Naa Peru Surya Naa Illu India
-
బన్నీ.. ఉగాది రోజున క్లారిటీ ఇస్తాడట!
నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా డిజాస్టర్ కావటంతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆలోచనలో పడ్డాడు. తరువాత చేయబోయే సినిమాల విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. చాలా కథలు విన్న తరువాత ఫైనల్‌గా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయబోతున్నట్టుగా ప్రకటించాడు బన్నీ. అయితే సినిమా ప్రకటించి చాలా రోజులైన ఇంతవరకు ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లలేదు. దీంతో అభిమానుల్లో అనుమానాలు మొదలయ్యాయి. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ తరువాత త్వరలో వివరాలు వెల్లడిస్తాం అన్న ప్రకటన వచ్చినా అభిమానులు సంతృప్తి చెందలేదు. అయితే ఉగాది సందర్భంగా సినిమాకు సంబంధించి క్లారిటీ ఇచ్చేందుకు చిత్రయూనిట్ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు దాదాపు కొలిక్కి రావటంతో షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది. రిలీజ్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంది లాంటి అంశాలను ఉగాది రోజు వెల్లడిస్తారని తెలుస్తోంది. ముందుగా ఈ ప్రాజెక్ట్ కోసం బాలీవుడ్ సినిమాను రీమేక్ చేయాలని భావించినా వర్క్ అవుట్ కాకపోవటంతో కొత్త కథతోనే సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది. గీతా ఆర్ట్స్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్‌కు జోడిగా పూజా హెగ్డే నటించనుంది. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన డీజే దువ్వాడ జగన్నాథం భారీ వసూళ్లు సాధించటంతో సెంటిమెంట్ పరంగా కూడా పూజా కలిసొస్తుందని భావిస్తున్నారట చిత్రయూనిట్. -
‘త్వరలో బిగ్ న్యూస్.. కాస్త వెయిట్ చేయండి’
‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్ ఇటీవల త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించారు. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా ఎనౌన్స్మెంట్ తరువాత ఎలాంటి అప్డేట్ బయటకు రాలేదు. దీంతో అభిమానులు సినిమా ఎప్పుడు మొదలవుతుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అభిమానుల ఉత్సాహాన్ని గమనించిన నిర్మాతలు సినిమాకు సంబంధించి ఓ ప్రకటన చేశారు. ‘అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల కాంబినేషన్‌పై అభిమానులతో పాటు మేం కూడా చాలా ఆత్రుతగా ఉన్నాం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న కారణంగా ఎలాంటి అప్డేట్స్ ఇవ్వలేకపోతున్నాం. అన్ని సెట్ అయ్యాక సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తాం’అంటూ తమ అఫీషియల్ ట్విటర్ పేజ్‌లో ట్వీట్ చేశారు. అల్లు అర్జున్ టాలీవుడ్లో అడుగుపెట్టి 16 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. As the pre-production works are going on at full swing, we will only be able to share once everything is concrete. Kindly, bare with us until such day. Very soon, we will come up with all the updates!@GeethaArts @vamsi84 2/2 — Haarika & Hassine Creations (@haarikahassine) 28 March 2019 -
బన్నీ స్టార్ట్ చేస్తున్నాడు..!
నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాతో షాక్ తిన్న అల్లు అర్జున్, తదుపరి చిత్రాన్ని ప్రారంభించేందుకు చాలా సమయం తీసుకుంటున్నాడు. ఇంతవరకు తదుపరి ప్రాజెక్ట్‌ను ఫైనల్ చేయని బన్నీ ఇద్దరు ముగ్గురు దర్శకుల్ని లైన్లో పెట్టాడు. ముఖ్యంగా విక్రమ్ కుమార్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌లో ఎవరో ఒకరితో బన్నీ సినిమా ఉంటుందన్న ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది. తాజాగా త్రివిక్రమ్ తో సినిమా చేసేందుకే బన్నీ ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు మంచి విజయాలు సాధించాయి. అందుకే మరోసారి బన్నీ త్రివిక్రమ్‌కే ఓటేసినట్టుగా తెలుస్తోంది. అన్ని ఓకే అయితే డిసెంబర్లోనే సినిమాలు పట్టాలెక్కించేలా ప్లాన్ చేస్తున్నారట. అరవింద సమేత హిట్‌తో మంచి ఫాంలో ఉన్న మాటల మాంత్రికుడు అల్లు అర్జున్ కోసం ఎలాంటి కథ రెడీ చేస్తున్నాడో చూడాలి. -
అత్తగారింటిలో సందడి చేస్తున్న బన్నీ
-
అత్తగారింటిలో సందడి చేస్తున్న బన్నీ
సాక్షి, నల్గొండ: షూటింగ్‌లతో బిజీగా ఉండే స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కొన్ని రోజులుగా సినిమా షూటింగ్స్‌కి బ్రేక్ తీసుకుంటున్నారు. ఈ గ్యాప్‌లో ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తున్నారు. ఇక ఈ విరామ సమయంలోనే వచ్చిన దసరా పండుగను స్పెషల్‌గా అత్తగారింటిలో జరుపుకుంటున్నాడు. బన్నీ సతీమణి స్నేహారెడ్డి అమ్మమ్మ స్వగ్రామమైన నల్లగొండ జిల్లా పెద్దపూర మండలం చింతపల్లి గ్రామమానికి అల్లు అర్జున్ దంపతులు విచ్చేసి సందడి చేశారు. ఈ విషయం తెలిసిన గ్రామస్తులు ..అల్లు అర్జున్ ను చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. బన్నీ రాకతో చింతపల్లి గ్రామ ప్రజలు దసరా పండుగను రెట్టింపు ఉత్సాహంతో జరుపుకుంటున్నారు. ఇక తనను కలిసి విషెస్ చెప్పిన వారందరికీ కృతజ్ఞతల తెలిపారు. కాసేపు చిన్నారులతో కలిసి బన్నీ సందడి చేశారు. అలాగే పలువురు బన్నీతో సెల్పీలు, ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు. ఈ సందర్భంగా వారిని అదుపు చేయటానికి స్నేహారెడ్డి కుటుంబసభ్యులు కష్టపడాల్సి వచ్చింది. (బన్నీతో హ్యాట్రిక్ సినిమా..!) ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ సినిమాతో షాక్ తిన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇంత వరకు కొత్త సినిమాను ప్రకటించలేదు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుందన్న ప్రచారం జరుగుతున్నా ఇంత వరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. అయితే ఈ గ్యాప్‌లో బన్నీ తనకు జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి సూపర్ హిట్ చిత్రాలను అంధించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నాడట. (గణపతి బప్పా మోరియా) -
సమంత ట్వీట్.. స్పందించిన బన్నీ!
సాక్షి, హైదరాబాద్ : హార్డ్వర్క్లో నటుడు అల్లు అర్జున్ ‘హీరో’ అని స్టార్ హీరోయిన్ సమంత ప్రశంసించారు. ఇంతకీ విషయం ఏంటంటారా.. బన్నీ కథానాయకుడిగా నటించిన సినిమా ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’.. వక్కంతం వంశీ దర్శకత్వంలో వచ్చిన ఆ మూవీలో ‘లవర్ ఆల్సో, ఫైటర్ ఆల్సో’ పాటలో అల్లు అర్జున్ క్యాప్‌తో చేసిన డ్యాన్స్ స్టెప్స్ హైలైట్‌గా నిలిచాయి. క్యాప్ ట్రిక్ డ్యాన్స్‌ను తాను మూడు గంటలపాటు యత్నించినా చేయలేకపోయానని సమంత ట్వీట్ చేశారు. అందుకే అల్లు అర్జున్ హార్డ్‌వర్కర్ అని ఆమె కితాబిచ్చారు. సమంత ట్వీట్‌పై బన్నీ స్పందిస్తూ రీట్వీట్ చేశారు. థ్యాంక్యూ స్యామ్. ట్రిక్స్ నేర్పించడంతో నాకు ఎలాంటి సమస్య లేదు. ఇతరులు నేర్పిస్తే నేర్చుకోవడం చాలా తేలిక అని తన ట్విట్లో పేర్కొన్నాడు అల్లు అర్జున్. బన్నీ రీట్వీట్‌పై సమంత స్పందిస్తూ.. ధన్యవాదాలు తెలియజేసే ఎమోజీలు పోస్ట్ చేశారు. Thank you Sam . Just saw this . I don’t mind teaching some tricks :) it’s easier when som1 teaches . — Allu Arjun (@alluarjun) 15 August 2018 🙏🙏🙏 https://t.co/BGO5yohohC — Samantha Akkineni (@Samanthaprabhu2) 15 August 2018 -
మాస్ హీరో.. వంశీకి చాన్స్ ఇస్తాడా..?
అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన రచయిత వక్కంతం వంశీ. ఎన్నో విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేసిన వంశీ దర్శకుడిగా మాత్రం పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయాడు. నా పేరు సూర్య రిలీజ్ తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న వక్కంతం వంశీ ఇంత వరకు తన తదుపరి చిత్రాన్ని ప్రకటించలేదు. తాజాగా వంశీ చేయబోయే నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై ఆసక్తికర వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. మాస్ మహరాజ్ రవితేజ హీరోగా ఓ సినిమా చేసేందుకు వంశీ ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రవితేజ.. శ్రీనువైట్ల దర్శకత్వంలో అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఎక్కడి పోతావు చిన్నవాడా ఫేం వీఐ ఆనంద్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడన్న ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాతో పాటు వక్కంతం వంశీ దర్శకత్వంలోనూ సినిమా చేయనున్నాడట. అయితే ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. -
బన్నీ ఫ్యాన్స్ వేధింపులు ఆగట్లేదు
సాక్షి, తిరువనంతపురం: నా పేరు సూర్య చిత్రం రివ్యూ ఆమెను చిక్కుల్లో పడేసింది. అపర్ణ ప్రశాంతి అనే ప్రీలాన్స్ ఫిలిం క్రిటిక్ చిత్రం అస్సలు బాగోలేదంటూ తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశారు. దీంతో అల్లు అర్జున్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఆమెను వేధించటం ప్రారంభించారు. ఈ తతంగంపై గురువారం మల్లాపురం పోలీస్‌స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేశారు. అయితే అప్పటి నుంచి ఆమెకు మరింతగా వేధింపులు ఎక్కువయ్యాయని అపర్ణ చెబుతున్నారు. ‘గత నాలుగేళ్ల నుంచి పలు ప్రముఖ పత్రికలకు కూడా రివ్యూలు రాస్తున్నా. మోహన్‌లాల్, మమ్మూటీ లాంటి స్టార్ల విషయంలో కూడా ఖచ్ఛితమైన రివ్యూలు ఇచ్చా. వాళ్ల ఫ్యాన్స్ నుంచి నాకు ఏనాడూ ఇలాంటి బెదిరింపులు ఎదురుకాలేదు. కానీ, ఇప్పుడు ఈ చిత్రం విషయంలోనే నాకీ పరిస్థితి ఎదురైంది. సంస్కారం లేకుండా అసభ్యపదజాలంతో నన్ను తిడుతున్నారు. రేప్ చేసి గుణపాఠం నేర్పుతారంట.వాళ్ల ఇళ్లలో కూడా మహిళలు ఉన్నారన్న విషయం వారికి కనిపించటం లేదేమో. సైనికుడి సినిమాను కించపరుస్తున్నావ్. నువ్వేమైనా దేశద్రోహివా?పాకిస్థాన్ గూడఛారివా? అంటూ విమర్శించారు. సినిమా బాగోలేదు అన్నందుకు నన్ను, నా కుటుంబాన్ని చెప్పలేని భాషలో ఇంతలా తిట్టి పోయాలా? అని ఆమె ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘సినిమా చూస్తున్నంత సేపు తలనొప్పి వచ్చింది. అదేం దేశభక్తో కాస్త కూడా నాకు అర్థం కాలేదు. బయటకు వెళ్దామంటే కుండపోత వర్షం. ఆ కారణంగా బలవంతంగా థియేటర్లోనే ఉండిపోయా’ అని వెటకారంగా ఆమె నా పేరు సూర్య సినిమాకు రివ్యూ ఇచ్చారు. అక్కడి నుంచి బన్నీ ఫ్యాన్స్ ఆమెను వేధించటం ప్రారంభించారు. ఆమెకు మద్ధతుగా పలు మీడియా ఛానెళ్లు నిలవటం విశేషం. -
సూర్య విత్ క్రిష్
-
‘నా పేరు సూర్య..థ్యాంక్యూ ఇండియా ఫంక్షన్
-
బన్నీ కోసం రంగంలోకి పవన్
సాక్షి, హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా డివైడ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో బన్నీ నటనకు మాత్రం ప్రశంసలు దక్కాయి. యాంగ్రీ యంగ్ సోల్జర్‌గా బన్నీ ఆకట్టుకున్నాడని విమర్శకులు సైతం ప్రశంసలు గుప్పించారు. దీనికి తోడు వీకెండ్లో ఈ చిత్రం మంచి కలెక్షన్లు రాబట్టింది. దీంతో ప్రమోషన్లను పెంచేపనిలో మేకర్లు బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 10వ తేదీన చిత్ర సక్సెస్ మీట్‌ను గ్రాండ్‌గా నిర్వహించబోతున్నారు. దీనికి చీఫ్ గెస్ట్‌గా పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హాజరుకానున్నారని టాక్. ఈ మధ్యే పవన్.. రామ్ చరణ్ రంగస్థలం సక్సెస్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. ఇప్పుడు పవన్ రాకతో ‘నా పేరు సూర్య’ వసూళ్లపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదన్నది సినీ ట్రేడ్ పండితుల మాట. చూద్దాం ఇది ఏ మేర సాయపడుతుందో. వక్కంతం వంశీ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని లగడపాటి శ్రీధర్, నాగబాబు, బన్నీ వాసు సంయుక్తంగా నిర్మించారు. అనూ ఇమ్మాన్యూయేల్, అర్జున్ సర్జా, వెన్నెల కిషోర్, పోసాని, శరత్ కుమార్ తదితరులు నటించారు. బార్డర్‌కు వెళ్లాలని కలలు కనే కోపిష్టి సైనికుడు.. అందుకోసం తన క్యారెక్టర్ మార్చుకుంటాడా? అన్న కాన్సెప్ట్‌తో నా పేరు సూర్య చిత్రం తెరకెక్కింది. -
భరత్, సూర్యలను మించిన ‘మహానటి’
అలనాటి అందాల నటి సావిత్రి జీవితకథ ఆధారంగా మహానటి సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. కీర్తీ సురేష్, సావిత్రి పాత్రలో నటించిన ఈ సినిమా రేపు (మే 9న) విడుదలవుతోంది. ఎవడే సుబ్రమణ్యం ఫేం నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నిడివి ఇప్పుడు ఫిలిం నగర్లో హాట్ టాపిక్‌గా మారింది. దాదాపుగా మూడు గంటల నిడివితో మహానటి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన మహేష్ బాబు భరత్ అనే నేను 2 గంటల 53 నిమిషాల నిడివితో రిలీజ్ అయ్యింది. అల్లు అర్జున్ నా పేరు సూర్య 2 గంటల 48 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రాగా ఆ రెండు సినిమాల కన్నా మహానటి నిడివి ఎక్కువగా ఉండనుంది. 2 గంటల 56 నిమిషాల నిడివితో మహానటి విడుదలకు రెడీ అయ్యింది. రామ్ చరణ్ రంగస్థలం మాత్రం మహానటి కన్నా ఎక్కువ నిడివితో 2 గంటల 59 నిమిషాల రన్‌టైంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భరత్ అనే నేను, నా పేరు సూర్య సినిమాల విషయంలో సినిమా లెంగ్త్‌పై నెగెటివ్ కామెంట్స్ వినిపించాయి. మరి మహానటి అలాంటి కామెంట్స్ లేకుండా అలరిస్తుందేమో చూడాలి. -
అల్లు అర్జున్ పెద్ద మనసు..!
విశాఖపట్టణం సమీపంలోని అనకాపల్లిలో నివసించే దేవసాయి గణేష్ అల్లు అర్జున్‌కు వీరాభిమాని. కొంత కాలంగా బోన్ కేన్సర్‌తో బాధపుడుతున్న గణేష్ తన అభిమాన కథనాయకుడ్ని ఒక్కసారి చూడాలనుకున్నాడు. ఈ విషయం బన్నీకి వరకు వెళ్లింది. కొంతకాలంగా నా పేరు సూర్య సినిమాతో బిజీగా ఉన్న బన్నీ.. సినిమా విడుదల కావటంతో ఫ్రీ అయ్యాడు. దీంతో కష్టాల్లో ఉన్న తన అభిమానిని కలిసేందుకు బన్నీ స్వయంగా తన ఇంటికి వెళ్లాడు. కష్టాల్లో ఉన్న అభిమానికి ఆర్థిక సాయం కూడా అంధించాడు తన ఫేవరెట్ హీరో తన కోసం రావటంతో సాయి గణేష్ ఆనందానికి అవధుల్లేవు. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా.. కలెక్షన్ల పరంగా మాత్రం దూసుకుపోతోంది. -
నా పేరు సూర్య : తొలి రోజే 40 కోట్లు
అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమాలో బన్నీ సైనికుడిగా కనిపించాడు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి రిలీజ్ అయిన ఈ సినిమా బన్నీ కెరీర్లోనే బిగెస్ట్ ఓపెనింగ్స్ సాధించింది. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా తొలి రోజు 40 కోట్ల రూపాయల గ్రాస్ సాధించినట్టుగా తెలుస్తోంది. బన్నీ కెరీర్లోనే తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా నా పేరు సూర్య రికార్డ్ సృష్టించింది. బన్నీ సరసన అను ఇమ్మాన్యూల్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో శరత్ కుమార్, అర్జున్, బొమన్ ఇరానీ, రావూ రమేష్, నదియాలు ఇతర కీలకపాత్రలో నటించారు. చాలా కాలం తరువాత మెగా బ్రదర్ నాగబాబు ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించగా లగడపాటి శిరీషా, బన్నీ వాసులు సంయుక్తంగా నిర్మించారు. -
‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ రివ్యూ
టైటిల్ : నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా జానర్ : యాక్షన్ డ్రామా తారాగణం : అల్లు అర్జున్, అను ఇమ్మాన్యూయేల్, అర్జున్, శరత్ కుమార్, బొమన్ ఇరానీ, రావూ రమేష్ సంగీతం : విశాల్ - శేఖర్ కథ, స్క్రీన్ ప్లే, డైలాగులు, దర్శకత్వం : వక్కంతం వంశీ నిర్మాత : లగడపాటి శ్రీధర్, నాగబాబు, బన్నీ వాసు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన సినిమా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. ఈ సినిమాలో బన్నీ డిఫరెంట్ మేకోవర్‌లో.. డిఫరెంట్ మేనరిజమ్స్‌తో సోల్జర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ సినిమా మీద అంచనాలను భారీగా పెంచేశాయి. మరి ఆ అంచనాలను నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అందుకుందా.? వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న బన్నీ మరోసారి తన స్టామినా ప్రూవ్ చేసుకున్నాడా..? ఎన్నో విజయవంతమైన కథలు అందించిన వక్కంతం వంశీ దర్శకుడిగా తొలి ప్రయత్నంలో విజయం సాధించాడా..? కథ; సూర్య (అల్లు అర్జున్) కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని యువకుడు. తన ఆవేశంతో ప్రతీ ఒకరితో గొడవపడుతూ ఉంటాడు. చిన్నతనంలో ఓ గొడవ కారణంగా ఇంట్లోంచి వెళ్లిపోతాడు. పెద్దయ్యాక సైన్యంలో చేరి అక్కడా తన తీరును మార్చుకోడు. ఈ క్రమంలో ఓ మినిస్టర్ కొడుకుతో గొడవపడటం, తరువాత ఆర్మీ నిర్భందంలో ఉన్న ఓ వ్యక్తిని చంపటంతో ఉన్నతాధికారులు సూర్య మీద చర్యలు తీసుకుంటారు. (సాక్షి రివ్యూస్) తన మీద తనకు కంట్రోల్ లేని వాడు సైన్యంలో పనికిరాడంటూ ఆర్మీ నుంచి సస్పెండ్ చేస్తారు. తిరిగి ఆర్మీలో చేరాలంటే తాను మానసికంగా ఫిట్‌గా ఉన్నట్లు ప్రముఖ సైకాలజిస్ట్ రామకృష్ణం రాజు (అర్జున్) నుంచి సర్టిఫికేట్ తీసుకురావాలని కండిషన్ పెడతారు. ఆ పని మీద వైజాగ్ వచ్చిన సూర్యకు సమస్యలు ఎదురవుతుంటాయి. చల్లాతో గొడవలు పెట్టుకుంటాడు. ఇంతకీ రామకృష్ణంకు సూర్యకు మధ్య సంబంధం ఏంటి..? సూర్య తన క్యారెక్టర్ని వదులుకొని తిరిగి ఆర్మీలో చేరాడా? అన్నదే మిగతా కథ. నటీనటులు ; అల్లు అర్జున్ గతంలో ఎన్నడూ చేయని ఓ డిఫరెంట్ క్యారెక్టర్లో కనిపించాడు. యాంగ్రీ యంగ్‌మెన్‌గా మంచి నటన కనబరిచాడు. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని యువకుడిగా.. అదే సమయంలో దేశం కోసం ప్రాణమిచ్చే దేశ భక్తుడి షేడ్స్‌లో ఆకట్టుకున్నాడు. రొమాంటిక్ సీన్స్ లోనూ తన మార్క్ చూపించాడు. బన్నీ స్టైలిష్ డాన్స్ మూమెంట్స్ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. యాక్షన్ సీన్స్‌లోనూ బన్నీ పడిన కష్టం తెర మీద కనిపించింది. (సాక్షి రివ్యూస్)హీరోయిన్గా వర్ష పాత్రలో అనూ ఇమ్మాన్యూల్ ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఉన్నంతలో నటనతో పాటు గ్లామర్ షోతోనూ అలరించింది. రామకృష్ణంరాజు పాత్రలో నటించిన సీనియర్ నటుడు అర్జున్ సెటిల్డ్ ఫెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నారు. స్టైలిష్‌గా కనిపించిన అర్జున్ తన పాత్రలో ఒదిగిపోయారు. శరత్ కుమార్ తనకు అలవాటైన ఎగ్రెసివ్ రోల్ లో మరోసారి మెప్పించాడు. మరో విలన్ అనూప్ థాకూర్ సింగ్ యాక్షన్ సీన్స్‌లో ఆకట్టుకున్నాడు. ఇతర పాత్రల్లో నదియా, బొమన్ ఇరాని, వెన్నెల కిశోర్, రావూ రమేష్, పోసాని కృష్ణమురళీ, ప్రదీప్ రావత్‌లు తమ పరిధి మేర మెప్పించారు. విశ్లేషణ ; సూపర్ హిట్ కథలు అందించిన వక్కంతం వంశీ దర్శకుడిగా తొలి ప్రయత్నంలో డిఫరెంట్ కాన్సెప్ట్‌ను ఎంచుకున్నాడు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ను అభిమానులకు డిఫరెంట్ మేకోవర్‌లో చూపించాడు. లుక్ పరంగానే కాదు బాడీ లాంగ్వేజ్, మేనరిజమ్స్ ఇలా ప్రతీ విషయంలోనూ బన్నీని కొత్తగా చూపించాడు దర్శకుడు. మొదటి నుంచి సినిమాను దేశభక్తి సినిమాగా ప్రమోట్ చేసినా రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉండేలా జాగ్రత్త పడ్డాడు. (సాక్షి రివ్యూస్)అయితే తొలి భాగాన్ని ఆసక్తికరంగా నడిపించిన వంశీ, ద్వితీయార్థంలో మాత్రం కాస్త తడబడ్డాడు. సెకండ్ హాఫ్ కథనం కాస్త నెమ్మదించటం ప్రేక్షకులను ఇబ్బంది పెడుతుంది. ప్రేమకథను కూడా అంత ఆసక్తికరంగా మలచలేదు. క్లైమాక్స్ విషయంలోనూ ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్ శేఖర్లు బన్నీ ఎనర్జీకి తగ్గ ట్యూన్స్ తో అలరించారు. మాస్ ఐటమ్ నంబర్, రొమాంటిక్ మెలోడి, ఫ్యామిలీ సాంగ్ ఇలా అన్ని వేరియేషన్స్ లోనూ ఆకట్టుకున్నారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమా స్థాయిని మరింత పెంచారు. వంశీ రాసిన డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయి. రాజీవ్ రవి సినిమాటోగ్రఫి సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్. ఆర్మీ సీన్స్ తో పాటు ఇతర సన్నివేశాలను అద్భుతంగా కెమెరాలో బంధించాడు రాజీవ్. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. సరిహద్దులో శత్రువుల కంటే.. దేశం లోపల ఉన్న దుష్టశక్తులు ప్రమాదకరమని భావించి వాటితో పోరాటం చేసే ఆవేశపరుడైన సైనికుడి కథే ఇది. అయితే తొలి ప్రయత్నంలో బలమైన కథను రాసుకున్న దర్శకుడు వక్కంతం వంశీ.. దానిని తెరపై మాత్రం అంత ఆసక్తికరంగా మలచలేకపోయాడు. ప్లస్ పాయింట్స్ ; అల్లు అర్జున్ నటన యాక్షన్ సీన్స్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మైనస్ పాయింట్స్ ; సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్లు స్క్రీన్‌ప్లే క్లైమాక్స్ - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
అల్లు అర్జున్ చాలా కష్టపడ్డారు.. వైరల్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ 'నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా'. ఈ మూవీ కోసం బన్నీ పడ్డ కష్టానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదే క్యాప్ ట్రిక్. లవర్ ఆల్సో.. ఫైటర్ ఆల్సో అనే పాట కోసం బన్నీ ఎంతగానో శ్రమించారు. ఎందుకంటే అందులో క్యాప్‌తో చేసే చిన్న గిమ్మిక్కుల కోసం, సీన్ ఫర్ఫెక్ట్గా రావడానికి బన్నీ యత్నించారు. ఏడాది సమయం పట్టే ఎన్నో ట్రిక్కులను బన్నీ హార్డ్‌వర్క్‌తో కేవలం రెండు నెలల సమయంలోపే నేర్చుకున్నారంటూ యూనిట్ పేర్కొంది. దీనిపై దర్శకుడు వక్కంతం వంశీ, ఇతర యూనిట్ మాట్లాడుతూ బన్నీ నిబద్ధతను కొనియాడారు. ప్రతిరోజు షూటింగ్ అయిపోవడం. ప్రతిరోజూ షూటింగ్ అయిపోగానే అల్లు అర్జున్ క్యాప్ ట్రిక్ ట్రై చేయడం. అది కేవలం ట్రిక్ కాదండీ. అల్లు అర్జున్ రెండు నెలల కష్టమండీ. ఈ క్యాప్ ట్రిక్ కోసం ఆయన ఎంత కష్టపడ్డారో నాకు తెలుసునండీ అని వక్కంతం వంశీ అన్నారు. లగడపాటి శ్రీధర్, నాగబాబు సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ మే 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. బన్నీ క్యాప్ ట్రిక్స్ వీడియో మీ కోసం.. -
బన్నీ ఆ పాట కోసం చాలా కష్టపడ్డారు..!
-
బన్నీ అభిమానులకు గుడ్ న్యూస్
సాక్షి, హైదరాబాద్: మెగా హీరో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన మూవీ 'నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా'. లగడపాటి శ్రీధర్, నాగబాబు సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ మే 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రానికున్న క్రేజ్ దృష్ట్యా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఐదవ షో (ప్రత్యేక షో) వేసుకునేందుకు ప్రభుత్వాలు అనుమతి ఇచ్చినట్టు నిర్మాతలు ప్రకటించారు. ఈ నెల 4వ తేదీ నుంచి ఐదు షోలు ప్రదర్శించేందుకు అనుమతి ఇవ్వడంతో చిత్ర యూనిట్ హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ... అల్లు అర్జున్ హీరోగా నటించిన నా పేరు సూర్య చిత్రానికి ఎంతటి క్రేజ్ నెలకొందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ చిత్ర ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ అయిన తర్వాత ఆ క్రేజ్ డబుల్ అయింది. మే 4న రిలీజ్ కాబోతున్న ఈ చిత్రానికి ఐదవ ఆటను కూడా ప్రదర్శించుకునేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అనుమతినివ్వడం చాలా సంతోషంగా ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చేస్తున్న కృషిలో ఇది ఓ భాగం. ఓవైపు వేసవి సెలవులు కావడం... మరోవైపు ఈ సినిమాకు విపరీతమైన డిమాండ్ ఉండటంతో మరో షోకు అనుమతి ఇవ్వడం నిజంగా సంతోషించదగ్గ విషయం. ఈ సందర్భంగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు మా చిత్ర యూనిట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. -
ప్రయోగానికి రెడీ అవుతున్న బన్నీ
ఈ శుక్రవారం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బన్నీ సరికొత్త లుక్‌లో దర్శనమిస్తున్నాడు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాతో మరో ఘన విజయం ఖాయం అన్న నమ్మకంతో ఉన్నాడు. ఈ సినిమా తరువాత బన్నీ చేయబోయే సినిమాపై చర్చ మొదలైంది. వరుసగా కమర్షియల్ ఎంటర్టైనర్లు చేస్తూ వస్తున్న అల్లు అర్జున్ తన నెక్ట్స్ సినిమా కాస్త డిఫరెంట్‌గా చేసే ఆలోచనలో ఉన్నాడట. లింగుస్వామి దర్శకత్వంలో గతంలో ఓ సినిమా ప్రారంభమైనా ఆ సినిమా ఇప్పట్లో పట్టాలెక్కే ఛాన్స్ కనిపించటం లేదు. దీంతో ప్రయోగాత్మక చిత్రాల దర్శకుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట బన్నీ. ఈ సినిమాతో పాటు కొరటాల శివ దర్శకత్వంలో బన్నీ సినిమా ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. మరి వీటిలో బన్నీ ఏ ప్రాజెక్ట్‌ను ముందుగా స్టార్ట్ చేస్తాడో చూడాలి. -
నా పేరు సూర్య ప్రీ రిలీజ్ హైలైట్స్
-
ఇండియా టీమ్
-
హెచ్బీఓలో బన్నీ నా పేరు సూర్య
-
అమెరికన్ ఛానల్లో బన్నీ ప్రమోషన్స్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. లగడపాటి శ్రీధర్, నాగబాబు సంయుక్తం నిర్మిస్తున్న ఈ సినిమా మే 4న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు భారీ స్థాయిలో జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను అమెరికన్ టీవీ ఛానల్ హెచ్బీఓలో ప్రారంభించారు చిత్రయూనిట్. హాలీవుడ్ ప్రీమియర్ లీగ్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోలో కనిపించిన బన్నీ కార్యక్రమానికి సంబంధించిన వివరాలతో పాటు మే 4న రిలీజ్ అవుతున్న నా పేరు సూర్య చూడాలంటూ కోరారు. వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అను ఇమ్మాన్యూల్ హీరోయిన్గా నటిస్తుండగా అర్జున్, శరత్ కుమార్‌లు ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. -
ప్రీ రిలీజ్ వేడుకలో అల్లు ఆర్జున్ ఎంట్రీ అదుర్స్
-
‘ఇండియా కావాలి.. ఇచ్చెయ్’
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. రచయిత వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బన్నీ ఆర్మీ అధికారిగా నటిస్తున్నాడు. మే 4న రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను చిత్రయూనిట్ రిలీజ్ చేశారు. సినిమాలో బన్నీ క్యారెక్టరైజేన్ను రివీల్ చేస్తూ రూపొందించిన ఈ ట్రైలర్లో సినిమాలోని ఇతర కీలక పాత్రధారులని పరిచయం చేశారు. అల్లు అర్జున్ సరసన అను ఇమ్మాన్యూల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్, శరత్‌కుమార్, బొమన్ ఇరానీ, నదియాలు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న బన్నీ నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా సినిమాతో మరోసారి ఘనవిజయం సాధిస్తాడని నమ్మకంగా ఉన్నారు ఫ్యాన్స్.