పుష్ప క్రేజ్‌ మామూలుగా లేదుగా.. ఏకంగా 1600 కిలోమీటర్లు! | Icon Star Allu Arjun Fan Surprise Coming To Hyderabad On Cycle To Meet His Hero, Video Goes Viral | Sakshi
Sakshi News home page

Allu Arjun Fan Viral Video: ఐకాన్ స్టార్ క్రేజ్‌ అంటే ఇది.. సైకిల్‌పై రాష్ట్రాలు దాటి!

Published Wed, Oct 16 2024 2:19 PM | Last Updated on Wed, Oct 16 2024 4:50 PM

Icon Star Allu Arjun Fan Surprise Coming To Hyderabad To meet Him

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుష్ప మూవీ తర్వాత ఆయన రేంజ్‌ వరల్డ్‌ వైడ్‌గా పెరిగిపోయింది. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కు సైతం అల్లు అర్జున్ అంటే పిచ్చి అభిమానం. ఇక విదేశాల్లోనే అంత క్రేజ్ ఉంటే మనదేశంలో ఏ రేంజ్‌లో ఉంటుందో చూస్తేనే అర్థమవుతోంది.

తాజాగా ఓ వీరాభిమాని తన ఫేవరేట్ హీరోను కలిసేందుకు పెద్ద సాహసమే చేశాడు. యూపీలోని ‍అలీగఢ్‌కు చెందిన ఓ అభిమాని ఏకంగా 1600 కిలోమీటర్లకు పైగా సైకిల్‌పై హైదరాబాద్‌కు వచ్చాడు. అల్లు అర్జున్‌ను కలిసేందుకు సైకిల్‌పై వచ్చి తన అభిమానాన్ని చాటుకున్నాడు ఉత్తర్‌ప్రదేశ్‌ వాసి.

అల్లు అర్జున్ కోసం అభిమాని సాహసం

దీంతో అతని అభిమానానికి ఫిదా అయిన అల్లు అర్జున్‌ ఎమోషనల్ అయ్యాడు. అతన్ని అప్యాయంగా పలకరించి వివరాలు ఆరా తీశాడు. పుష్ప-2 ప్రమోషన్స్‌ కోసం యూపీకి వస్తే కచ్చితంగా కలుస్తానని ఐకాన్ స్టార్ అతనితో అన్నారు. తనను కలిసిన అభిమానికి అల్లు అర్జున్‌ మొక్కను బహుమతిగా ఇచ్చాడు. అతనికి మంచి భోజనం పెట్టించి.. తిరిగి బస్సులో పంపించాలని తన సిబ్బందికి సూచించారు బన్నీ. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement