స్టైలిష్ స్టార్తో శాండల్వుడ్ బ్యూటీ | Sandalwood Beauty Rashmika Roped in for Allu Arjun Next | Sakshi
Sakshi News home page

స్టైలిష్ స్టార్తో శాండల్వుడ్ బ్యూటీ

Published Tue, Apr 4 2017 12:46 PM | Last Updated on Tue, Sep 5 2017 7:56 AM

స్టైలిష్ స్టార్తో శాండల్వుడ్ బ్యూటీ

స్టైలిష్ స్టార్తో శాండల్వుడ్ బ్యూటీ

ప్రస్తుతం డీజే దువ్వాడ జగన్నాథమ్ షూటింగ్ లో బిజీగా ఉన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, తరువాత చేయబోయే సినిమాను కూడా లైన్ లో పెట్టాడు. ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డీజేలో బ్రాహ్మణుడి పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత ప్రముఖ రచయిత వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కిస్తున్న యాక్షన్ డ్రామాలో హీరోగా నటించేందుకు అంగీకరించాడు బన్నీ.

ఇప్పటికే ఫైనల్ అయిన ఈ ప్రాజెక్ట్ కు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులతో పాటు నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఈ సినిమాలో బన్నీ సరసన హీరోయిన్గా శాండల్ వుడ్ బ్యూటీని పరిచయం చేయాలని భావిస్తున్నారట. కన్నడలో బ్లాక్ బస్టర్గా నిలిచిన కిర్రాక్ పార్టీ సినిమాతో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న రష్మిక మందనను హీరోయిన్గా తీసుకునే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే తెలుగులో పలు సినిమాలకు ఓకె చెప్పే ఆలోచనలో ఉన్న రష్మిక బన్నీ సినిమాలో ఛాన్స్ తప్పకుండా ఓకె చెప్పేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement