత్రం డీజే దువ్వాడ జగన్నాథమ్ ఫస్ట్ లుక్ను ఫిబ్రవరి 18న రిలీజ్ చేయాలని ఫ్లాన్ చేయగా ఒక రోజు ముందే బన్నీ లుక్ సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది.

సరైనోడు సినిమాతో కెరీర్ లోనే బిగెస్ట్ హిట్ కొట్టిన అల్లు అర్జున్, ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో బన్నీ బ్రాహ్మణ పాత్రలో నటిస్తున్నాడు. అర్జున్ ఈ సినిమాలో అదుర్స్ లో ఎన్టీఆర్ తరహా క్యారెక్టర్లో కనిపించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఫిబ్రవరి 18న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు చిత్రయూనిట్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement