బన్నీ అభిమానులకు గుడ్ న్యూస్ | Naa Peru Surya Naa Illu India Special Show In AP And Telangana | Sakshi
Sakshi News home page

'నా పేరు సూర్య' స్పెషల్ షోలకు ఓకే!

Published Wed, May 2 2018 5:09 PM | Last Updated on Wed, May 2 2018 8:15 PM

Naa Peru Surya Naa Illu India Special Show In AP And Telangana - Sakshi

అల్లు అర్జున్

సాక్షి, హైదరాబాద్: మెగా హీరో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన మూవీ 'నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా'. లగడపాటి శ్రీధర్‌, నాగబాబు సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ మే 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రానికున్న క్రేజ్ దృష్ట్యా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఐదవ షో (ప్రత్యేక షో) వేసుకునేందుకు ప్రభుత్వాలు అనుమతి ఇచ్చినట్టు నిర్మాతలు ప్రకటించారు. ఈ నెల 4వ తేదీ నుంచి ఐదు షోలు ప్రదర్శించేందుకు అనుమతి ఇవ్వడంతో చిత్ర యూనిట్ హర్షం వ్యక్తం చేసింది. 

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ... అల్లు అర్జున్ హీరోగా నటించిన నా పేరు సూర్య చిత్రానికి ఎంతటి క్రేజ్ నెలకొందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ చిత్ర ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ అయిన తర్వాత ఆ క్రేజ్ డబుల్ అయింది. మే 4న రిలీజ్ కాబోతున్న ఈ చిత్రానికి ఐదవ ఆటను కూడా ప్రదర్శించుకునేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అనుమతినివ్వడం చాలా సంతోషంగా ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చేస్తున్న కృషిలో ఇది ఓ భాగం. ఓవైపు వేసవి సెలవులు కావడం... మరోవైపు ఈ సినిమాకు విపరీతమైన డిమాండ్ ఉండటంతో మరో షోకు అనుమతి ఇవ్వడం నిజంగా సంతోషించదగ్గ విషయం. ఈ సందర్భంగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు మా చిత్ర యూనిట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement