
స్టైలిష్ స్టార్ అభిమానులకు శుభవార్త..
‘స్టైలిష్ స్టార్’ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కనున్న కొత్త చిత్రం ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’. రచయిత నుంచి దర్శకుడిగా మారుతున్న వక్కంతం వంశీ రూపొందించనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ వచ్చేనెల నుంచి ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఇక ఈ మూవీలో అను ఎమ్మాన్యుయేల్‌ను హీరోయిన్‌గా సెలెక్ట్ చేశారు. గతేడాది నాని హీరోగా వచ్చిన మజ్ను చిత్రంలో అను కథానాయికగా నటించింది. ప్రస్తుతం పవన్–త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీలోనూ నటిస్తోంది. ‘నా పేరు సూర్య..’ చిత్రాన్ని లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్నారు.