Vakkantham Vamsi
-
బండ్ల గణేష్ డబ్బులు ఎగ్గొట్టాడు.. ఒక మనిషి చెప్పడంతో..: డైరెక్టర్
టాలీవుడ్ హీరో నితిన్ 32వ సినిమా 'ఎక్స్ట్రా - ఆర్డినరీ మేన్' తాజాగా విడుదలైంది. వక్కంతం వంశీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ప్రేక్షకులను మెప్పిస్తుంది. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. బండ్ల గణేష్‌తో ఆయనకు ఉన్న ఆర్థిక లావాదేవిల గొడవను తెరపైకి తెచ్చాడు. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో 2015లో 'టెంపర్' చిత్రం విడుదలైంది. జూ ఎన్టీఆర్, కాజల్ జోడీగా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ చిత్రానికి కథను డైరెక్టర్ వక్కంతం వంశీ అందిస్తే.. బండ్ల గణేష్ నిర్మాతగా తెరకెక్కించాడు. కానీ ఆ సినిమాకు సంబంధించిన రెమ్యునరేషన్ ఇవ్వలేదని వక్కంతం వంశీ అప్పట్లో కోర్టుకెక్కాడు. ఆ సమయంలో ఇదొక సెన్సేషన్ వార్తగా నిలిచింది. తాజాగా ఇదే విషయంపై వంశీ ఇలా మాట్లాడాడు. 'టెంపర్ సినిమా విడుదల సమయంలో ఒక తేది వేసి చెక్కు ఇచ్చాడు. తర్వాత బ్యాంకులో డిపాజిట్ చేస్తే అది కాస్త బౌన్స్ అయింది. అప్పటికే సినిమా కూడా విడుదల కావడంతో నేను ఏం చేయలేకపోయాను. ఆ సమయంలో నేను ఎవర్ని కలవాలి..? ఏం చేయాలో కూడా అర్ధం కాలేదు. నాకు డబ్బు ఇవ్వకూడదనే అతనలా చేశాడని మాత్రం అర్థం అయింది. ఆ సమయంలో వాడికి (బండ్ల గణేష్) ఏ ఇబ్బంది ఉందో నాకు తెలియదు... వాడిని కలిసే ప్రయత్నం చేసినా కుదరలేదు. ఆ సమయంలో నేను కోర్టుక వెళ్లక తప్పలేదు. ఈ విషయంలో పలుమార్లు కోర్టు చుట్టూ బాగా తిరిగాను. కొన్ని రోజుల తర్వాత సినీ ఇండస్ట్రీకి చెందిన ఒక పెద్దమనిషి వద్దకు నేను వెళ్లాను. ఆయన చెప్పడం వల్లనే వాడు డబ్బులు సెటిల్ చేశాడు. ఆ తర్వాత నుంచి నాతో వాడు బాగానే ఉన్నాడు. వాడిపై నాకు కోపం ఏం లేదు. మోసం చేశాడనే బాధ ఉంది. కొన్ని రోజుల తర్వాత టెంపర్ హిందీ రైట్స్ అమ్మేందుకు వాడు,నేను ఇద్దరం ఒకే ఫైట్‌లో వెళ్లాం. ఇలా బండ్ల గణేష్ మాదిరి డబ్బు విషయంలో చాలా మంది నన్ను ఇబ్బంది పెట్టారు. కొందరు ఇప్పటికి కూడా ఇవ్వలేదు.' అని అన్నాడు. గతంలో కోర్టు ఏం చెప్పింది బండ్ల గణేష్‌పై వక్కంతం వంశీ వేసిన కేసులో ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఒక తీర్పును వెలువరించింది. జైలు శిక్షతో పాటు 15 లక్షల 86 వేల 550 రూపాయల జరిమానా కూడా బండ్ల గణేష్‌కు విధించింది. 25 లక్షల రూపాయలకు సంబంధించిన చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేష్‌కు కోర్ట్ ఈ శిక్ష విధించింది. వెంటనే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న గణేష్‌కు షరతులతో కూడిన బెయిల్‌ను అప్పట్లో న్యాయస్థానం మంజూరు చేసింది. ఆ తర్వాత వారిద్దరూ కలిసి కూర్చోని ఈ డబ్బులు విషయాన్ని సెటిల్ చేసుకున్నట్లు తెలుస్తోంది. -
ఈగోని పక్కన పెడితే ఆడియన్స్‌కి దగ్గరవుతాం
‘‘గ్లోబల్ స్థాయికి వెళ్లాలని ‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’ సినిమాలను చేయలేదు. కథాబలం ఉండటంతో ఆ సినిమాలను జపాన్ వంటి ఇతర దేశాల ప్రేక్షకులూ ఆదరించారు. గ్లోబల్ అప్పీల్ ఉన్న కథ కోసం ఎదురు చూస్తూ ఉంటే టైమ్ వృథా అవుతుంది. నాకు వచ్చిన కథలు చేసుకుంటూ వెళ్తున్నాను. ఈ క్రమంలో పాన్ ఇండియా కథ ఏదైనా సెట్ అయితే ఓకే. అయినా నాకలాంటి పెద్ద పెద్ద ఆశలు లేవు. తెలుగులోనే సినిమాలు చేయాలని ఉంది’’ అని హీరో నితిన్ అన్నారు. నితిన్, శ్రీ లీల జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించిన ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మేన్’ రేపు రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో నితిన్ చెప్పిన విశేషాలు. ► ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మేన్’లో నా పాత్రలో త్రీ షేడ్స్ ఉన్నాయి. కథ రీత్యా జూనియర్ ఆర్టిస్ట్‌గా కనిపిస్తాను. అలా అని ఈ సినిమాలో జూనియర్ ఆర్టిస్టుల కష్టాల గురించి చెప్పడం లేదు. ఆ పాత్ర నుంచి కామెడీ పండించాం. ‘ఎక్స్ట్రా’ చిత్రంలో ఇంట్రవెల్లో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. కథ కొత్తది కాక΄ోవచ్చు కానీ పాయింట్ చాలా కొత్తగా ఉంటుంది. ఈ సినిమా కథ విన్నప్పుడల్లా హాయిగా నవ్వుకున్నాను. కథ స్క్రీన్ మీదకు వచ్చినప్పుడు కూడా సేమ్ ఫీలింగ్. ►వక్కంతం వంశీగారి కథలతో వచ్చిన ‘కిక్’, ‘రేసు గుర్రం’, ‘ఊసరవెల్లి’, ‘టెంపర్’ చిత్రాలను గమనిస్తే హీరో క్యారెక్టరైజేషన్ కొత్తగా, విభిన్నంగా ఉంటుంది. ‘ఎక్స్ట్రా’ చిత్రంలోనూ ఇలానే ఉంటుంది. స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది. ►సినిమాలో రావు రమేశ్‌గారు నాకు తండ్రిగా నటించారు. ఆయనకు, నాకు మధ్య వచ్చే సీన్స్ వినోదాత్మకంగా ఉంటాయి. కొంత సెంటిమెంట్ కూడా ఉంటుంది. రాజశేఖర్‌గారు సెకండాఫ్‌లో వస్తారు. సందర్భానుసారంగా కామెడీ వస్తుంటుంది. ►సినిమాలో నేను జూనియర్ ఆర్టిస్టు్టను కాబట్టి ‘శ్రీమంతుడు’, ‘బాహుబలి’ వంటి సినిమాల ప్రస్తావనతో కాస్త కామెడీ ఉంటుంది. వినోదం కోసమే ఇలా చేశాం. ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి సినిమాల్లో వెంకటేశ్‌గారి పాత్రపై ఇతర పాత్రధారులు జోక్స్ వేస్తుంటారు. ఇమేజ్, ఈగోల గురించి ఆలోచించకుండా పాత్ర కోసం నటిస్తే ఆడియన్స్‌కు మరింత దగ్గర కావొచ్చు. ఈ విషయంలో నాకు వెంకటేశ్‌గారు స్ఫూర్తి. ►ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాను. ఈ చిత్రంలో శ్రీ లీల హీరోయిన్. అలాగే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘తమ్ముడు’ సినిమా చేస్తున్నాను. కథ నచ్చితే గ్రే షేడ్ (కాస్త నెగటివ్ టచ్ ఉన్న పాత్రలు) ఉన్న పాత్రలు చేయడానికి రెడీగా ఉన్నాను. -
Extra Ordinary Man Movie Wallpapers: నితిన్ ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ మూవీ స్టిల్స్
-
నితిన్ ‘ఎక్స్ట్రా’ మూవీ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
వక్కంతం వంశీ ఫేమస్ రైటర్...కానీ డైరెక్షన్ విషయానికి వస్తే..!
-
ఇదీ 'కిక్' సినిమాకు డబుల్ 'ఎక్స్ట్రా' : వక్కంతం వంశీ
నితిన్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు ‘ఎక్స్ట్రా’ అనే టైటిల్ ఖరారు చేశారు. ‘ఆర్డినరీ మేన్ ’ అనేది ట్యాగ్‌లైన్ . ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు. శ్రేష్ఠ్ మూవీస్, ఆదిత్యా మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్, రుచిర ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబరు 23న విడుదల కానుంది. తాజాగా ఆదివారం ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్, రిలీజ్ డేట్‌ను ప్రకటించారు మేకర్స్. ‘‘కిక్’ సినిమా తర్వాత ఆ రేంజ్లో క్యారెక్టర్ బేస్డ్ స్క్రిప్ట్‌తో ‘ఎక్స్ ట్రా’ సినిమా తెరకెక్కుతోంది. ఆడియన్స్ రోలర్ కోస్టర్ లాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తూనే, నవ్విస్తూ సర్ప్రైజ్లతో మెప్పిస్తుంది మా సినిమా’’ అన్నారు వక్కంతం వంశీ. ఈ సినిమాకు సంగీతం: హారిస్ జైరాజ్. -
'నా పేరు సూర్య..' సినిమా జూనియర్ ఎన్టీఆర్‌తో చేయాల్సింది!
సినీ రచయితగా, దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వక్కంతం వంశీ. టాలీవుడ్‌కు ఎన్నో హిట్ సినిమాలు అందించిన ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. రచయితగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా కిక్ అని చెప్పాడు. ఓసారి టెంపర్ ఐడియా తారక్‌కు చెప్పగా.. దానికి నేను సూటవుతానా? అని అతడు అడిగాడు.. అలా జూనియర్ ఎన్టీఆర్‌తో టెంపర్ చేశానని పేర్కొన్నాడు. అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాకు మొదటగా జూనియర్ ఎన్టీఆర్‌నే హీరోగా అనుకున్నట్లు తెలిపాడు. తారక్‌తో ఆ సినిమా చేయాల్సిందని, ఆయనే తనను దర్శకుడిని చేస్తానని చెప్పినట్లు పేర్కొన్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల అది బన్నీ చేతిలోకి వెళ్లిందన్నాడు. ఇకపోతే ప్రస్తుతం అతడు ఏజెంట్ సినిమాకు రైటర్‌గా పని చేస్తుండగా ఈ మూవీ సంక్రాంతికి విడుదల కానుంది. చదవండి: అది మాటల్లో చెప్పలేను: గౌతమ్ ఘట్టమనేని టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న మాజీ ప్రపంచ సుందరి -
కొత్త సినిమా ప్రారంభించిన నితిన్, హీరోయిన్ ఎవరంటే..
యంగ్ హీరో నితిన్ వరస ప్రాజెక్ట్స్‌ను లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం అతడు నటిస్తున్న మాచెర్ల నియోజకవర్గం ఇంకా సట్స్పైనే ఉంది. ఈ నేపథ్యంలో నితిన్ మరో కొత్త సినిమాను సెట్స్‌పైకి తీసుకువచ్చాడు. దర్శకుడు వక్కంతం వంశీ డైరెక్షన్లో నితిన్ ఓ కొత్త సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా హైదరాబాద్‌లో గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. ఆదివారం(ఏప్రిల్ 3) ఈ సినిమా పూజ కార్యక్రమాన్ని జరుపుకోగా.. ముహుర్తపు సన్నివేశానికి నిర్మాత పి. రామ్మోహన్రావు క్లాప్ కొట్టారు. ఇందులో నితిన్‌కు జోడిగా ‘పెళ్లి సందD’ బ్యూటీ శ్రీలీలా నటిస్తోంది. ఆదిత్యా మ్యూజిక్ ఉమేశ్ గుప్తా కెమెరా స్విచ్చాన్ చేశారు. ప్రొడక్షన్ నెంబర్ 9 పేరుతో ప్రారంభమైన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. #Nithiin32 Launched today on an auspicious note with a formal pooja ceremony🪔 Starring Youth🌟@actor_nithiin & @sreeleela14♥️ 🎬@VamsiVakkantham 🎶@Jharrisjayaraj 🎥 #SaiSrinivas 🖌@sahisuresh#SudhakarReddy #NikithaReddy #RajkumarAkella @SreshthMovies Shoot commences soon🤘 pic.twitter.com/jQgQtz362S — Sreshth Movies (@SreshthMovies) April 3, 2022 -
‘రేసుగుర్రం’ రిపీట్ కానుందా?
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్-సురేందర్ రెడ్డి కాంబినేషన్లో వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘రేసుగుర్రం’. అన్ని వర్గాల ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేసిన ఈ చిత్రం అప్పట్లో రికార్డుల సునామీ సృష్టించింది. అయితే టాలీవుడ్ సర్కిళ్లలో తెగ చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం ఈ కాంబినేషన్ మళ్లీ రిపీట్ కానుందట. ‘రేసుగుర్రం’ చిత్రానికి కథను అందించిన వక్కంతం వంశీతో కలిసి బన్ని కోసం ఓ కథను స్దిదం చేస్తున్నారట సురేందర్ రెడ్డి. ‘రేసుగుర్రం’కు మించిన పవర్ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్దం చేసే పనిలో వంశీ-సురేందర్ ఉన్నట్లు టాలీవుడ్ సమాచారం. ఇక ప్రస్తుతం పుష్ఫ చిత్రంతో బిజీగా ఉన్న బన్ని ఆ తర్వాత వేణు శ్రీరామ్ ‘ఐకాన్’కు కమిట్ అయిన విషయం తెలిసిందే. సుకుమార్ ‘పుష్ప’ తర్వాత ఐకాన్ సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇక ఈ రెండు చిత్రాల తర్వాత అల్లు అర్జున్‌తో ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించాలని సురేందర్ రెడ్డి భారీగా ప్లాన్ చేస్తున్నారట. ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం తర్వాత సురేందర్ రెడ్డి మరో చిత్రాన్ని ఇప్పటివరకు ఫైనలైజ్ చేయలేదు. పలువురు హీరోలతో కథాచర్చలు జరిపినప్పటికీ కుదరలేదని టాలీవుడ్ టాక్. ఇక వీరిద్దరి కలయికలో మరో చిత్రం రావాలని బన్ని అభిమానులు ఎప్పట్నుంచో కోరుకుంటున్న విషయం తెలిసిందే. రేసుగుర్రం కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుందా? లేదా అని తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాలి. చదవండి: హీరోయిన్ మెటీరియల్ కాదన్నారు యూట్యూబ్ ట్రెండింగ్‌లో ‘నో పెళ్లి’ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_951255110.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కాంబినేషన్ షురూ
మంచి జోరు మీద ఉన్నారు రవితేజ. వరుసగా సినిమాలకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ కెరీర్లో ఎక్స్‌ప్రెస్‌లా దూసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘క్రాక్’ చిత్రంలో రవితేజ హీరోగా నటిస్తున్నారు. అలాగే రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్నట్లు ఇటీవల ప్రకటన వచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. తాజాగా అల్లు అర్జున్ ‘నాపేరు సూర్య–నా ఇల్లు ఇండియా’ సినిమాతో దర్శకుడిగా మారిన రైటర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటింబోతున్నారన్న ప్రకటన శుక్రవారం వెల్లడైంది. గతంలో రవితేజ హీరోగా నటించిన సినిమాలకు వంశీ రచయితగా వర్క్ చేశారు. ఈ సినిమా గురించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. -
కిక్ కాంబినేషన్
‘కిక్, రేసుగుర్రం, టెంపర్’ వంటి పలు హిట్ చిత్రాలకు కథ అందించిన రచయిత వక్కంతం వంశీ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’తో దర్శకుడిగా మారిన విషయం తెలిసిందే. తొలి సినిమాని అల్లు అర్జున్‌తో చేసిన వంశీ మలి సినిమాకి రవితేజను హీరోగా అనుకుంటున్నారట. ప్రస్తుతం ఈ మాస్ మహారాజ కోసం కథ సిద్ధం చేస్తున్నారని సమాచారమ్. రవితేజ బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో ఒకటైన ‘కిక్’ సినిమాకు కథ అందించింది వంశీయే. అప్పటి నుంచి వీరిమధ్య మంచి స్నేహబంధం ఉంది. ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’, సంతోష్ శ్రీనివాస్‌తో ‘తేరి’ రీమేక్‌లో నటిస్తున్నారు రవితేజ. ఆ తర్వాత వీఐ ఆనంద్ డైరెక్షన్లో నటిస్తారట. ఈ చిత్రాలు పూర్తయ్యాక వంశీతో చేసే సినిమా పట్టాలెక్కుతుందేమో? వెయిట్ అండ్ సీ. -
సూర్య విత్ క్రిష్
-
అలా చేసుంటే అందరూ విమర్శించేవారు
‘‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ కథని డెవలప్ చేసుకుంటూ డైరెక్షన్ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు బన్నీకి ఈ కథ బావుంటుందనిపించింది. ఆయన్ని కలిసి ఒక గంట కథ చెప్పా. బన్నీకి నచ్చిన తర్వాత మిగిలిన కథను డెవలప్ చేశా. సూర్య పాత్రలో అల్లు అర్జున్‌ని తప్ప మరో యాక్టర్‌ని ఊహించుకోలేను’’ అని వక్కంతం వంశీ అన్నారు. అల్లు అర్జున్, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 4న విడుదలైంది. ఈ సందర్భంగా వక్కంతం వంశీ విలేకరులతో మాట్లాడారు.దర్శకుడు కావాలన్న నా కల ‘నా పేరు సూర్య’ సినిమాతో నేరవేరింది. మా చిత్రం ప్రేక్షకులకు బాగా రీచ్ అయ్యింది. అన్నిచోట్ల నుంచి మంచి స్పందన వస్తుండటంతో చాలా సంతోషంగా ఉంది. మిలటరీ వారు సినిమా చూసి హ్యాపీగా ఫీలయ్యారు ∙ఏ హాలీవుడ్ సినిమాకూ ఇది ఇన్స్పిరేషన్ కాదు. ఫిక్షన్ కథే. మన కలల్ని సాధించాలని మొదలుపెట్టే జర్నీ ప్యూర్‌గా ఉంటుంది. ఆ గోల్‌ను సాధించే క్రమంలో అంతే ప్యూర్‌గా ఉండగలుగుతున్నామా? అలా ఉండటం ఎంతో ముఖ్యమనే పాయింట్ చెప్పాలనుకున్నా. దానికి కోపం అనే పాయింట్‌ను యాడ్ చేశాను ∙ప్రతి యాక్టర్ ఒక జాబ్ శాటిస్ఫాక్షన్ కోసం ప్రయత్నిస్తుంటారు. బన్నీ కూడా ఓ పర్ఫార్మెన్స్ రోల్ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో నేను కథ చెప్పడం.. ఆయనకు నచ్చడంతో సినిమా చేశారు. రిలీజ్ తర్వాత చాలా హ్యాపీగా ఉన్నారు. సినిమా చూసి త్రివిక్రమ్‌గారు, సుకుమార్‌గారు అభినందించారు ∙క్లయిమాక్స్‌లో చూపించిన అన్వర్ అనే సమస్య విలన్ సమస్య కంటే చాలా పెద్దది. సినిమా ప్రారంభంలో హీరో టెర్రరిస్ట్‌తో ‘నువ్వు టెర్రరిస్ట్ అయ్యాక నాకు కనపడ్డావ్. అందుకే చంపుతున్నాను. కాకముందు కనపడి ఉంటే టెర్రరిస్ట్ అవ్వాలనే నీ ఆలోచనను చంపేసేవాణ్ణి’ అనే డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్‌నే క్లయిమాక్స్‌లో చూపించాం. ఈ కథను రొటీన్ ఫార్మెట్లో చేసుంటే అందరూ విమర్శించేవారు. కానీ, నేను కథను ఎక్కడా డైవర్ట్ కాకుండా తీసుకువెళ్లాను ∙ఎన్టీఆర్‌గారు నా ఫేవరెట్ యాక్టర్. నన్ను డైరెక్టర్ని చేస్తానని చెప్పిందే ఆయన. ఆయన కోసం ఓ పాయింట్ అనుకున్నాను. అయితే డెవలప్మెంట్లో వర్కవుట్ కాలేదు ∙రైటర్‌గా కంటే డైరెక్టర్‌గా బాగా చేశానని చాలామంది అంటున్నారు. డైరెక్టర్ అయిన తర్వాత కూడా బయటి దర్శకులకు కథలు ఇస్తాను. ‘నీ రెండో మూవీ కూడా మా బ్యానర్లోనే ఉంటుంది’ అని నాగబాబుగారు అనడం ఆయన సంస్కారం. -
నా పేరు సూర్య : తొలి రోజే 40 కోట్లు
అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమాలో బన్నీ సైనికుడిగా కనిపించాడు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి రిలీజ్ అయిన ఈ సినిమా బన్నీ కెరీర్లోనే బిగెస్ట్ ఓపెనింగ్స్ సాధించింది. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా తొలి రోజు 40 కోట్ల రూపాయల గ్రాస్ సాధించినట్టుగా తెలుస్తోంది. బన్నీ కెరీర్లోనే తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా నా పేరు సూర్య రికార్డ్ సృష్టించింది. బన్నీ సరసన అను ఇమ్మాన్యూల్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో శరత్ కుమార్, అర్జున్, బొమన్ ఇరానీ, రావూ రమేష్, నదియాలు ఇతర కీలకపాత్రలో నటించారు. చాలా కాలం తరువాత మెగా బ్రదర్ నాగబాబు ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించగా లగడపాటి శిరీషా, బన్నీ వాసులు సంయుక్తంగా నిర్మించారు. -
ఎన్టీఆర్‌తో గొడవలు లేవు
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘నాపేరు సూర్య’ సినిమాతో దర్శకుడిగా వంశీ పరిచయం అయ్యాడు. వక్కంతం వంశీ ‘కిక్’, ‘టెంపర్’, ‘ఎవడు’ లాంటి సూపర్ హిట్ చిత్రాలకు రచయితగా పనిచేశాడు. అల్లు అర్జున్ కంటే ముందు వంశీ జూనియర్ ఎన్టీఆర్ సినిమాతో డైరెక్టర్‌గా మారాలనుకున్నాడు. ఆ సమయంలో ఎన్టీఆర్ కోసం కథ కూడా సిద్ధం చేశాడు వక్కంతం వంశీ. కొన్ని చర్చలు జరిగిన తర్వాత ఆ ప్రాజెక్టు నుంచి జూనియర్ ఎన్టీఆర్ తప్పుకున్నాడు. గతంలో ఎన్టీఆర్, వంశీల మధ్య విబేధాలు వచ్చాయినే వార్తలు హల్చల్ చేశాయి. వంశీ ప్రస్తుతం ఆ విషయంపై స్పందించాడు. ఎన్టీఆర్‌తో తనకు ఏ విధమైన వివాదాలు లేవని, ఆయనతో టచ్‌లో ఉన్నానని చెప్పాడు. ‘ ఎన్టీఆర్‌తో గొడవలు ఉన్నాయని వచ్చిన రూమర్స్ నిజం కాదు. డైరెక్టర్‌గా చేయమని ఎన్టీఆర్ నన్ను ప్రోత్సహించాడు. నా మొదటి చిత్రం ఆయనతోనే చేయాలని అనుకున్నాను. స్టోరి కూడా రెడీ చేశాను. కానీ ఆ ప్రాజెక్టును ఆపేశాం. ఆ సమయంలో బన్నీ కోసం ఓ కథ ఉంటే చెప్పమని బుజ్జి గారు అడిగారు. అప్పుడు ‘నా పేరు సూర్య’ కథ సిద్ధం చేశాను’ అని వక్కంతం వంశీ తెలిపాడు. -
‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ రివ్యూ
టైటిల్ : నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా జానర్ : యాక్షన్ డ్రామా తారాగణం : అల్లు అర్జున్, అను ఇమ్మాన్యూయేల్, అర్జున్, శరత్ కుమార్, బొమన్ ఇరానీ, రావూ రమేష్ సంగీతం : విశాల్ - శేఖర్ కథ, స్క్రీన్ ప్లే, డైలాగులు, దర్శకత్వం : వక్కంతం వంశీ నిర్మాత : లగడపాటి శ్రీధర్, నాగబాబు, బన్నీ వాసు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన సినిమా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. ఈ సినిమాలో బన్నీ డిఫరెంట్ మేకోవర్‌లో.. డిఫరెంట్ మేనరిజమ్స్‌తో సోల్జర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ సినిమా మీద అంచనాలను భారీగా పెంచేశాయి. మరి ఆ అంచనాలను నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అందుకుందా.? వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న బన్నీ మరోసారి తన స్టామినా ప్రూవ్ చేసుకున్నాడా..? ఎన్నో విజయవంతమైన కథలు అందించిన వక్కంతం వంశీ దర్శకుడిగా తొలి ప్రయత్నంలో విజయం సాధించాడా..? కథ; సూర్య (అల్లు అర్జున్) కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని యువకుడు. తన ఆవేశంతో ప్రతీ ఒకరితో గొడవపడుతూ ఉంటాడు. చిన్నతనంలో ఓ గొడవ కారణంగా ఇంట్లోంచి వెళ్లిపోతాడు. పెద్దయ్యాక సైన్యంలో చేరి అక్కడా తన తీరును మార్చుకోడు. ఈ క్రమంలో ఓ మినిస్టర్ కొడుకుతో గొడవపడటం, తరువాత ఆర్మీ నిర్భందంలో ఉన్న ఓ వ్యక్తిని చంపటంతో ఉన్నతాధికారులు సూర్య మీద చర్యలు తీసుకుంటారు. (సాక్షి రివ్యూస్) తన మీద తనకు కంట్రోల్ లేని వాడు సైన్యంలో పనికిరాడంటూ ఆర్మీ నుంచి సస్పెండ్ చేస్తారు. తిరిగి ఆర్మీలో చేరాలంటే తాను మానసికంగా ఫిట్‌గా ఉన్నట్లు ప్రముఖ సైకాలజిస్ట్ రామకృష్ణం రాజు (అర్జున్) నుంచి సర్టిఫికేట్ తీసుకురావాలని కండిషన్ పెడతారు. ఆ పని మీద వైజాగ్ వచ్చిన సూర్యకు సమస్యలు ఎదురవుతుంటాయి. చల్లాతో గొడవలు పెట్టుకుంటాడు. ఇంతకీ రామకృష్ణంకు సూర్యకు మధ్య సంబంధం ఏంటి..? సూర్య తన క్యారెక్టర్ని వదులుకొని తిరిగి ఆర్మీలో చేరాడా? అన్నదే మిగతా కథ. నటీనటులు ; అల్లు అర్జున్ గతంలో ఎన్నడూ చేయని ఓ డిఫరెంట్ క్యారెక్టర్లో కనిపించాడు. యాంగ్రీ యంగ్‌మెన్‌గా మంచి నటన కనబరిచాడు. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని యువకుడిగా.. అదే సమయంలో దేశం కోసం ప్రాణమిచ్చే దేశ భక్తుడి షేడ్స్‌లో ఆకట్టుకున్నాడు. రొమాంటిక్ సీన్స్ లోనూ తన మార్క్ చూపించాడు. బన్నీ స్టైలిష్ డాన్స్ మూమెంట్స్ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. యాక్షన్ సీన్స్‌లోనూ బన్నీ పడిన కష్టం తెర మీద కనిపించింది. (సాక్షి రివ్యూస్)హీరోయిన్గా వర్ష పాత్రలో అనూ ఇమ్మాన్యూల్ ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఉన్నంతలో నటనతో పాటు గ్లామర్ షోతోనూ అలరించింది. రామకృష్ణంరాజు పాత్రలో నటించిన సీనియర్ నటుడు అర్జున్ సెటిల్డ్ ఫెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నారు. స్టైలిష్‌గా కనిపించిన అర్జున్ తన పాత్రలో ఒదిగిపోయారు. శరత్ కుమార్ తనకు అలవాటైన ఎగ్రెసివ్ రోల్ లో మరోసారి మెప్పించాడు. మరో విలన్ అనూప్ థాకూర్ సింగ్ యాక్షన్ సీన్స్‌లో ఆకట్టుకున్నాడు. ఇతర పాత్రల్లో నదియా, బొమన్ ఇరాని, వెన్నెల కిశోర్, రావూ రమేష్, పోసాని కృష్ణమురళీ, ప్రదీప్ రావత్‌లు తమ పరిధి మేర మెప్పించారు. విశ్లేషణ ; సూపర్ హిట్ కథలు అందించిన వక్కంతం వంశీ దర్శకుడిగా తొలి ప్రయత్నంలో డిఫరెంట్ కాన్సెప్ట్‌ను ఎంచుకున్నాడు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ను అభిమానులకు డిఫరెంట్ మేకోవర్‌లో చూపించాడు. లుక్ పరంగానే కాదు బాడీ లాంగ్వేజ్, మేనరిజమ్స్ ఇలా ప్రతీ విషయంలోనూ బన్నీని కొత్తగా చూపించాడు దర్శకుడు. మొదటి నుంచి సినిమాను దేశభక్తి సినిమాగా ప్రమోట్ చేసినా రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉండేలా జాగ్రత్త పడ్డాడు. (సాక్షి రివ్యూస్)అయితే తొలి భాగాన్ని ఆసక్తికరంగా నడిపించిన వంశీ, ద్వితీయార్థంలో మాత్రం కాస్త తడబడ్డాడు. సెకండ్ హాఫ్ కథనం కాస్త నెమ్మదించటం ప్రేక్షకులను ఇబ్బంది పెడుతుంది. ప్రేమకథను కూడా అంత ఆసక్తికరంగా మలచలేదు. క్లైమాక్స్ విషయంలోనూ ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్ శేఖర్లు బన్నీ ఎనర్జీకి తగ్గ ట్యూన్స్ తో అలరించారు. మాస్ ఐటమ్ నంబర్, రొమాంటిక్ మెలోడి, ఫ్యామిలీ సాంగ్ ఇలా అన్ని వేరియేషన్స్ లోనూ ఆకట్టుకున్నారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమా స్థాయిని మరింత పెంచారు. వంశీ రాసిన డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయి. రాజీవ్ రవి సినిమాటోగ్రఫి సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్. ఆర్మీ సీన్స్ తో పాటు ఇతర సన్నివేశాలను అద్భుతంగా కెమెరాలో బంధించాడు రాజీవ్. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. సరిహద్దులో శత్రువుల కంటే.. దేశం లోపల ఉన్న దుష్టశక్తులు ప్రమాదకరమని భావించి వాటితో పోరాటం చేసే ఆవేశపరుడైన సైనికుడి కథే ఇది. అయితే తొలి ప్రయత్నంలో బలమైన కథను రాసుకున్న దర్శకుడు వక్కంతం వంశీ.. దానిని తెరపై మాత్రం అంత ఆసక్తికరంగా మలచలేకపోయాడు. ప్లస్ పాయింట్స్ ; అల్లు అర్జున్ నటన యాక్షన్ సీన్స్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మైనస్ పాయింట్స్ ; సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్లు స్క్రీన్‌ప్లే క్లైమాక్స్ - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
‘ఇండియా కావాలి.. ఇచ్చెయ్’
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. రచయిత వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బన్నీ ఆర్మీ అధికారిగా నటిస్తున్నాడు. మే 4న రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను చిత్రయూనిట్ రిలీజ్ చేశారు. సినిమాలో బన్నీ క్యారెక్టరైజేన్ను రివీల్ చేస్తూ రూపొందించిన ఈ ట్రైలర్లో సినిమాలోని ఇతర కీలక పాత్రధారులని పరిచయం చేశారు. అల్లు అర్జున్ సరసన అను ఇమ్మాన్యూల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్, శరత్‌కుమార్, బొమన్ ఇరానీ, నదియాలు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న బన్నీ నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా సినిమాతో మరోసారి ఘనవిజయం సాధిస్తాడని నమ్మకంగా ఉన్నారు ఫ్యాన్స్. -
‘క్యారెక్టర్ వదిలేయడం అంటే ప్రాణాలు వదలడమే’
-
ఇండస్ట్రీలో బెంచ్‌మార్క్‌గా నిలుస్తుంది
ఈ నెల 29న జరగనున్న మా ‘నా పేరు సూర్య–నా ఇల్లు ఇండియా’ ప్రీ–రిలీజ్ ఫంక్షన్‌కు ముఖ్య అతిథిగా రామ్‌చరణ్ రానుండటం ఆనందంగా ఉంది. ఈ ఫంక్షన్‌ను బిగ్ రేంజ్లో ప్లాన్ చేశాం. ఇటీవల జరిగిన ఆడియో ఫంక్షన్‌కు చిరంజీవిగారిని ఆహ్వానించాలని వెళ్లి కలిశాను. ‘‘సినిమా గురించి, బన్నీ కష్టం గురించి విన్నాను. బట్.. ఆడియో ఫంక్షన్‌కు రాలేను. అమెరికా వెళ్తున్నాను’’ అన్నారు. సినిమాకు మీ ఆశీర్వాదం కావాలి సర్ అంటే.. సెట్స్‌కు వచ్చారు చిరంజీవిగారు. టీమ్ అంతా హ్యాపీ ఫీలయ్యాం. ఆడియో ఫంక్షన్‌కు రాలేకపోతున్నానని ఆయన ఫీలయ్యారు’’ అన్నారు. ‘‘దేశం మనకేం చేసింది అన్నది కాదు.. దేశానికి మనం ఏం చేశాం అన్నది ముఖ్యం అనే పాయింట్‌తో ‘నా పేరు సూర్య– నా ఇల్లు ఇండియా’ ఉంటుంది. దేశానికి సేవ చేయాలనుకునే హీరోకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనేది సినిమాలో ఆసక్తికరం. దేశానికి సేవ చేస్తే ఎలాంటి సంతృప్తి కలుగుతుంది అన్న విషయం ప్రేక్షకులకు అర్థం అవుతుంది. ‘రంగస్థలం, భరత్ అనే నేను’ సినిమాల రేంజ్లో మా సినిమా కూడా ఉంటుందని నా నమ్మకం’’ అన్నారు నిర్మాత లగడపాటి శ్రీధర్. అల్లు అర్జున్, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా కె. నాగబాబు సమర్పణలో రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మించిన చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. ‘బన్నీ’ వాసు సహ నిర్మాత. మే 4న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా లగడపాటి మాట్లాడుతూ– ‘‘పదేళ్ల క్రితం మీతో సినిమా చేస్తానని బన్నీ (అల్లు అర్జున్) మాటిచ్చాడు. ఇప్పుడు ఇంత స్టార్డమ్ ఉన్నప్పుడు పిలిచి సినిమా చేశాడు. ఈ సినిమాలోని సూర్య క్యారెక్టర్ అల్లు అర్జున్‌కే సూట్ అవుతుంది. ఇండస్ట్రీలో ఈ సినిమా బెంచ్‌మార్క్‌గా నిలుస్తుందన్న నమ్మకం ఉంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయాలనుకుంటున్నాం. హిందీలో డబ్ చేసే ఆలోచన ఉంది. నాగబాబుగారు బాగా çసహకరించారు. బన్నీ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు. ఒకడు మారాడు అనే కంటే ఎలా మారాడు? అన్న విషయాన్ని ప్రేక్షకులు బాగా ఇంట్రెస్ట్‌గా చూస్తారు. దేశానికి మనం ఏం చేస్తే బాగుంటుంది అని కల కనే యువకుడి కథ ఇది. టైటిల్లోనే ‘నా ఇల్లు ఇండియా’ అనే మాట వాడాం అంటే సినిమా స్పాన్‌ను అర్థం చేసుకోవచ్చు. థియేటర్స్‌లో ప్రేక్షకులకు మంచి అనుభూతి కలుగుతుంది. ఈ సినిమాకు మ్యూజిక్ బిగ్ ఎస్సెట్ అవుతుంది. ముఖ్యంగా ‘లవర్ ఆల్సో.. ఫైటర్ ఆల్సో..’ సాంగ్ హాలీవుడ్ రేంజ్లో ఉంటుంది. ‘ఇరగ.. ఇరగ..’ సాంగ్‌కు కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ మంచి స్టెప్స్ ఇచ్చారు. బన్నీ ఇరగదీశాడు. అనూ ఇమ్మాన్యుయేల్ బాగా నటించింది. డ్యాన్స్ కూడా అదరగొట్టింది. విశాల్–శేఖర్ మంచి సంగీతం ఇచ్చారు. సినిమా బాగా రావడంలో సహనిర్మాత ‘బన్నీ’ వాసు పాత్ర ఉంది. ప్రొడక్షన్ వైపు చాలా కష్టపడ్డారు. వరుసగా టాప్ హీరోలతో సినిమాలు చేయాలని ప్రయత్నిస్తున్నాను. మా అబ్బాయి (విక్రమ్) హీరోగా కష్టపడి పైకి రావాలనుకుంటున్నాను. ‘ఎవడి గోల వాడిది 2’ చేయాలని ఉంది. ‘స్టైల్ 2’ కథ చేయాలనుకుంటున్నాను. తమిళ సినిమా ‘గోలీసోడా’ని ‘ఎవడూ తక్కువ కాదు’ పేరుతో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం’’ అన్నారు. -
బన్నీ సినిమా కూడా అంతే..!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. రచయిత వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ లగడపాటి శ్రీధర్, నాగబాబులు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మే 4న రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. అయితే ఈ సినిమా కూడా రంగస్థలం, భరత్ అనే నేను తరహాలోనే రెండున్నర గంటలకు పైగా నిడివితో రిలీజ్ అవుతోంది. ఇటీవల విడుదలైన రంగస్థలం మూడు గంటల నిడివితో రిలీజ్ చేశారు. తరువాత భరత్ అనే నేను సినిమాను కూడా రెండు గంటల 53 నిమిషాల నిడివితో రిలీజ్ చేశారు. ఈ రెండు సినిమాల విషయంలోనూ డ్యూరేషన్‌పై విమర్శలు వినిపించాయి. అయితే అవేవి పట్టించుకోకుండా నా పేరు సూర్య సినిమాను కూడా రెండు గంటల 47 నిమిషాల నిడివితో రిలీజ్ చేసేందుకు నిర్ణయించారు. అల్లు అర్జున్ ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ సినిమాలో అను ఇమ్మాన్యూల్ హీరోయిన్ గా నటిస్తుండగా అర్జున్, శరత్‌కుమార్, థాకూర్ అనూప్ సింగ్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
హీరోయిన్‌తో అల్లు అర్జున్ సెల్ఫీ
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. రచయిత వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బన్నీ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపిస్తున్నాడు. సైనికుడిగా కనిపించేందుకు బన్నీ తన లుక్‌ను పూర్తిగా మార్చేసుకున్నాడు. డిఫరెంట్ హెయిర్ స్టైల్‌తో అభిమానులకు షాక్ ఇచ్చాడు. మే 4న రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా షూటింగ్ బుధవారంతో పూర్తయ్యింది. ఈ సందర్భంగా బన్నీ ఓ ఆసక్తికర ట్వీట్ చేశాడు. అభిమానులకు షూటింగ్ పూర్తయ్యిందన్న విషయాన్ని వెల్లడించిన స్టైలిష్ స్టార్ ‘నా హీరోయిన్ అను ఇమ్మాన్యూల్ అడిగిన తొలి, చివరి కోరిక ఓ సెల్పీ.. షూటింగ్ పూర్తయిన తరువాత అను ఇమ్మాన్యూల్ తో నా తొలి పర్సనల్ ఫొటో’ అంటూ అనుతో దిగిన సెల్ఫీని ట్వీట్ చేశాడు బన్నీ. బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్ శేఖర్ సంగీతమందిస్తున్న ఈ సినిమాను లగడపాటి శ్రీధర్, నాగబాబులు నిర్మిస్తున్నారు. Wrapped up the Last Day of Shoot for NSNI . Lovely Unit , lovely people . Thank you . I Thank each and every one on the Set . Such a smooth sail . Feeling soo touched . Gratitude ∞ — Allu Arjun (@alluarjun) 18 April 2018 The first and the last thing my actress Anu Emmanuel ever asked for was a SELFIE . Soo Sweet. My First Personal Picture with my Actress Anu Emmanuel after the Last Shot of the shoot . @ItsAnuEmmanuel pic.twitter.com/H541riaKYA — Allu Arjun (@alluarjun) 18 April 2018 -
నా పేరు సూర్య ఆడియో ఫంక్షన్...అక్కడా?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, వక్కంతం వంశీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘నా పేరు సూర్య’ పై అంచనాలు భారీగా ఉన్నాయి. మిలటరీ నేపథ్యం, బన్నీ నటన, భారీ యాక్షన్ సీన్స్ వీటన్నింటి దృష్ట్యా సినిమా గ్యారంటీగా హిట్ అవుతుందని అంటున్నారు బన్నీ అభిమానులు. ఇప్పటికే విడుదలైన టీజర్, డైలాగ్ ఇంపాక్ట్, సాంగ్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. సినిమాలోని మిగతా పాటలను మిలటరీ గ్రామమైన మాధవరం(ప.గో జిల్లా)లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారట చిత్రబృందం. ఈ ఊళ్లో ప్రతి ఇంటి నుంచి ఒకరు మిలటరీలో పనిచేస్తారు. ఈ సినిమాలో బన్నీ సోల్జర్‌గా నటిస్తున్నాడు, అందుకే మిలటరీ గ్రామంలో ఆడియో ఫంక్షన్‌ను ఏర్పాటు చేసే పనిలో ఉన్నట్లు సమాచారం. మే 4న ఈ సినిమా రిలీజ్ కానుంది విడుదలకు ముందు ఈ నెల చివర్లో హైద్రాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
‘అన్ని ఇండియాలు లేవురా మనకి’
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. బన్నీ తొలిసారిగా ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ సినిమాలో అను ఇమ్మాన్యూల్ హీరోయిన్గా నటిస్తోంది. పలు విజయవంతమైన చిత్రాలకు కథలు అందించిన వక్కంతం వంశీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మే 4న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్, టీజర్ కు మంచి రెస్పాన్స్ రావటంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. బన్నీ డిఫరెంట్ మేకోవర్‌లో డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్‌తో ఆకట్టుకుంటున్న ఈ సినిమాతో మరోసారి రికార్డ్‌లు తిరగరాయటం ఖాయం అని భావిస్తున్నారు ఫ్యాన్స్. ఈ రోజు(ఆదివారం) అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా డైలాగ్ ఇంపాక్ట్ ను రిలీజ్ చేశారు. విలన్ ‘సౌత్ ఇండియాకా సాలా’ అంటే ‘సౌత్ ఇండియా.. నార్త్ ఇండియా.. ఈస్ట్.. వెస్ట్.. అన్ని ఇండియాలు లేవురా మనకి ఒక్కటే ఇండియా’ అంటూ బన్నీ చెప్పిన డైలాగ్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. -
అల్లు అర్జున్ డైలాగ్ ఇరగదీసాడు
-
బన్నీ కొత్త సినిమాకి క్రేజీ డైరెక్టర్..!
డీజేతో మంచి కమర్షియల్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం తుది మెరుపులు దిద్దుకుంటున్న ఈ చిత్రం మే 4న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా తరువాత అల్లు అర్జున్ నటించబోయే చిత్రంపై అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ బన్ని మాత్రం ఇప్పటివరకు అధికారికంగా ఏ సినిమాను ఫైనల్ చేయలేదు. కానీ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో ఓ చిత్రానికి అంగీకరించినట్టుగా టాలీవుడ్ సమాచారం. మాస్ కమర్షియల్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న సంపత్ నంది, బన్నీల కాంబినేషన్ సెట్ చేసేందుకు నిర్మాత సీ. కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారట. ఇదివరకే మెగా హీరో రామ్ చరణ్‌కు ‘రచ్చ’తో విజయం అందించిన సంపత్, మరి అల్లు అర్జున్‌కు అదే స్థాయిలో విజయాన్ని అందించేందుకు కథను సిద్దం చేసుకున్నట్టు సమాచారం. కాగా సంపత్ నంది చివరగా తీసిన సినిమా ‘గౌతమ్‌నంద’ నిరాశపరచటంతో అల్లు అభిమానులు ఈ సినిమాపై కొంత కలవరచెందుతున్నారు. -
బన్నీ కొత్త సినిమా ఓకే చేశాడా..?
డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమా తరువాత గ్యాప్ తీసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా మే 4న రిలీజ్ కానుంది. అల్లు అర్జున్ ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ సినిమాలో అను ఇమ్మాన్యూల్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా తరువాత బన్నీ చేయబోయే సినిమాపై ఇంతవరకు అధికారిక ప్రకటన రాలేదు. అయితే తాజాగా కోలీవుడ్ లో ఓ ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. కమర్షియల్ విజయాలు లేకపోయినా.. అభిరుచి గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న క్రిష్ దర్శకత్వంలో బన్నీ తన నెక్ట్స్ సినిమాను చేయబోతున్నాడట. గతంలో క్రిష్ దర్శకత్వంలో వేదం సినిమాలో నటించిన బన్నీకి నటుడిగా మంచి పేరు వచ్చింది. తాజాగా మరోసారి అదే డైరెక్టర్‌తో వర్క్ చేసేందుకు బన్నీ ఇంట్రస్ట్ చూపిస్తున్నాడట. ఈ సినిమాకు అహం బ్రహ్మాస్మి అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. -
భారీ టన్నల్‌లో బన్నీ ఫైట్స్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రచయిత వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బన్నీ ఆవేశపరుడైన ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. అందుకు తగ్గట్టుగా సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. తాజాగా ఈ సినిమాలో కీలకమైన ఓ పోరాట సన్నివేశానికి సంబంధించిన అప్ డేట్ టాలీవుడ్ సర్కిల్స్‌లో హల్ చల్ చేస్తోంది. విరామం సమయంలో వచ్చే ఈ సినిమా సన్నివేశం హైదరాబాద్ నానక్‌రామ్‌గూడ దగ్గర ఓ భారీ టన్నల్ సెట్‌ను నిర్మించారట. ఈ ఫైట్ సీన్ సినిమాకే హైలట్‌గా నిలుస్తుందంటున్నారు చిత్రయూనిట్. బన్నీ సరసన అను ఇమ్మాన్యూల్ హీరోయిన్గా నటిస్తున్న ఈసినిమాను లగడపాటి శ్రీధర్, నాగబాబులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్ శేఖర్లు స్వరాలందిస్తున్నారు. -
బన్నీ అంకితమిచ్చేశాడు
సాక్షి, సినిమా : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రిపబ్లిక్ డే కానుక ఇచ్చేశాడు. తన తదుపరి చిత్రం నా పేరు సూర్య నుంచి మొదటి పాటను విడుదల చేసేశాడు. దేశ రక్షణ కోసం అహర్నిశలు పాటుపడుతున్నా సైనికులకు కోసం ’సైనిక‘ పాటను అంకితమిచ్చేశాడు. గణతంత్ర్య దినోత్సవ సందర్భంగా అందరికీ విషెస్ చెబుతూ బన్నీ ఈ పాటను విడుదల చేశాడు. ‘సరిహద్దులో నువ్వు లేకుంటే.. కనుపాప.. కంటి నిండుగా నిదుర పోదురా.. నిదుర పోదురా.... అంటూ రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం బాగుంది. విశాల్-శేఖర్ సమకూర్చిన రాకింగ్ మ్యూజిక్కు విశాల్ దడ్లానీ గాత్రం సరిపోయింది. భావోద్వేగంగా ఉన్న ఈ పాట అందరినీ ఆకట్టుకుంటుందనే చెప్పొచ్చు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ చిత్ర ఆల్బమ్ విడుదలయ్యింది. వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయిక కాగా, యాక్షన్ కింగ్ అర్జున్, రావు రమేష్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. సమ్మర్లో నా పేరు సూర్య ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏడు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాతలు సిద్ధమవుతున్నారు. -
అల్లు అర్జున్ రిపబ్లిక్ డే కానుక
-
ఏడు భాషల్లో బన్నీ చిత్రం!
సాక్షి, సినిమా : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు తెలుగుతోపాటు మళయాళంలోనూ మంచి మార్కెట్ ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఓ మాదిరిగా ఆడిన చిత్రాలు కూడా.. అక్కడ బ్లాక్ బస్టర్లు అయ్యాయి. అలాంటిది బన్నీ ఇప్పుడు తన మార్కెట్ పరిధిని మరింత విస్తరించుకునే పనిలో పడ్డాడు. అల్లు అర్జున్ తదుపరి చిత్రం నా పేరు సూర్యను ఏడు భాషల్లో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగుతోపాటు తమిళ్, హిందీ, మళయాళం, మరాఠీ, భోజ్‌పురి భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతుందని సమాచారం. దేశ భక్తికి సంబంధించిన కంటెంట్ కావటంతో అన్ని భాషల ప్రేక్షకులకు నచ్చుతుందన్న కాన్ఫిడెంట్‌లో మేకర్లు ఉన్నారంట. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కథా రచయిత వక్కంతం వంశీ ఈ చిత్రంతో దర్శకుడిగా మారాడు. రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్ పై లగడపాటి శ్రీధర్ నిర్మిస్తుండగా... నాగబాబు, బన్నీవాస్‌లు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ కాగా, సీనియర్ నటుడు అర్జున్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. విశాల్-శేఖర్ సంగీతం అందిస్తున్నారు. వేసవిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
బన్నీ తండ్రి పాత్రలో యాక్షన్ హీరో
సరైనోడు లాంటి సూపర్ హిట్ తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. ప్రముఖ రచయిత వక్కంతం వంశీ తొలిసారిగా దర్శకుడిగా మారి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బన్నీ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ ఇంపాక్ట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఈ సినిమాలో సీనియర్ నటుడు అర్జున్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈసినిమాలో అర్జున్ చేయబోయేది బన్నీ తండ్రి పాత్ర అని తెలుస్తోంది. ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో అను ఇమ్మాన్యూల్ హీరోయిన్ గా నటిస్తోంది. -
న్యూ ఇయర్‌కు బన్నీ గిఫ్ట్
సరైనోడు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం నా పేరు సూర్య. నా ఇళ్లు ఇండియా అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో రచయిత వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అను ఇమ్మాన్యూల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను లగడపాటి శ్రీధర్, బన్నీ వాస్ లు నిర్మిస్తున్నారు. మెగా బ్రదర్ నాగబాబు సమర్పణలో ఈ సినిమా తెరకెక్కుతోంది. చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సైనికుడిగా నటిస్తున్నాడు. సీనియర్ నటుడు అర్జున్ మరో కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 27న రిలీజ్ కానుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలను జనవరి 1న ప్రారంభించనున్నారు చిత్రయూనిట్. న్యూ ఇయర్ కానుకగా ఈ సినిమాతో ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని బన్నీ తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ సినిమాకు బాలీవుడ్ సంగీత దర్శకులు విశాల్ శేఖర్ స్వరాలందిస్తున్నారు. Naa Peru Surya Naa Illu India - First Impact on First Jan 2018 .#FirstImpactOn1stJan #NSNI pic.twitter.com/CCikn5cMXn — Allu Arjun (@alluarjun) 23 December 2017 -
బన్నీ ద్విభాషా చిత్రం మొదలవుతోంది..!
కొద్ది రోజుల క్రితం బన్నీ ఓ స్ట్రయిట్ తమిళ సినిమాను ఎనౌన్స్ చేశాడు. తమిళ దర్శకుడు లింగుసామి దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ బ్యానర్ పై త్వరలోనే సినిమా ప్రారంభిస్తామని చెన్నైలో ప్రెస్ మీట్ పెట్టి మరీ ఎనౌన్స్ చేశారు. అయితే తరువాత ఈ ప్రాజెక్ట్ పక్కకెళ్లిపోయింది. బన్నీ, వక్కంత వంశీ దర్శకత్వంలో సినిమా ప్రారంభిస్తే లింగుసామి.. విశాల్ హీరోగా పందెంకోడి సీక్వల్ ను తెరకెక్కిస్తున్నాడు. తాజాగా మరోసారి బన్నీ కోలీవుడ్ ఎంట్రీపై వార్తలు వినిపిస్తున్నాయి. బన్నీ, లింగుసామిల ప్రాజెక్ట్ ఆగిపోలేదని త్వరలోనే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారట. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందిస్తున్న ఈ సినిమాను 2018 వేసవిలో మొదలు పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే మలయాళ మార్కెట్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న బన్నీ ఈ సినిమాతో కోలీవుడ్ లో కూడా పాగా వేస్తాడేమో చూడాలి. -
స్టైలిష్ స్టార్ అభిమానులకు శుభవార్త..
‘స్టైలిష్ స్టార్’ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కనున్న కొత్త చిత్రం ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’. రచయిత నుంచి దర్శకుడిగా మారుతున్న వక్కంతం వంశీ రూపొందించనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ వచ్చేనెల నుంచి ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఇక ఈ మూవీలో అను ఎమ్మాన్యుయేల్‌ను హీరోయిన్గా సెలెక్ట్ చేశారు. గతేడాది నాని హీరోగా వచ్చిన మజ్ను చిత్రంలో అను కథానాయికగా నటించింది. ప్రస్తుతం పవన్–త్రివిక్రమ్‌ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీలోనూ నటిస్తోంది. ‘నా పేరు సూర్య..’ చిత్రాన్ని లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్నారు. -
డీజే రిలీజ్‌కు ముందే మరో సినిమా..!
ప్రస్తుతం డీజే దువ్వాడ జగన్నాథమ్ పనుల్లో బిజీగా ఉన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, తరువాత ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా మరో సినిమాను లైన్లో పెడుతున్నాడు. ఇప్పటికే డీజే షూటింగ్ ఆఖరి దశకు చేరుకోవటంతో తరువాత చేయబోయే సినిమా కోసం డేట్స్ అడ్జస్ట్ చేస్తున్నాడు. దువ్వాడ జగన్నాథమ్ సినిమా ఈ నెల 23న రిలీజ్ అవుతోంది. అంతకన్నా ముందే జూన్ 21 నుంచే కొత్త సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు. స్టార్ రైటర్ వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ సినిమా చేస్తున్నట్టుగా బన్నీ ఇప్పటికే ప్రకటించాడు. ఈ సినిమా షూటింగ్ ఈ నెల మూడో వారంలో ప్రారంభిస్తున్నారు. లగడపాటి శ్రీధర్, నాగబాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఎన్టీఆర్ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వాలని చాలా కాలం వెయిట్ చేసిన వక్కంతం వంశీ, ఎన్టీఆర్ డేట్స్ దొరక్కపోవటంతో బన్నీతో ఈ సినిమా చేస్తున్నాడు. -
పక్కాగా ప్లాన్ చేస్తున్న బన్నీ
ప్రస్తుతం డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమా పనుల్లో ఉన్న అల్లు అర్జున్, ఆ సినిమాను జూన్ 23న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే తాను చేయబోయే నెక్ట్స్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేస్తున్నాడు. ఇప్పటికే కథా రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో తన నెక్ట్స్ సినిమా ఉంటుదని ప్రకటించిన బన్నీ.. ఆ సినిమా రిలీజ్ డేట్‌పై కూడా ఓ నిర్ణయం తీసుకున్నాడు. యాక్షన్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కనున్న బన్నీ నెక్ట్స్ సినిమాను 2018 సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాకు బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్ శేఖర్లు సంగీతం అందిస్తుండగా.. రాజీవ్ రవి సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. అల్లు అర్జున్ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది. దువ్వాడ జగన్నాథమ్ పనులు పూర్తి చేసి జూన్ నెలలో ఈ సినిమాను ప్రారంభించాలని భావిస్తున్నారు. -
స్టైలిష్ స్టార్‌తో శాండల్‌వుడ్ బ్యూటీ
ప్రస్తుతం డీజే దువ్వాడ జగన్నాథమ్ షూటింగ్ లో బిజీగా ఉన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, తరువాత చేయబోయే సినిమాను కూడా లైన్ లో పెట్టాడు. ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డీజేలో బ్రాహ్మణుడి పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత ప్రముఖ రచయిత వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కిస్తున్న యాక్షన్ డ్రామాలో హీరోగా నటించేందుకు అంగీకరించాడు బన్నీ. ఇప్పటికే ఫైనల్ అయిన ఈ ప్రాజెక్ట్ కు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులతో పాటు నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఈ సినిమాలో బన్నీ సరసన హీరోయిన్గా శాండల్ వుడ్ బ్యూటీని పరిచయం చేయాలని భావిస్తున్నారట. కన్నడలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన కిర్రాక్ పార్టీ సినిమాతో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న రష్మిక మందనను హీరోయిన్గా తీసుకునే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే తెలుగులో పలు సినిమాలకు ఓకె చెప్పే ఆలోచనలో ఉన్న రష్మిక బన్నీ సినిమాలో ఛాన్స్ తప్పకుండా ఓకె చెప్పేస్తోంది. -
నవల రూపంలో ఎన్టీఆర్ సినిమా
రెగ్యులర్‌గా మాస్ సినిమాలు మాత్రమే చేస్తూ వస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, రూట్ మార్చి చేసిన తొలి చిత్రం టెంపర్. ఎప్పుడు తన సొంత కథలతోనే సినిమాలు చేసే పూరి జగన్నాథ్ ఫస్ట్ టైం ఈ సినిమా కోసం వక్కంతం వంశీ దగ్గర కథ తీసుకున్నాడు. ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ ఆఫీసర్‌గా నటించిన టెంపర్ ఘనవిజయం సాధించటంతో పాటు ఎన్టీఆర్‌ను అభిమానులకు మరింత చేరువ చేసింది. ఇప్పుడు ఈ సినిమాకు కథను మరింత మంది పాఠకులకు అందించనున్నాడు రచయిత వక్కంతం వంశీ. ఇప్పటికే తమిళ, హిందీ భాషల్లో రీమేక్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా కథను ఇంగ్లీష్ నవలగా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఆరు నెలలకు పైగా కష్టపడి వంశీ నవలను సిద్ధం చేశాడు. అయితే ఈ నవలలో క్లైమాక్స్‌ను సినిమాకు భిన్నంగా రాశాడట. ప్రస్తుతానికి ఆ క్లైమాక్స్ ఏంటన్నది మాత్రం సస్పెన్స్. -
బన్నీ కెరీర్లో రెండో సారి..!
తన కెరీర్లో ఇప్పటి వరకు పదహారు సినిమాల్లో నటించిన యంగ్ హీరో అల్లు అర్జున్ కేవలం ఒక్క సినిమాను మాత్రమే కొత్త దర్శకుడితో కలిసి చేశాడు. కెరీర్ స్టార్టింగ్ లోనే సుకుమార్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఆర్య సినిమా చేసి అల్లు అర్జున్, ఆ తరువాత ఇంత వరకు ఒక్క కొత్త దర్శకుడితో కూడా సినిమా చేయలేదు. అయితే ఇన్నేళ్ల తరువాత మరోసారి ఓ డెబ్యూ డైరెక్టర్‌తో సినిమాకు రెడీ అవుతున్నాడు బన్నీ. ప్రముఖ కథా రచయిత వక్కంతం వంశీ, దర్శకుడిగా మారి తెరకెక్కించనున్న సినిమాలో అల్లు అర్జున్ హీరోగా నటించేందుకు అంగీకరించాడు. ఇప్పటికే హరీష్ శంకర్ దర్శకత్వంలో డిజె దువ్వాడ జగన్నాథమ్, తమిళ దర్శకుడు లింగుసామితో మరో సినిమాను ప్రారంభించిన బన్నీ ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాత వంశీ దర్శకత్వంలో సినిమాను ప్రారంభించేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. -
వంశీ సినిమా బన్నీతోనా..?
టాలీవుడ్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కథా రచయితగా మంచి పేరు తెచ్చుకున్న రైటర్ వక్కంతం వంశీ ఇప్పుడు దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నారు. ఇప్పటికే కథ రెడీ చేసుకున్న ఈ స్టార్ రైటర్, తన అభిమాన కథానాయకుడు ఎన్టీఆర్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యేందుకు ప్లాన్ చేసుకున్నాడు. ఈ సినిమాను కళ్యాణ్ రామ్ నిర్మాతగా తెరకెక్కిస్తారంటూ పోస్టర్లు కూడా రిలీజ్ అయ్యాయి. అయితే తాజాగా జనతా గ్యారేజ్ రిలీజ్ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఎన్టీఆర్ తన నెక్ట్స్ సినిమా విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నాని.. ఆ తరువాతే నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను ఫైనల్ చేస్తానని తెలిపాడు. దీంతో వక్కంతం వంశీ ప్రాజెక్ట్‌పై ఎన్టీఆర్ పునరాలోచనలో ఉన్నాడన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే చాలా కాలంగా ఎన్టీఆర్ కోసం ఎదురుచూస్తున్న వంశీ కూడా తన సొంతం ప్రయత్నాల్లో ఉన్నాడన్న ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ ఎటూ తేల్చని నేపథ్యంలో అల్లు అర్జున్ హీరోగా సినిమా ప్రారంభించే ఆలోచనలో ఉన్నాడట. ఇప్పటికే హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమాను ప్రారంభించిన బన్నీతో సినిమా మొదలు పెట్టాలన్నా సమ్మర్ వరకు ఆగాల్సిందే. మరి వంశీ సినిమా ఎవరితో మొదలవుతుందో తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. -
ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ టైటిల్ ఫిక్స్..?
వరుస సక్సెస్‌లతో మంచి ఫాంలో ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌కు రెడీ అవుతోంది. కొరటాల శివ డైరెక్షన్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో నటించటం లాంటి అంశాలతో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. జనతా గ్యారేజ్ రిలీజ్‌కు ముందే తన నెక్ట్స్ సినిమాను కూడా ఫైనల్ చేసిన జూనియర్, ఆ సినిమాకు టైటిల్ కూడా ఫిక్స్ చేశాడన్న టాక్ వినిపిస్తోంది. ఇచ్చిన మాట ప్రకారం తన నెక్ట్స్ సినిమాను వక్కంతం వంశీ దర్శకత్వంలో చేసేందుకు రెడీ అవుతున్నాడు జూనియర్. ఈ సినిమాను ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై రూపొందిస్తున్నాడు. ఎన్టీఆర్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ సినిమాకు ధడ్కన్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారట. ఎన్టీఆర్ మార్క్ మాస్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ను రెడీ చేసే పనిలో ఉన్నాడు వక్కంతం వంశీ. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. -
ఇది దయాగాడి దండయాత్ర...
‘దండయాత్ర... ఇది దయాగాడి దండయాత్ర’ అంటూ ‘టెంపర్’ చూపించారు ఎన్టీఆర్. యంగ్ టైగర్ నటనలో ఫైర్‌కు రెండున్నర గంటల తెరరూపమే ఈ ‘టెంపర్’ సినిమా. ఈ కథను రాసిన వక్కంతం వంశీ ఇంతకంటే పవర్ఫుల్ క్యారెక్టర్లో ఎన్టీఆర్‌ను చూపించనున్నారు. విశేషం ఏంటంటే... ఈ చిత్రానికి తానే దర్శకత్వం వహించనున్నారు కూడా. ఎన్టీఆర్‌తో ఓ భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కించనున్నారు. దీని కోసం ఓ పవర్ఫుల్ స్టోరీ కూడా రెడీ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ అన్న, హీరో కల్యాణ్‌రామ్ నిర్మించనున్నారు. ఆగస్టులో ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. సెప్టెంబర్ 2న ‘జనతా గ్యారేజ్’ విడుదలైన తర్వాత వక్కంతం వంశీ, ఎన్టీఆర్ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆరంభం కానుంది. ఇదిలా ఉంటే.. రచయితల్లో మంచి దర్శకులు కూడా ఉంటారని ఇప్పటికే త్రివిక్రమ్, కొరటాల శివ వంటి వాళ్లు నిరూపించారు. ఇప్పుడు వక్కంతం వంశీ కూడా దర్శకుడిగా మారనున్నారు. ఇప్పటివరకూ దర్శకులుగా కూడా సక్సెస్ అయిన రచయితల జాబితాలో వంశీ కూడా చేరతారని ఊహించవచ్చు. -
నెక్ట్స్ సినిమా వంశీతోనే
నాన్నకు ప్రేమతో సినిమాతో సూపర్ ఫాంలోకి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ వరుసగా సినిమాలు కమిట్ అవుతున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ సినిమాలో నటిస్తున్న ఎన్టీఆర్, ఆ తరువాత చేయబోయే సినిమా విషయంలో కూడా క్లారిటీ ఇచ్చేశాడు. శుక్రవారం ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా బుడ్డోడు చేయబోయే నెక్ట్స్ సినిమా పోస్టర్ రిలీజ్ అయ్యింది. చాలా రోజులుగా వక్కంత వంశీ డైరెక్షన్లో సినిమా చేయనున్నట్టుగా చెపుతున్న ఎన్టీఆర్ తన 27వ సినిమా వంశీ డైరెక్షన్ లో నటించడానికి అంగీకరించాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో 9వ సినిమాగా హీరో కళ్యాణ్ రామ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాలకు కథా రచయితగా వ్యవహరించిన వక్కంతం వంశీ, ఎన్టీఆర్‌తో చేయబోయే సినిమా కోసం ఓ పవర్ ఫుల్ కమర్షియల్ సబ్జెక్ట్ రెడీ చేశాడన్న టాక్ వినిపిస్తోంది. జనతా గ్యారేజ్ సినిమాను ఆగస్టులో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు, ఆ తరువాత వెంటనే వక్కంతం వంశీ దర్శకత్వంలో కొత్త సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.Happy Birthday nanna @tarak9999 #NTR27 pic.twitter.com/XPwdnFO0Xw— KALYANRAM NANDAMURI (@NANDAMURIKALYAN) 19 May 2016 -
వంశీ కధని డైరెక్ట్ చేస్తోన్న పూరీ
-
వంశీ కథతో.. పూరీ సినిమా!
-
వక్కంతం వంశీ కథతో...
పూరీ జగన్నాథ్ మంచి దర్శకుడే కాదు, మంచి రచయిత కూడా. ఆయన కథలు, మాటలు యువతరాన్ని కట్టిపడేస్తాయి. కానీ తొలిసారి ఆయన వేరే రచయిత స్క్రిప్ట్‌తో సినిమా చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. వివరాల్లోకెళ్తే- ‘ఎన్టీఆర్-పూరీ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కలయికలో పదేళ్ల క్రితం ‘ఆంధ్రా వాలా’ వచ్చింది. ఇంత విరామం తర్వాత మళ్లీ ఇద్దరూ కలిసి చేస్తున్న సినిమా ఇది. అయితే... ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలోనే పూరీ కాస్త విభిన్నంగా వెళ్తున్నట్లు తెలిసింది. తొలిసారి వేరే రచయిత స్క్రిప్ట్‌తో ఆయన ఈ సినిమా చేయనున్నారట. ఆ రచయిత ఎవరో కాదు... వక్కంతం వంశీ. ఈ సినిమాకు ‘కుమ్మేస్తా’ అనే టైటిల్ ప్రస్తుతం ప్రచారంలో ఉంది. ఆయితే... ఈ సినిమాకు అది టైటిల్ కానేకాదని చిత్రం యూనిట్ సభ్యులు చెబుతున్నారు. బండ్ల గణేశ్ ఈ చిత్రానికి నిర్మాత. ఇంకా ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.