పుష్పరాజ్‌ క్రేజ్‌.. అభిమాని కళకు ఫిదా అయిన బన్నీ! | Allu Arjun Responds On Fan Pushpa 2 Poster Art Drawing Video Goes Viral, Check Tweet Inside | Sakshi
Sakshi News home page

ALlu Arjun: దివ్యాంగుడైతేనేం.. గుండెను టచ్‌ చేశావ్.. అల్లు అర్జున్ ఫిదా!

Published Thu, Nov 28 2024 9:31 AM | Last Updated on Thu, Nov 28 2024 9:48 AM

ALlu Arjun Responds On Fan Create Pushpa 2 Postar Art Video Goes Viral

ఇప్పుడంతా పుష్ప-2 ఫీవర్ నడుస్తోంది. విడుదలకు మరో వారం రోజుల సమయం ఉండగానే హడావుడి మొదలైంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, కిస్సిక్ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.  వచ్చేనెల డిసెంబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లను షేక్ చేయనున్నాడు పుష్పరాజ్.

ప్రపంచవ్యాప్తంగా ఐకాన్‌ స్టార్‌కు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. పాన్ ఇండియా మాత్రమే కాదు.. వరల్డ్‌ వైడ్‌గా ఆయనకు ఫ్యాన్స్‌ ఉన్నారు. పుష్ప-2 రిలీజ్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ అభిమాని వినూత్నంగా తన ప్రేమను చాటుకున్నారు. దివ్యాండైనప్పటికీ పుష్పరాజ్‌ స్టైల్లో అల్లు అర్జున్‌ బొమ్మను గీశారు. తన కాళ్లతో అద్భుతమైన కళాఖండాన్ని ఆవిష్కరించారు. దీనికి సంబంధించిన వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

తన వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ..'అల్లు అర్జున్‌ సార్‌ దయేచేసి నా కళను చూడండి. మీకోసం పుష్ప బొమ్మను గీశాను. మిమ్మల్ని కలవాలన్న కోరిక ఉంది సార్. ఇట్లు ధీరజ్ సాత్విల్కర్'  అంటూ రాసుకొచ్చారు. ఆ వీడియో కాస్తా వైరల్ కావడంతో ఐకాన్ ‍స్టార్ అల్లు అర్జున్‌ స్పందించారు. నా గుండెను టచ్ చేశావ్ అంటూ అతనికి రిప్లై ఇచ్చారు బన్నీ.

బన్నీ రిప్లై ఇవ్వడంతో ధీరజ్‌ సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. మిమ్మల్ని ఒకసారి కలవాలి సార్.. నేను మీకు పెద్ద ఫ్యాన్ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఇది చూసిన బన్నీ ఫ్యాన్స్ సైతం సూపర్ ఆర్ట్ అంటూ ధీరజ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement