అల్లు అర్జున్‌ పెద్ద మనసు..! | Allu Arjun Meet His Fan Dev Sai Ganesh Suffering From Cancer | Sakshi
Sakshi News home page

Published Sun, May 6 2018 12:01 PM | Last Updated on Sun, May 6 2018 12:02 PM

Allu Arjun Meet His Fan Dev Sai Ganesh Suffering From Cancer - Sakshi

కేన్సర్‌తో బాధపడుతున్న అభిమాని దేవసాయి గణేష్‌తో అల్లు అర్జున్‌

విశాఖపట్టణం సమీపంలోని అనకాపల్లిలో నివసించే దేవసాయి గణేష్‌ అల్లు అర్జున్‌కు వీరాభిమాని. కొంత కాలంగా బోన్‌ కేన్సర్‌తో బాధపుడుతున్న గణేష్‌ తన అభిమాన కథనాయకుడ్ని ఒక్కసారి చూడాలనుకున్నాడు. ఈ విషయం బన్నీకి వరకు వెళ్లింది. కొంతకాలంగా నా పేరు సూర్య సినిమాతో బిజీగా ఉన్న బన్నీ.. సినిమా విడుదల కావటంతో ఫ్రీ అయ్యాడు. దీంతో కష్టాల్లో ఉన్న తన అభిమానిని కలిసేందుకు బన్నీ స్వయంగా తన ఇంటికి వెళ్లాడు. కష్టాల్లో ఉన్న అభిమానికి ఆర్థిక సాయం కూడా అంధించాడు

తన ఫేవరెట్‌ హీరో తన కోసం రావటంతో సాయి గణేష్‌ ఆనందానికి అవధుల్లేవు. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు డివైడ్‌ టాక్‌ వచ్చినా.. కలెక్షన్ల పరంగా మాత్రం దూసుకుపోతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement